Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సౌతాఫ్రికాపై ఆసీస్ ఘన విజయం.. WTC పాయింట్స్ టేబుల్‌లో భారత్ స్థానం ఏంటంటే..?

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2027లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడు టెస్ట్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. డర్బన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో సమష్టిగా రాణించిన ఆస్ట్రేలియా 214 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో డబ్ల్యూటీసీ 2027 పాయింట్స్ టేబుల్‌లో ఆస్ట్రేలియా తమ అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.

ఈ మ్యాచ్‌కు ముందే ఈ సైకిల్‌లో టాప్ పొజిషన్‌లో కొనసాగిన ఆసీస్.. తాజా విజయంతో తమ విన్నింగ్ పర్సంటేజ్‌ను 81.82 శాతానికి పెంచుకుంది. ఇప్పటి వరకు ఈ సైకిల్‌లో 11 టెస్ట్‌లు ఆడిన ఆస్ట్రేలియా 9 విజయాలు, 2 పరాజయాలతో మొత్తం 108 పాయింట్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ఒక్క మ్యాచ్‌తో మారిపోయిన లెక్కలు: డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో బిగ్ ట్విస్ట్!

ఒక్క మ్యాచ్‌తో మారిపోయిన లెక్కలు: డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో బిగ్ ట్విస్ట్!

దిగజారిన సౌతాఫ్రికా..

మరోవైపు ఘోర పరాజయంతో డిఫెండింగ్ ఛాంపియన్ సౌతాఫ్రికా 72.22 విన్నింగ్ పర్సంటేజీతో మూడో స్థానానికి పడిపోయింది. ఈ సైకిల్‌లో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లే ఆడిన సౌతాఫ్రికా మూడు మాత్రమే గెలిచి 2 మ్యాచ్‌ల్లో ఓడింది. బంగ్లాదేశ్ 6 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 2 పరాజయాలు, 1 డ్రాతో 55.56 విన్నింగ్ పర్సంటేజీతో నాలుగో స్థానంలో నిలవగా.. భారత్ 51.52 విజయాల శాతంతో ఐదో స్థానంలో కొనసాగుతోంది.

WTC Standings After Australia Beat South Africa by 214 Runs in Opening Test

భారత్ ఫైనల్ చేరాలంటే..?

ఈ సైకిల్‌లో భారత్ ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడి ఐదింటిలో మాత్రమే గెలిచింది. నాలుగు మ్యాచ్‌ల్లో ఓడి మరో రెండు మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. ఈ సైకిల్‌లో భారత్ ఇంకా 7 టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉంది. న్యూజిలాండ్‌తో 2, ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో తలపడాల్సి ఉంది.

భారత్‌కు ఫైనల్ బెర్త్ దక్కాలంటే ఈ ఏడు మ్యాచ్‌ల్లో ఒక్కటి కూడా ఓడిపోకూడదు. కనీసం 6 మ్యాచ్‌లు గెలవాలి. ఇంగ్లండ్, శ్రీలంక, వెస్టిండీస్, పాకిస్థాన్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. పాకిస్థాన్ 9 మ్యాచ్‌ల్లో 2 మాత్రమే గెలిచి అట్టడుగు స్థానంలో నిలిచింది.

ఇక మూడో ప్లేస్ అతనిదే.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం కష్టం: హనుమ విహారి

Also Read

ఇక మూడో ప్లేస్ అతనిదే.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం కష్టం: హనుమ విహారి

సంక్షిప్త స్కోర్లు..

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 390 ఆలౌట్(మ్యాట్ రేన్‌షా 190)

సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 314/6 డిక్లేర్డ్

సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 206 ఆలౌట్

Story first published: Tuesday, October 13, 2026, 18:05 [IST]
Other articles published on Oct 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+