Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Women's T20 world Cup 2020: నారీ.. ధనాధన్‌ భేరి నేడే.. భారత్ vs ఆస్ట్రేలియా‌లో గెలిచేదెవరో?

Womens T20 world Cup 2020: India need to step up as a unit to banish ghosts of past

సిడ్నీ: పాత చరిత్రను పక్కన బెట్టి.. కొత్త తరానికి స్పూర్తినిచ్చే విజయాలను సాధించాలన్న ఏకైక లక్ష్యంతో భారత మహిళల టీమ్.. ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ కోసం సిద్ధమైంది. శుక్రవారం జరిగే తొలి లీగ్ మ్యాచ్‌లో బలమైన ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. సుదీర్ఘకాలంగా ఈ ఫార్మాట్‌లో తమదైన విజయాలు సాధించినా.. విశ్వ వేదికపై భారత్ ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయింది.

ఈసారైనా..

ఈసారైనా..

వ్యక్తిగత రికార్డులు సృష్టించిన మిథాలీ రాజ్, జులన్ గోస్వామిలాంటి టాప్ ప్లేయర్లు కూడా ఓ దశలో కప్ కోసం పోరాడి వెనక్కి తగ్గారు. గతంతో పోలిస్తే ఈసారి మన టీమ్‌ కాస్త మెరుగ్గా కనిపిస్తోంది. సరిగ్గా చెప్పాలంటే ఫార్మాట్‌కు తగిన విధంగా దూకుడు పెరిగింది. కోచ్‌ డబ్ల్యూవీ రామన్‌ మార్గనిర్దేశనంలో అమ్మాయిలు మరింతగా రాటుదేలారు. గత టోర్నీలాగే ఇప్పుడూ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోనే జట్టు బరిలోకి దిగుతోంది.

టెస్ట్ చాంపియన్‌షిప్‌లో గిదేం లెక్క? అంతా తొండి: విలియమ్సన్

ఆస్ట్రేలియానే ఫెవరేట్.. కానీ

ఆస్ట్రేలియానే ఫెవరేట్.. కానీ

ఆతిథ్య జట్టు, డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా, మాజీ చాంపియన్‌ ఇంగ్లండ్‌లతో పోలిస్తే ఇంకా కొంత వెనుకబడినట్లు అనిపిస్తున్నా... ఈ ఫార్మాట్‌లో సంచలనానికీ అవకాశం ఉంది. తొలి అడుగులోనే బలమైన కంగారులకు చెక్‌పెడితే టోర్నీ మొత్తం ఆత్మ విశ్వాసంతో ఆడొచ్చని భారత అమ్మాయిలు భావిస్తున్నారు. ఫామ్‌ ప్రకారం చూస్తే 2019 నుంచి భారత్‌ 10 టి20లు మ్యాచ్‌లు గెలిచి మరో 10 ఓడింది. ఇది కాస్త నిలకడలేమిని చూపిస్తోంది. ఇటీవల జరిగిన ముక్కోణపు టోర్నీలోనూ ఇదే ఫలితం పునారావృతమైంది.

మంధాన.. హర్మన్‌పైనే భారం..

మంధాన.. హర్మన్‌పైనే భారం..

గత రెండేళ్లుగా స్మృతి మంధాన అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచింది. 42 ఇన్నింగ్స్‌లలో ఆమె 1,243 పరుగులు చేసింది. స్ట్రయిక్‌ రేట్‌ కూడా దాదాపు 130 ఉంది. బిగ్‌బాష్‌ లీగ్‌లోనూ ఆడిన అనుభవం ఉన్న స్మృతి ఇచ్చే ఆరంభంపైనే జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. మూడో స్థానంలో ఉన్న కెప్టెన్‌ హర్మన్‌ కూడా 933 పరుగులు సాధించింది. వీరిద్దరి బ్యాటింగ్, అనుభవం జట్టుకు పెద్ద బలం.

ఇక జెమీమా రోడ్రిగ్స్, ఇటీవల సంచలన బ్యాటింగ్‌ ప్రదర్శన కనబరుస్తున్న షెఫాలీ వర్మ కూడా దూకుడుగా ఆడితే భారత్‌కు బ్యాటింగ్‌లో తిరుగుండదు. భారీ షాట్లు ఆడగల వేద కృష్ణమూర్తి తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. ఈ ఫార్మాట్‌లో ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ కూడా కీలకం కానుంది. పేస్‌ బౌలింగ్‌లో శిఖా పాండే ఓవరాల్‌ రికార్డు గొప్పగా లేకపోయినా... ఇటీవల పునరాగమనం తర్వాత ఆమె చాలా మెరుగ్గా ఆడుతోంది. అన్నింటికి మించి స్పిన్‌ బలగంపై కూడా భారత్‌ నమ్మకం పెట్టుకుంది. భిన్నమైన శైలి గల పూనమ్‌ యాదవ్, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్‌ల ప్రదర్శన జట్టు గెలుపోటములను ప్రభావితం చేయవచ్చు.

అనుపమా బర్త్‌డే.. బుమ్రా ట్వీట్.. ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్?

మిడిల్ సమస్య..

మిడిల్ సమస్య..

భారత మహిళల జట్టును పూర్తిగా పరిశీలిస్తే మిడిలార్డర్‌తోనే పెద్ద సమస్య ఎదురవుతున్నది. నాకౌట్ స్టేజ్‌ల్లో ఒత్తిడిని అధిగమించే ప్లేయర్లు లేకపోవడం లోటుగా కనిపిస్తోంది. ఈ విషయంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ముందంజలో ఉన్నాయి. ఇక బౌలింగ్‌లో ఇండియా స్పిన్నర్లపై ఆధారపడటం కూడా కలవరపెడుతోంది. జులన్ గోస్వామి రిటైర్మెంట్ తర్వాత ఆ స్థాయిలో పేస్ విభాగాన్ని నడిపే బౌలర్ అందుబాటులో లేరు. ఆసీస్‌లో అన్నీ పేస్ పిచ్‌లు కావడంతో పేసర్ల అవసరం చాలా ఉంటుంది.

ఫుల్ జోష్‌లో ఆసీస్..

ఫుల్ జోష్‌లో ఆసీస్..

సన్నాహకంగా జరిగిన ట్రై సిరీస్ విజయంతో ఆసీస్ టీమ్ ఫుల్ జోష్‌లో ఉంది. జరిగిన ఆరు వరల్డ్‌కప్‌లో నాలుగుసార్లు విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా ఈ సారి కూడా టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. సొంతగడ్డపై జరుగుతుండటం ఆ జట్టుకు మరో సానుకూలాంశం. అయితే పాదం గాయంతో లీడ్ పేసర్ టేలా వ్లామింక్ ఈ మ్యాచ్‌కు దూరం కావడం ఆసీస్‌కు పెద్ద దెబ్బ. అయితే ఆలౌరౌండర్లకు కొదవలేకపోవడంతో ఒకరిద్దరు గాయపడినా ఆసీస్‌కు పెద్దగా ఇబ్బంది ఉండదు. టీమిండియా కూడా బలంగా ఉండటంతో రసవత్త పోరు జరగడం ఖాయం. ఈ మ్యాచ్ మధ్యాహ్నం గం. 1.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌-2లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

జట్ల అంచనా

భారత్: హర్మన్ ప్రీత్(కెప్టెన్), స్మృతి, షెఫాలీ, రోడ్రిగ్స్, దీప్తీ, భాటియా, డియోల్, అరుంధతి, శిఖా పాండే, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్

ఆస్ట్రేలియా: లానింగ్ (కెప్టెన్), హీలీ, మూనీ, గార్డెనర్, హైన్స్, మోలినెక్స్, జొనాసెన్, క్యారీ, కిమ్మిన్స్, షుట్

Story first published: Friday, February 21, 2020, 9:13 [IST]
Other articles published on Feb 21, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+