Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైభవ్ సూర్యవంశీ వేచి చూడాల్సిందే: మాజీ క్రికెటర్

ఐపీఎల్ 2026 సీజన్లో తన అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ.. తక్కువ కాలంలోనే భారత జాతీయ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా టీమిండియా తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ.. అనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌తో పాటు కొన్ని కీలక మ్యాచ్‌లలో అతనికి తుది జట్టులో నిలకడగా చోటు దక్కడం లేదు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీని ప్లేయింగ్ ఎలెవన్ నుంచి పక్కన పెట్టడం వెనుక గల అసలు కారణాలను భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా స్పష్టం చేశారు.

IND vs WI: అందుకే వైభవ్, నితీష్ రెడ్డి ఆడటం లేదు: శ్రేయస్ అయ్యర్

IND vs WI: అందుకే వైభవ్, నితీష్ రెడ్డి ఆడటం లేదు: శ్రేయస్ అయ్యర్

వైభవ్ సూర్యవంశీని టీ20 తుది జట్టులోకి ఎందుకు తీసుకోలేకపోతున్నారనే అంశంపై ఆకాష్ చోప్రా మాట్లాడుతూ.. కేవలం ఒకట్రెండు వైఫల్యాల కారణంగా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్‌ను జట్టు నుంచి తొలగించలేమని అభిప్రాయపడ్డారు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన సీనియర్ ఆటగాడిని కాదని కుర్రాడికి అవకాశం ఇవ్వడం కష్టమని ఆయన వెల్లడించారు. రాబోయే సిరీస్‌లలో వైభవ్ సూర్యవంశీ లేదా సంజు శాంసన్‌లలో ఒకరిని మాత్రమే ఎంచుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని.. ప్రస్తుతానికి సంజు శాంసన్ ఫామ్ దృష్ట్యా ఆయనను పక్కన పెట్టడం సాధ్యం కాదని ఆకాష్ చోప్రా తేల్చిచెప్పారు.

Why Vaibhav Sooryavanshi Must Wait for a Spot Former Cricketer Aakash Chopra Explains Full Details

సంజు శాంసన్ ప్రాముఖ్యతను వివరిస్తూ ఆకాష్ చోప్రా మరింత స్పష్టతనిచ్చారు. 2026 టీ20 ప్రపంచ కప్ లో సంజు శాంసన్ వరుసగా మూడు అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో జట్టును విజయపథంలో నడిపించాడని గుర్తుచేశారు. ఆ తర్వాత కొన్ని మ్యాచ్‌లలో తప్పులు జరిగినా, ప్రస్తుతం సంజు నిలకడగా రాణిస్తున్నాడని తెలిపారు. అందుకే సంజును కాదని వైభవ్ సూర్యవంశీని తుది జట్టులో ఆడించడం ప్రస్తుత పరిస్థితుల్లో సరికాదని తాను భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం!(వీడియో)

Also Read

ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం!(వీడియో)

అయితే వైభవ్ సూర్యవంశీ ప్రతిభను ఆకాష్ చోప్రా ఎంతగానో ప్రశంసించారు. వైభవ్ సూర్యవంశీ ఓ అద్భుతమైన, అత్యంత ప్రతిభావంతుడైన ఆటగాడని కొనియాడారు. వైభవ్ బ్యాటింగ్ శైలి చూడటానికి ఎంతో ఆనందాన్ని ఇస్తుందని, కానీ ప్రస్తుతానికి అతను టీమిండియా తుది జట్టులో చోటు కోసం కొంతకాలం వేచి చూడాల్సిందేనని స్ఫష్టం చేశారు. క్రీడాజీవితంలో కొన్నిసార్లు ఇలాంటి నిరీక్షణ తప్పదని, సమయం వచ్చినప్పుడు అతనికి కచ్చితంగా అవకాశాలు లభిస్తాయని ఆకాష్ చోప్రా ధీమా వ్యక్తం చేశారు.

గమనించాల్సిన విషయమేమిటంటే.. 2026 ఆసియా క్రీడల్లో వైభవ్ సూర్యవంశీకి రెండు మ్యాచ్‌లలో ఆడే అవకాశం లభించింది. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో 38 పరుగులు చేసి వైభవ్ సూర్యవంశీ.. పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మాత్రం కేవలం 15 పరుగులు మాత్రమే చేసి పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఈ కారణం వల్ల సంజు శాంసన్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. దీనికి ముందస్తుగా జింబాబ్వేతో జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మాత్రం వైభవ్ సూర్యవంశీ రెండు హాఫ్ సెంచరీలు సాధించి తన సత్తా నిరూపించుకున్నాడు. అయినప్పటికీ ప్రస్తుత జట్టు సమతుల్యత దృష్ట్యా అతను మరికొంత కాలం వేచి చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది.

Story first published: Tuesday, October 6, 2026, 19:20 [IST]
Other articles published on Oct 6, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+