Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: 33 ఏళ్ల వయసులో భారత జట్టులో చోటు.. ఎవరీ సారాన్ష్ జైన్?

రెండు టెస్ట్‌ల సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను మంగళవారం సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే ఈ జట్టు‌లో 33 ఏళ్ల మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్ సారాన్ష్ జైన్‌కు అవకాశం దక్కడం అందర్నీ ఆశ్చర్యరపరిచింది.

మధ్యప్రదేశ్ తరఫున సుదీర్ఘ కాలంగా దేశవాళీ క్రికెట్ ఆడుతున్న సారాన్ష్ జైన్‌కు తొలిసారి టీమిండియా పిలుపు దక్కింది. స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయంతో తొలి టెస్ట్‌‌కు దూరమవడంతో సారాన్ష్ జైన్‌కు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. దాంతో ఈ మధ్యప్రదేశ్ వెటరన్ ఆల్‌రౌండర్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

ధోనీలా చేయబోయి.. ఈజీ రనౌట్ మిస్ చేసిన ఇషాన్ కిషన్!(వీడియో)

ధోనీలా చేయబోయి.. ఈజీ రనౌట్ మిస్ చేసిన ఇషాన్ కిషన్!(వీడియో)

ఎవరీ సారాన్ష్ జైన్?

మధ్యప్రదేశ్‌కు చెందిన సారాన్ష్ జైన్.. 2014లో దేశవాళీ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అప్పటి నుంచి మధ్యప్రదేశ్ ప్రధాన ఆటగాడిగా.. స్పిన్ ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు. సెంట్రల్ జోన్ టీమ్‌తో పాటు రెస్టాఫ్ ఇండియాకు కూడా సారాన్ష్ జైన్ ప్రాతినిథ్యం వహించాడు. ఇటీవల భారత్-ఏ తరఫున శ్రీలంక పర్యటనలో కూడా ఆడాడు. ఇప్పటి వరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 181 వికెట్లతో పాటు 2223 పరుగులు చేశాడు. లోయారార్డర్‌లో బ్యాటింగ్ చేయడం సారాన్ష్ జైన్ ప్రత్యేకత.

Who is Saransh Jain Who Earned Maiden India Test Call-Up at 33 For Sri Lanka Tour 2026

తండ్రి కూడా క్రికెటరే..

సారాన్ష్ జైన్ తండ్రి సుబోధ్ జైన్ కూడా క్రికెటరే కావడం గమనార్హం. సుబోధ్ జైన్ మధ్యప్రదేశ్ తరఫున రంజీ క్రికెట్ ఆడారు. రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన సుబోధ్ జైన్.. మధ్యప్రదేశ్ తరఫున 9 రంజీ మ్యాచ్‌లు ఆడాడు. భారత్ దేశానికి ఆడాలని సుబోధ్ జైన్ కూడా కలలు కన్నాడు. కానీ అది నెరవేరలేదు. ఆ కలను తన కొడుకు నెరవేర్చేందుకు రెడీ అయ్యాడు.

కొడుకు కెరీర్ దెబ్బతినవద్దని, తన క్యాన్సర్ చికిత్సను కూడా సారాన్ష్ జైన్‌కు తెలియకుండా సుబోధ్ జైన్ జాగ్రత్త పడ్డాడు. ఈ విషయాన్ని సారాన్ష్ జైన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 2014లో మధ్యప్రదేశ్ క్లబ్ తరఫున ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే సమయంలో తన తండ్రికి శస్త్ర చికిత్స జరిగిందని, ఆ విషయాన్ని తనకు చెప్పలేదని గుర్తు చేసుకున్నాడు. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తర్వాతే క్యాన్సర్ చికిత్సలో భాగంగా తన తండ్రి ముఖానికి సర్జరీ జరిగిందని తెలిసిందని పేర్కొన్నాడు.

ప్రముఖ దేశవాళీ కోచ్ చంద్రకాంత్ పండిట్ వద్ద సారాన్ష్ జైన్ ఆటలో మరింత రాటు దేలాడు. 2022లో రంజీట్రోఫీ గెలిచిన మధ్యప్రదేశ్ టీమ్ సారాన్ష్ జైన్ సభ్యుడిగా ఉన్నాడు. ముంబైతో చెన్నై వేదికగా జరిగిన ఫైనల్లో తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేయడంతో పాటు రెండు వికెట్లు తీసి మధ్యప్రదేశ్ చారిత్రాత్మక విజయంలో తనవంతు పాత్ర పోషించాడు.

శ్రీలంకతో టెస్ట్ సిరీస్.. భారత జట్టు ప్రకటన! తెలుగోడి పేరెత్తని బీసీసీఐ!

Also Read

శ్రీలంకతో టెస్ట్ సిరీస్.. భారత జట్టు ప్రకటన! తెలుగోడి పేరెత్తని బీసీసీఐ!

శ్రీలంక పర్యటనలో సత్తా చాటడంతో..

ఇటీవలే శ్రీలంక-ఏతో జరిగిన రెండు అనధికారిక టెస్ట్‌ల్లో భారత్-ఏ తరఫున సారాన్ష్ జైన్ బరిలోకి దిగాడు. రెండో అనధికారిక టెస్ట్‌లో 70 పరుగులు చేయడంతో పాటు 6 వికెట్లు తీసి భారత్-ఏ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన సారాన్ష్ జైన్.. భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.

దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణించినా.. సారాన్ష్ జైన్‌కు ఐపీఎల్‌లో ఆడే అవకాశం దక్కలేదు. ఐపీఎల్ 2024 నుంచి 2026 వరకు తన పేరును రిజిస్టర్ చేసుకున్నప్పటికీ.. ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. ఐపీఎల్‌తో సంబంధం లేకుండా దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటి భారత జట్టులో చోటు దక్కించుకున్న ఈ తరం ఆటగాడిగా సారాన్ష్ జైన్ నిలిచాడు.

Story first published: Tuesday, July 28, 2026, 15:11 [IST]
Other articles published on Jul 28, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+