తండ్రైనా అంటూ..
ఈ ఏడాది ఆగస్టులో టీమిండియా విరాట్ కోహ్లీ, అతని సతీమణి, బాలీవుడ్ హీరోయిన అనుష్క శర్మ తమ అభిమానులకు శుభవార్త చెప్పారు. జనవరిలో తల్లిదండ్రులం కాబోతున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి దిగిన ఫొటో నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. ఈ ఫొటోలో గర్భంతో ఉన్న అనుష్కను కోహ్లీ పట్టుకోనుండగా.. బాగా వైరల్ అయింది. ఈ ఫొటోనే కాదు.. ఈ ట్వీట్ కూడా ఈ ఇయర్ బెస్ట్‌గా నిలిచింది. ఎక్కువ మంది లైక్ చేసిన ట్వీట్‌గా రికార్డు సృష్టించింది.
సచిన్ ఫ్యామిలీ.. బాబా సెహ్వాగ్..
ఫాదర్స్ డే సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన కుమార్తె సారా టెండూల్కర్, కుమారుడు అర్జున్ టెండూల్కర్‌తో గడిపాడు. ఆ రోజు వారితో కలిసి దిగిన ఫొటోను ట్విటర్‌లో పంచుకున్నాడు. యోగా చేస్తూ ముగ్గురూ ఒకే భంగిమలో ఫోజిచ్చారు. ఇది కూడా అభిమానులను ఆకట్టుకుంది. ఈ ఏడాది అమెరికాలో కరోనా వైరస్ విలయ తాండవం చేసిన సంగతి తెలిసిందే. దాంతో అనేక మంది కన్నుమూశారు. ఆ సమయంలో మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బాబా అవతారమెత్తి ఓ సరదా పోస్టు పెట్టాడు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవాలని పేర్కొంటూ ఆశీర్వదిస్తున్నట్లు ఉన్న తన బాబా ఫొటోను పంచుకున్నాడు.
రోహిత్.. దీపావళి సెలబ్రేషన్..
రోహిత్ శర్మ ఈసారి దీపావళి పండుగను ప్రత్యేకంగా జరుపుకున్నాడు. ముంబై కెప్టెన్‌గా రికార్డు స్థాయిలో ఐదోసారి ఐపీఎల్ టైటిల్ సాధించి తిరిగి భారత్‌కు వచ్చాక కుటుంబ సభ్యులతో కలిసి పండుగ చేసుకున్నాడు. ఆరోజు రాత్రి భార్య రితిక, కుమార్తెతో మిరుమిట్లు గొలిపే వెలుగుల్లో తీసుకున్న అందమైన ఫొటో ఇది. ఈ ఏడాది ఆగస్టు 15న సురేశ్ రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి తన అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే. అయితే, మార్చిలో తన సతీమణి ప్రియాంక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ చిట్టి రైనాకు రియో అనే పేరు పెట్టారు. లాక్‌డౌన్ సడలింపులిచ్చాక రైనా విహార యాత్రకు వెళ్లాడు. ఈ సందర్భంగా తన కుమారుడితో సముద్రం పక్కన నిల్చొని తీసుకున్న అందమైన మధుర జ్ఞాపకం.
సూర్యుడితో పోటీ పడుతూ ధావన్..
టీమ్‌ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్దగా మెరవకున్నా ఐపీఎల్‌లో దంచికొట్టిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో 2 శతకాలు, 4 అర్ధ శతకాలతో మొత్తం 618 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఒక సందర్భంలో సూర్యుడితో పోటీపడీ మరీ ప్రాక్టీస్ చేశాడు. ఆహ్లాదకరమైన వాతావరణంలో సూర్యుడి చెంతలో ప్రాక్టీస్ చేసిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు. సూర్యుడు భగభగా మండుతుంటే తాను కూడా లోలోపల రగిలిపోతున్నట్లు పేర్కొన్నాడు.
అప్పుడప్పుడూ తన మ్యాజిక్ ట్రిక్కులతో అందరినీ అలరించే శ్రేయస్ అయ్యర్ ఈసారి మరో విధంగా ఆకట్టుకున్నాడు. ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ బూర్జ్ ఖలీఫా ముందు యోగాసనం చేస్తున్న ఫొటోను ఓ సందర్భంలో తన ట్విటర్‌లో పోస్టు చేశాడు. బహుశా ఐపీఎల్ జరిగే సమయంలో ఆ ఫొటో తీసి ఉండొచ్చు. రాత్రిపూట లైట్ల వెలుతురుల్లో మెరిసే బూర్జ్ ఖలీఫా ముందు శ్రేయస్ తీసుకున్న ఫొటో అందర్ని ఆకట్టుకుంది.


Click it and Unblock the Notifications

ముంబై పోలీసుల అరెస్ట్‌పై స్పందించిన సురేశ్ రైనా!










