Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఈ క్రాకర్స్ ఎక్కడ కొన్నారు? '9 PM, 9 minute'‌పై అశ్విన్ సెటైర్స్!!

Ravichandran Ashwin asks When and where did people buy crackers from?

హైదరాబాద్: కరోనా కట్టడికి యావత్ భారతం ఐక్యంగా పోరాడుతుందనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ '9 PM, 9 minute' కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ పిలుపునకు దేశవ్యాప్తంగా అనూహ్య స్పందన లభించింది. కశ్మీర్ నుంచి కన్యా కుమారి దాకా.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా.. ప్రతీ ఒక్కరు ఆదివారం రాత్రి 9 నిమిషాల పాటు లైట్లను ఆపేసి.. ఇంటి గడపల ముందు, బాల్కానీల్లో నలుదిక్కులా దీపంతల్లో జ్యోతులు వెలిగించి సంఘీభావం తెలిపారు.

పూరి గుడిసే నుంచి..

పూరి గుడిసే నుంచి..

చిన్న, పెద్ద తేడా లేదు.. కులం, మతం అనే భేదం లేదు .. పూరి గుడిసే, అపార్టమెంట్ అనే వ్యత్యాసం లేదు.. అందరూ ఈ ఐక్యతా జ్యోతిలో పాలుపంచుకున్నారు. మహమ్మారిపై పోరాటానికి మేము సైతం అంటూ సమైక్యతను చాటారు. యావత్ క్రీడాలోకం కూడా ప్రధాని పిలుపుకు మద్దతును ప్రకటిస్తూ ప్రమిదలు వెలిగించింది. గత నెల ‘23న జనతా కర్ఫ్యూ'కు కూడా ఇదే విధమైన మద్దతు లభించింది.

ఇది నిజంగా వండర్..

అయితే లాక్‌డౌన్ నిబంధనలతో భౌతిక దూరాన్ని పాటిస్తూ.. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసినవారు కొందరైతే.. రూల్స్‌ను తుంగలోకి తొక్కి అత్యుత్సాహం ప్రదర్శించిన వారు మరికొందరూ.. జనతా కర్ఫ్యూ రోజు గుంపులు గుంపులుగా చేరి సంఘీభావం ప్రకటించగా.. నిన్న ఏకంగా టపాసులు కాల్చి ప్రధాని పిలుపు వెనుక ఉన్న ఉద్దేశానికి తప్పుడు అర్ధం తీసుకొచ్చారు. ముఖ్యంగా గల్లీల్లో గుంపులుగా చేరి భారీ స్థాయిలో పటాసులు కాల్చి ఇతరులకు ఇబ్బందులు కలిగించారు. సరిగ్గా ఇలాంటివారిని ఉద్దేశించే టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తనదైన శైలిలో వ్యంగ్యస్త్రాలు సంధించాడు.

‘నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే వీరందరూ ఈ క్రాకర్స్ ఎక్కడ కొన్నారు? అఫ్‌కోర్స్.. ఎప్పుడైనా క్యూ పద్దతి పాటించడం మాత్రం ముఖ్యం'అని సెటైరిక్‌గా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్ ‌చల్ చేస్తుంది.

ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉంది..

ప్రజల అత్యుత్సాహంపై టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తనదైన శైలిలో స్పందించాడు. ‘అందరూ ఇంట్లోనే ఉంటూ ఆరోగ్యంగా ఉండండి. వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకోవద్దు. ప్రపంచకప్ గెలవడానికి ఇంకా సమయం ఉంది'అని సెటైరిక్‌గా ట్వీట్ చేశాడు. ఈ '9 PM, 9 minute' కార్యక్రమానికి మద్దతుగా రోహిత్ తన కుటుంబ సభ్యులతో కలిసి దీపాలను వెలిగించాడు. వీటికి సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.

ఇక అంతకు ముందు ‘దేశంలోని ప్రజలు అంతా కూడా ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపులో భాగంగా దీప ప్రజ్వలనకు మద్దతుగా నిలబడాలి. ఇదొక టెస్టు మ్యాచ్‌. ఈ టెస్టు మ్యాచ్‌ను గెలవడంపై మన జీవితాలు ఆధారపడి ఉన్నాయి. మీ సంఘీ భావాన్ని ఘనంగా చాటండి' అని రోహిత్ అభిమానులకు సూచించాడు.

క్రీడాకారులతో మోదీ కాన్ఫరెన్స్..

క్రీడాకారులతో మోదీ కాన్ఫరెన్స్..

ఇటీవలే క్రీడా రంగానికి చెందిన 49 మంది ప్రముఖులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు, ఈ మహమ్మారిని అరికట్టేందుకు క్రీడాకారుల నుంచి కావాల్సిన సహకారంపై వారితో ఆయన చర్చించారు. ఈ కార్యక్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, మహిళా బాక్సర్ మేరీ కోమ్ తదితరులు ఉన్నారు. పీటీ ఉష, పుల్లెల గోపీచంద్, విశ్వనాథన్ ఆనంద్, హిమదాస్, బజ్రంగ్ పూనియా, పీవీ సింధు, రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, ఛటేశ్వర పూజారా తదితరులు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

Story first published: Monday, April 6, 2020, 14:37 [IST]
Other articles published on Apr 6, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+