Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కరోనా కట్టడికి పఠాన్ బ్రదర్స్ భారీ సాయం!!

Yusuf, Irfan to distribute 10,000 kg rice and 700 kg potato amid COVID-19

న్యూఢిల్లీ: కరోనా కకలావికలంతో రోడ్డున పడ్డ అనేక మంది అభాగ్యులకు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్స్ పఠాన్ బ్రదర్స్ అండగా నిలిచారు. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్‌ నుంచి రక్షించేందుకు నిరుపేద ప్రజలకు మాస్క్‌లను పంచిన ఈ స్టార్ క్రికెటర్స్.. తాజాగా ఆకలితో అలమటిస్తున్న పేదల కడుపు నింపి తమ పెద్ద మనసు చాటుకున్నారు.

పదివేల కేజీల బియ్యం.. 700 కేజీల ఆలు..

పదివేల కేజీల బియ్యం.. 700 కేజీల ఆలు..

ఏకంగా పదివేల కేజీల బియ్యాన్ని, 700 కేజీల ఆలుగడ్డ(బంగాళదుంప)లను పంచి అభాగ్యుల ఆకలి తీర్చారు. ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు భారత ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో రెక్కాడితే కానీ డొక్కాడనీ జీవులు.. యాచకుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. బతుకు దెరువు కోసం నగరాలకు వచ్చిన కూలీల పరిస్థితి కూడా దారుణంగా తయారైంది. ఓ వైపు సొంతూళ్లకు వెళ్లేందుకు రవాణ సదుపాయం లేక.. మరోవైపు పనుల్లేక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ముందుకొచ్చిన క్రీడాలోకం..

ముందుకొచ్చిన క్రీడాలోకం..

అభాగ్యులను ఆదుకోవడానికి సంపన్నులు ముందుకు రావాలని, ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కేర్స్‌ ఏర్పాటు చేశారు. ఇప్పటికే సెలబ్రిటీలు భారీ ఎత్తున విరాళాలు ప్రకటించారు. క్రీడాలోకం కూడా తమ సాయాన్ని ప్రకటించింది. విరాట్ కోహ్లీ దంపతులు రూ.3 కోట్లు, సచిన్, గంగూలీ రూ.50 లక్షలు, రోహిత్ శర్మ 80 లక్షలు, యువరాజ్ 50 లక్షలు.. ఇలా ప్రతీ ఒక్కరు తమకు తోచిన సాయాన్ని అందించారు.

ఈ క్రాకర్స్ ఎక్కడ కొన్నారు? '9 PM, 9 minute'‌పై అశ్విన్ సెటైర్స్!!

సాయం చేయడానికి తాము రెడీ...

సాయం చేయడానికి తాము రెడీ...

అయితే పఠాన్ బ్రదర్స్ మాత్రం నేరుగా బాధితులనే ఆదుకుంటూ తమ పెద్ద మనసును చాటుకుంటున్నారు. తమ సాయంపై యూసఫ్ పఠాన్ క్రిక్‌ట్రాకర్‌తో మాట్లాడుతూ..‘ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి తమకు చేతనైన సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాం. రాబోయే రోజులు అత్యంత కీలకం. దయచేసి ప్రజలెవరూ బయటకు రావద్దు. ప్రతీ ఒక్కరు ఇంట్లోనే ఉంటూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి'అని యూసఫ్ తెలిపాడు.

క్రాకర్స్ కాల్చనంత వరకు..

క్రాకర్స్ కాల్చనంత వరకు..

దేశ సమైక్యతను చాటాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు ఇర్ఫాన్ పఠాన్ మద్దతు తెలిపాడు. ‘ఈ ఒక్కసారే కాదని.. లైఫ్‌లైమ్ భారత్ సమైక్యంగా ఉండాలి'అని ట్వీట్ చేశాడు. అయితే ప్రజలు క్రాకర్స్ కాల్చనంతవరకు ఈ 9pm9minute కార్యక్రమం బాగుంటుందని మరో ట్వీట్‌లో తెలిపాడు. ఇక పఠాన్ భయపడినట్టే కొందరూ ఔత్సాహికులు పటాసులు కాల్చుతూ.. వీధుల్లో తిరుగుతూ.. అత్యుత్సాహం ప్రదర్శించారు.

Story first published: Monday, April 6, 2020, 15:32 [IST]
Other articles published on Apr 6, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+