Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముంబై పోలీసుల అరెస్ట్‌పై స్పందించిన సురేశ్ రైనా!

Suresh Raina regrets ‘unintentional’ incident at Mumbai club

న్యూఢిల్లీ: ముంబై పోలీసులు అరెస్ట్ వ్యవహారంపై టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా స్పందించాడు. తాను ఎలా అరెస్ట్ అయ్యానో ఓ ప్రకటన ద్వారా వివరించాడు. మహారాష్ట్ర ప్రభుత్వ నిబంధనలపై అవగాహన లేకనే ఈ తప్పిదం జరిగిందని స్పష్టం చేశాడు. ముంబై విమానాశ్రయానికి సమీపంలో ఉన్న డ్రాగన్‌ఫ్లై క్లబ్‌పై పోలీసులు జరిపిన రైడ్‌లో పట్టుబడిన రైనాను అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు భారత మాజీ క్రికెటర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. ఈ రైడ్‌లో మొత్తం 34 మందిని అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసులు పేర్కొన్నారు.

షూటింగ్ కోసమే..

షూటింగ్ కోసమే..

అయితే ఓ షూటింగ్ కోసం రైనా ముంబై వెళ్లగా.. అది ఆలస్యమైందని, అంతలోనే ఓ స్నేహితుడు డిన్నర్ కోసం ఆ క్లబ్‌కు ఆహ్వానించాడని అతని మేనేజ్‌మెంట్ ఓ ప్రకటనలో పేర్కొంది. ముంబై ప్రొటోకాల్స్‌పై రైనాకు ఏమాత్రం అవగాహన లేదని స్పష్టం చేసింది.‘షూటింగ్ కోసం సురేశ్ రైనా ముంబైలో ఉన్నాడు. కానీ అది ఆలస్యం అవ్వడంతో ఓ స్నేహితుడి డిన్నర్ ఆహ్వానం మేరకు ఆ క్లబ్‌కు వెళ్లాడు.

నిబంధనలపై అవగాహన లేదు..

నిబంధనలపై అవగాహన లేదు..

కానీ లోకల్ టైమింగ్స్ ప్రొటోకాల్స్ గురించి రైనాకు అవగాహన లేదు. పోలీసుల రైడ్‌తో నిబంధనలను తెలుసుకున్నా రైనా వెంటనే వాటిని పాటించాడు. దురదృష్టవశాత్తు జరిగిన ఈ ఘటనపై అతను పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. రైనా ఎప్పుడూ ప్రభుత్వాలు నిర్దేశించే నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తాడు. వాటి పట్ల అత్యంత గౌరవంగా ఉంటాడు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తపడుతాడు'అని రైనా మేనేజ్‌మెట్ ఆ ప్రకటనలో పేర్కొంది.

34 మందిపై

34 మందిపై

రైడ్‌లో పట్టుబడిన సురేష్ రైనాతో సహా 34 మందిపై ఐపీసీ సెక్షన్ 188, 269, 34 కింద పోలీసులు కేసు నమోదు చేశారని తెలుస్తోంది. కరోనా వైరస్ నిబంధనలు, ప్రొటోకాల్‌కు విరుద్ధంగా (ఎక్కువ సమయం) అక్కడ నిర్వహించిన మందు పార్టీలో పాల్గొన్నందుకు వారిపై కేసులు నమోదయ్యాయి. బ్రిటన్‌లో వ్యాప్తి చెందుతున్న కొత్త కరోనా వైరస్ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా మహారాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూను ప్రకటించింది. అయితే ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తూ నిర్వాహకులు క్లబ్‌ను తెరిచి ఉంచారు. పైగా క్లబ్‌లో ఏ ఒక్కరూ.. భౌతిక దూరం, మాస్క్‌లు ధరించలేదని సమాచారం.

వ్యక్తిగత కారణాలతో

వ్యక్తిగత కారణాలతో

సురేష్ రైనా ఈ ఏడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటించిన అరగంటలోనే ఈ ఎడమచేతివాటం బ్యాట్స్‌మన్‌ సైతం తన నిర్ణయాన్ని వెల్లడించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. అనంతరం యూఏఈలో జరిగిన ఐపీఎల్‌ 2020 నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు. ముందు యూఏఈ వెళ్లినా.. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఇక జనవరి 10 నుంచి ప్రారంభమయ్యే దేశవాళీ టీ20 లీగ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రైనా బరిలోకి దిగుతాడని ప్రచారం జరుగుతుంది.

India vs Australia: రవీంద్ర జడేజా కోసం మా తెలుగోడిని తప్పించాలా? ఇలా అయితే టెస్ట్‌లు ఎవరు ఆడరు!

Story first published: Tuesday, December 22, 2020, 18:50 [IST]
Other articles published on Dec 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+