Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీలా చేయబోయి.. ఈజీ రనౌట్ మిస్ చేసిన ఇషాన్ కిషన్!(వీడియో)

టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఘోర తప్పిదం చేశాడు. తన అలసత్వంతో ఈజీ రనౌట్‌ను మిస్ చేశాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో శనివారం జరిగిన రెండో టీ20లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇషాన్ కిషన్ ఈ తప్పిదంతో జింబాబ్వే టెయిలెండర్ న్యూమాన్ న్యామూరి రనౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ ట్రేడ్ మార్క్ కీపింగ్ చేయబోయి ఇషాన్ కిషన్ ఈ తప్పిదం చేశాడు.

అసలేం జరిగిందంటే..?

రవిబిష్ణోయ్ వేసిన 15వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఐదో బంతిని తడివాన్షే మారుమణి డీప్ బ్యాక్‌వార్డ్ పాయింట్ దిశగా ఆడి సింగిల్ తీసాడు. నాన్‌స్ట్రైకర్ న్యూమాన్ న్యామూరి డబుల్ కోసం ప్రయత్నించగా.. మారుమణి నిరాకరించాడు.

Ishan Kishan Misses Easy Run-Out Chance in India vs Zimbabwe 2nd T20I at Harare

అప్పటికే న్యామూరీ హాఫ్ క్రీజు ధాటాడు. ఫీల్డర్ బంతిని అందుకొని కీపర్ ఇషాన్ కిషన్‌కు అందించగా.. అతను క్యాజువల్‌గా బంతిని స్టంప్‌వైపు విసిరేసాడు. అది కాస్త వికెట్ స్టంప్స్‌ను మిస్సైంది. దాంతో ఇషాన్ కిషన్.. ఆశ్చర్యపోయాడు. బ్యాటర్ క్రీజులో లేడా? అన్నట్లు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ కీపర్‌గా చాలా తప్పిదాలు చేశాడు.

జింబాబ్వే ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్‌లో బ్రియాన్ బెన్నెట్ ఇషాన్ తప్పిదంతో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బెన్నెట్ బ్యాట్ ఎడ్జ్ తీసుకొని బంతి ఇషాన్ కిషన్ చేతిలో పడగా.. అతను అప్పీల్ చేయలేదు. అయితే ఈ తప్పిదాలు భారత్‌కు పెద్ద నష్టం చేయలేదు.

భారత్ ఘన విజయం..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 220 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్(44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 81), తిలక్ వర్మ(29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వైభవ్ సూర్యవంశీ(9 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 20) మెరుపులు మెరిపించగా.. శ్రేయస్ అయ్యర్(20 బంతుల్లో 4 ఫోర్లతో 25) పర్వాలేదనిపించాడు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజర్బానీ, రిచర్డ్ నగర్వ, బ్రాడ్ ఇవాన్స్, న్యూమాన్ న్యామురి, బ్రియాన్ బెన్నెట్ తలో వికెట్ తీసారు.

అనంతరం జింబాబ్వే 17.5 ఓవర్లలో 129 పరుగులకు కుప్పకూలింది. బ్రియాన్ బెన్నెట్(19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 32), ర్యాన్ బర్ల్(18 బంతుల్లో 2 ఫోర్లతో 20), మరుమని(19 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో అభిషేక్ శర్మ(3/17) మూడు వికెట్లు తీయగా.. యశ్ ఠాకూర్(2/30), ప్రిన్స్ యాదవ్(2/10) రెండేసి వికెట్లు పడగొట్టారు. రవి బిష్ణోయ్, శివమ్ దూబే, తిలక్ వర్మ తలో వికెట్ తీసారు. ఇరు జట్ల మధ్య ఆఖరి టీ20 ఆదివారం హరారే వేదికగా జరగనుంది.

Story first published: Saturday, July 25, 2026, 20:34 [IST]
Other articles published on Jul 25, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+