Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరాట్ కోహ్లీని కొనియాడితే మీకు వచ్చిన నొప్పేంటి..? విమర్శకులపై షోయబ్ అక్తర్ ఫైర్!

Why shouldn’t I praise Indian players and Virat Kohli?: Shoaib Akhtar lashes out To critics

కరాచీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, భారత ఆటగాళ్లను ప్రశంసించినందుకు తనపై నోరుపారేసుకుంటున్న విమర్శకులపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ మండిపడ్డాడు. విరాట్ కోహ్లీని కొనియాడితే వారికి వచ్చిన నొప్పేంటని ఘాటుగా ప్రశ్నించాడు. సొంత యూట్యూబ్ చానెల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న క్రికెట్ మ్యాచ్‌లు, ఆటగాళ్లపై ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ సమీక్షలు చేస్తుండానే విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆటగాళ్లను కొనియాడుతుంటాడు. అదే రీతిలో విమర్శలు కూడా గుప్పిస్తుంటాడు.

ఘాటు వ్యాఖ్యలతో..

ఘాటు వ్యాఖ్యలతో..

ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీపై పలుమార్లు ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రస్తుత తరంలో ప్రపంచనెంబర్ వన్ బ్యాట్స్‌మన్ అంటూ కొనియాడాడు. అయితే ఇది నచ్చని కొందరు పాకిస్థాన్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు అక్తర్ తీరును తప్పుబట్టారు. శతృదేశానికి ఆటగాళ్లను ఎలా కొనియాడుతావంటూ మండిపడ్డారు. తాజాగా ఈ విమర్శలపై క్రికెట్ పాకిస్థాన్ వెబ్‌సైట్ వేదికగా స్పందించిన అక్తర్ తన ఘాటైన వ్యాఖ్యలతో విమర్శకుల నోళ్లు మూయించాడు.

భారతీయుడనే ద్వేషమే కదా..

భారతీయుడనే ద్వేషమే కదా..

‘నేను భారత ఆటగాళ్లను, విరాట్ కోహ్లీని ఎందుకు ప్రశంసించకూడదు? కోహ్లీ వంటి స్టార్ ప్లేయర్ పాకిస్తాన్‌లో కానీ, లేక ప్రపంచవ్యాప్తంగానైనా ఎవరైనా ఉన్నారా? కనీసం అతనికి దగ్గరగా ఉన్న ఆటగాడి పేరైనా చెప్పండి .? ప్రజలు ఎందుకు కోపంగా ఉన్నారో నాకైతే తెలియదు. వారు నన్ను విమర్శించే ముందు గణాంకాలను పరిశీలించాలి. కోహ్లీ భారతీయుడు కాబట్టి, అతన్ని ప్రశంసించవద్దనే ద్వేషాన్ని దృష్టిలో పెట్టుకోవాలని అనుకుంటున్నారా...? అని ఈ వరల్డ్ ఫాస్టెస్ట్ పేసర్ ప్రశ్నించాడు.

70 సెంచరీల కోహ్లీ..

70 సెంచరీల కోహ్లీ..

‘కోహ్లీ ఇప్పటికే 70 అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు. ప్రస్తుత తరం అంతర్జాతీయ క్రికెట్‌లో ఇన్ని సెంచరీలు చేసిన ఆటగాడు ఎవరైనా ఉన్నారా? భారత్‌కు అతను ఎన్ని సిరీస్‌లు అందించాడు? అలాంటి ఆటగాడని ఎలా పొగడకుండా ఉండాలి'అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం క్రికెట్‌లో 70 సెంచరీలతో ఉన్న విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఘనతను అందుకున్న మూడో క్రికెటర్‌గా, రెండో భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు. 100 సెంచరీలతో సచిన్ టెండూల్కర్ టాప్‌లో ఉండగా.. రికీ పాంటింగ్(71)తో కోహ్లీకన్నా ముందున్నారు.

టైటిల్ కరువు..

టైటిల్ కరువు..

ఇక టీ20ల్లో 2,794 రన్స్‌తో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్న కోహ్లీ.. 50.80 సగటుతో 24 హాఫ్ సెంచరీలు చేశాడు. 43 సెంచరీలు, 58 హాఫ్ సెంచరీలతో వన్డేల్లో నెంబర్ వన్‌గా ఉన్న ఈ భారత కెప్టెన్.. టెస్ట్‌ల్లో 27 సెంచరీలు చేశాడు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న కోహ్లీ .. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 2020 సీజన్ కోసం సమాయత్తం అవుతున్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును నడిపించనున్నాడు. ఆ జట్టు టైటిల్ కరువును తీర్చే ఏకైక లక్ష్యంతోనే బరిలోకి దిగనున్నాడు. గత 12 సీజన్లుగా ఆర్‌సీబీకి ఐపీఎల్ టైటిల్ అందని ద్రాక్షగానే ఉండిపోయింది.

ఓయ్ సర్ఫరాజ్.. వికెట్ల వెనుకాల నిద్రపోతున్నావా..? లేక స్టంపౌట్‌కు బ్యాట్స్‌మన్ పర్మీషన్ కావాలా?

Story first published: Thursday, September 3, 2020, 13:18 [IST]
Other articles published on Sep 3, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+