వకార్ యూనిస్ బౌలింగ్‌ను ది వాల్ రాహుల్ ద్రవిడ్ దంచికొట్టిన వేళ.!!

హైదరాబాద్: వకార్ యూనిస్.. పాకిస్థాన్ మాజీ పేసర్. 1990లో అత్యంత వేగవంతమైన బంతులతో బ్యాట్స్‌మన్‌ను గజగజలాడించిన బౌలర్. అతని పదునైన పేస్.. అనూహ్య స్వింగ్‌కు ఎంతటి బ్యాట్స్‌మన్ అయినా వికెట్ సమర్పించుకునేవాడు. వాటికి తోడు షార్ట్ పిచ్ బంతులతో అటాకింగ్ చేసేవాడు. అతని ధాటికి సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజ బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడ్డారు.

పరుగుల విధ్వంసం..
అలాంటి అతి వీరభయంకరమైన బౌలర్‌ను అప్పుడప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన యువ కెరటం ఉతికారేశాడు. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో.. వకార్ బౌలింగ్ కూడా మాములే.. అంతగా భయపడాల్సిన అవసరం లేదని ఇతర బ్యాట్స్‌మెన్‌కు చాటి చెప్పాడు. ఆ క్రికెటర్ ఎవరో కాదు.. భారత దిగ్గజం.. ది వాల్ రాహుల్ ద్రవిడ్. అవును.. కెరీర్ ప్రారంభంలోనే ఈ కర్ణాటక ఆటగాడు వకార్‌ను ఓ ఆటాడుకున్నాడు. వరుస బౌండరీలతో అతని ఓవర్‌ను చీల్చిచిండాడాడు.

వకార్‌కు చుక్కలు చూపించిన వేళ..
1996 సహారా కప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య కెనడా వేదికగా 5 వన్డేల ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. ఆ ఏడాదే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ద్రవిడ్.. ఈ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. నాలుగో వన్డేలో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ద్రవిడ్.. వకార్‌కు చుక్కలు చూపించాడు. అతడు వేసిన 8 ఓవర్లలో 4,4,2,6,3తో 5 బంతుల్లోనే 19 పరుగులు పిండుకొని విధ్వంసం సృష్టించాడు.
తొలి బంతిని థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీ తరలించిన దివాల్.. రెండో బంతి లెగ్‌సైడ్ కొట్టి మరో బౌండరీ సాధించాడు. మూడో బంతిని బ్యాక్ వర్డ్ దిశగా ఆడి క్విక్ డబుల్ తీశాడు. నాలుగో బంతిని లాంగ్ లెగ్‌సైడ్ వైపుగా భారీ సిక్సర్ కొట్టాడు. ఐదో బంతిని అద్భుత స్ట్రేట్ డ్రైవ్‌గా ఆడగా.. ఔట్ ఫిల్డ్ చిత్తడి కారణంగా బంతి నెమ్మదిగా వెళ్లడంతో 3 పరుగులు వచ్చాయి. చివరి బంతిని ఆడిన అజారుద్దిన్ మిడ్ వికెట్ మీదుగా బౌండరీ తరలించాడు. దీంతో వకార్ 23 పరుగులు సమర్పించుకున్నాడు.

ఓడిన భారత్..
ద్రవిడ్ మెరుపులు తర్వాత కొనసాగకపోవడంతో ఈ మ్యాచ్‌లో భారత్ 97 పరుగులతో ఘోర ఓటమి చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 8 వికెట్లకు 258 పరుగులు చేసింది. ఇజాజ్ అహ్మద్(90), ఇంజుమామ్ ఉల్ హక్(40) టాప్ స్కోర్లర్లుగా నిలిచారు. అనంతం లక్ష్య చేధనకు దిగిన భారత్ 161 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అజయ్ జడేజా(47), ద్రవిడ్ (25) టాప్ స్కోర్లర్లుగా నిలిచారు. పాక్ బౌలర్లు సంయుక్తంగా చెలరేగి భారత్ పతనాన్ని శాసించారు.

సిరీస్ కూడా దక్కలేదు..
ఈ ఐదు వన్డేల సిరీస్‌ను కూడా సచిన్ టెండూల్కర్ నేతృత్వంలోని భారత్ 3-2తో కోల్పోయింది. నాలుగో వన్డే ఓటమితో సిరీస్ సమం అవ్వగా.. ఫైనల్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠగా సాగింది. ఆఖరి క్షణం వరకు విజయం ఇరు జట్లను దోబుచులాడింది. చివరకు పాక్‌నే 2 వికెట్ల తేడాతో విజయం వరించింది. ఈ డిసైడర్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్లకు 264 రన్స్ చేసింది. రాహుల్ ద్రవిడ్(90), అజారుద్దీన్ (88) టాప్ స్కోరర్లుగా నిలిచారు. అనంతరం ఛేజింగ్‌కు దిగిన పాక్.. ఒక్క బంతి మిగిలుండగానే 8 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసి విజయాన్నందుకుంది. సయీద్ అన్వర్(80), సలీం మాలిక్(70)ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
మహ్మద్ షమీ భార్యపై మండిపడుతున్న ఫ్యాన్స్.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications