కోహ్లీ, ధోనీ కన్నా బుమ్రానే బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నర్: దిశా పటాని

న్యూఢిల్లీ: తెలుగు సినిమా'లోఫర్'తో సినీ పరిశ్రమకు పరిచయమైన నటి దిశా పటాని.. నేడు(జూన్ 23) 28వ పుట్టిన రోజు జరుపుకుంటుంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమమైన ఈ అందాల తార ఆ తర్వాత బాలీవుడ్‌కు మకాం మార్చేసింది. భారత మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ జర్నీ ఆధారంగా తెరకెక్కిన 'ఎంఎస్ ధోనీ.. అన్‌టోల్డ్ స్టోరీ'తో హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది.

విరాట్‌తో డేటింగ్‌కు వెళ్తా..
ధోనీ మాజీ ప్రియురాలు పాత్ర పోషించి అభిమానుల మనసు దోచుకున్న దిశా.. సూపర్ సక్సెస్‌తో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇక చాలా ఇంటర్వ్యూల్లో ధోనీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్న ఈ అమ్మడు.. ఓ ఇంటర్వ్యూలో ఏకంగా అతినికి 10/10 రేటింగ్ ఇచ్చింది. లాక్‌డౌన్ ముందు విడుదలైన మలాంగ్ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న దిశా.. క్రికెట్ సంబంధించిన అనేక విషయాలను పంచుకుంది. ఈ మూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూల్లో భారత ఆటగాళ్లకు తన రేటింగ్ కూడా ఇచ్చింది.
ఇక క్రికెటర్లతో డేటింగ్ చేయాల్సి వస్తే విరాట్ కోహ్లీనే సరైనవాడని చెప్పుకొచ్చింది.

బుమ్రానే మ్యాచ్ విన్నర్..
అంతేకాకుండా న్యూజిలాండ్ పర్యటన సందర్బంగా జస్‌ప్రీత్ బుమ్రాపై ప్రశంసల జల్లు కురిపించింది. కోహ్లీ, ధోనీ కన్నా అతనే అద్భుతమైన మ్యాచ్ విన్నర్ అని కొనియాడింది.
‘భారత జట్టులో మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్‌ను ఎంపిక చేయమంటే.. నేను జస్‌ప్రీత్ బుమ్రాను ఎంచుకుంటాను. అతనో అద్భతమైన ఆటగాడు. ఫిబ్రవరి 2న అద్వితీయమైన ఆటతో అతను మనందరిని తలెత్తుకునేలా చేశాడు. కివీస్‌పై అద్భుతమైన విజయాన్నందించాడు.'అని మలాంగ్ ప్రమోషన్ ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది.

బర్త్‌డే సందర్భంగా వైరల్..
ఈ రోజు దిశా పుట్టిన రోజు కావడంతో క్రికెట్ అభిమానులు.. ఈ త్రోబ్యాక్ వీడియోలను షేర్ చేస్తున్నారు. భారత క్రికెటర్ల గురించి ఈ బాలీవుడ్ భామ చేసిన కామెంట్స్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. హ్యాపీ బర్త్ దిశా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక సినీ ప్రముఖులు కూడా ఆమెకు విషెస్ తెలియజేస్తున్నారు.

టైగర్ ష్రాఫ్‌తో ప్రేమాయణం..
నటుడు టైగర్ ష్రాఫ్‌తో దిశా డేటింగ్‌లో ఉందని, త్వరలో వీరు పెళ్లి చేసుకుంటారనే ప్రచారం గత కొంత కాలంగా జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ వీరు మాత్రం నోరు మెదపడం లేదు. ఈ ఇద్దరు వెండితెరపై ఎంత సందడి చేస్తారో.. బయట పార్టిల్లోనూ అలానే దుమ్ములేపుతారు. అది ఏ ఈవెంట్ అయినా వీరిద్దరి కలిసే హాజరవుతున్నారు. ఇవన్నీ చూశాకే వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని వార్తలు వచ్చాయి. లాక్‌డౌన్‌లో కూడా ఈ ఇద్దరు ఒకే ఇంట్లో గడిపారనే రూమర్స్ వినిపించాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
ఒక్క బంతికే 17 పరుగులు.. పాక్‌పై సెహ్వాగ్ అరుదైన రికార్డు!