ఇక మూడో ప్లేస్ అతనిదే.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం కష్టం: హనుమ విహారి
శ్రీలంకతో రెండో టెస్ట్ డ్రా చేసుకున్న టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరడం చాలా కష్టమని వెటరన్ బ్యాటర్ హనుమ విహారి అన్నాడు. శ్రీలంకతో రెండో టెస్ట్‌ను భారత్ గెలిచి ఉంటే డబ్ల్యూటీసీ అవకాశాలు ఇంకాస్త మెరుగ్గా ఉండేవని అభిప్రాయపడ్డాడు.
కొలంబో వేదికగా జరిగిన రెండో టెస్ట్‌ను టీమిండియా చేజేతులా డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే. సోనాల్ దినుషా అజేయ శతకంతో శ్రీలంక ఓటమిని తప్పించుకుంది. ఈ మ్యాచ్ ఫలితంపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన హనుమ విహారి.. శ్రీలంక పోరాట పటిమను ప్రత్యేకంగా కొనియాడాడు. ఈ సిరీస్‌ను భారత్ గెలిచినా.. శ్రీలంక మనసులను గెలిచిందని చెప్పుకొచ్చాడు.
శ్రీలంక మనసులను గెలిచింది..
'అద్భుతమైన పోరాటంతో శ్రీలంక మనుసులను గెలిచింది. సోనాల్ దినుషా అద్భుతంగా బ్యాటిగ్ చేశాడు. తన ఫస్ట్ క్లాస్ అనుభవం చూపించాడు. స్వీప్, రివర్స్ స్వీప్ షాట్స్‌తో భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. రెండు మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు చేశాడు. క్వాలిటి బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో అలా ఆడాడు. శ్రీలంక దిగ్గజాలైన కుమార సంగక్కర, మహేళ జయవర్దనే, సనత్ జయసూర్య వంటి దిగ్గజ ఆటగాళ్ల తరహాలో సోనాల్ దినుషా గొప్ప ఆటగాడిగా ఎదుగుతాడు.

మూడో స్థానం పడిక్కల్‌దే..
భారత్ విషయానికి వస్తే.. టాస్ గెలవడం కలిసొచ్చింది. దేవదత్ పడిక్కల్ అద్భుతమైన బ్యాటింగ్‌తో మూడో స్థానాన్ని భర్తీ చేశాడు. ఐపీఎల్, ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఫామ్‌ను కొనసాగించాడు. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ కూడా బాగా ఆడారు. ధ్రువ్ జురెల్ కూడా అద్భుతంగా ఆడాడు. టాప్-5లో ఆడే సామర్థ్యం తనకు ఉందని నిరూపించుకున్నాడు. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌ను బాగా ఆడాడు.
శుభ్‌మన్ గిల్ కూడా హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు. యశస్వి జైస్వాల్ వైఫల్యమే ఆందోళనకు గురిచేసే విషయం. అతను మినహా బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం అదరగొట్టింది. గత సిరీస్‌లతో పోల్చితో స్పిన్‌ను అద్భుతంగా ఆడింది.
సిరాజ్‌కు విశ్రాంతి ఇవ్వాల్సింది..
బౌలింగ్ విషయానికి వస్తే.. సిరాజ్ కాస్త అలసిపోయినట్లు కనిపించాడు. అతనికి ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి ఇచ్చి గుర్నూర్ బ్రార్‌ను ఆడించాల్సిందేమో. కుల్దీప్ యాదవ్ ఆడించినా బాగుండేది. సారాన్ష్ జైన్ వికెట్లు తీసినా.. అతని బౌలింగ్ శైలి శ్రీలంక పిచ్‌లకు సూటవ్వదు. చాలా స్లోగా బౌలింగ్ చేస్తాడు. దాంతో శ్రీలంక బ్యాటర్లు ఈజీగా స్వీప్ షాట్స్ ఆడారు. మానవ్ సుతార్ మాత్రం అదరగొట్టాడు. జడేజాకు పర్‌ఫెక్ట్ రిప్లేస్‌మెంట్ అతను. ఎలాంటి కండిషన్స్‌లోనైనా బౌలింగ్ చేయగలడు. ప్రసిధ్ కృష్ణ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం కష్టం..
ఈ సిరీస్‌ను భారత్ 2-0తో గెలవాల్సింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం కష్టం. 2-0తో గెలిస్తే పరిస్థితి మెరుగ్గా ఉండేది. భారత్ ఇంకా 7 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. అందులో 6 గెలవాలి. న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా రెండు టెస్ట్‌లు గెలవాలంటే అద్భుతం జరగాలి. ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై ఐదు టెస్ట్‌ల్లో విజయం సాధించాలి. ప్రాక్టికల్‌గా ఇది అసాధ్యం.'అని హనుమ విహారి అభిప్రాయపడ్డాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

