For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్టేడియంలో రోహిత్ సందడి.. జమైకా ప్రేక్షకులతో డాన్స్ (వీడియో)

WI vs IND : Rohit Sharma Enjoys With Dancing Fans In Jamaica After Series Win || Oneindia Telugu
West Indies vs India: Rohit Sharma’s Jamaican fans show dance moves in Team India jersey

కింగ్‌స్టన్‌: టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్‌ పర్యటనలో ఉంది. ఈ పర్యటనలోని టీ20, వన్డే, టెస్ట్ సిరీస్‌లను భారత్ గెలుచుకుంది. సోమవారం రెండో టెస్టు నాలుగు రోజు జరుగుతుండగా.. భారత బ్యాట్స్‌మన్‌ రోహిత్ శర్మ స్టేడియంలో సందడి చేసాడు. నేరుగా ప్రేక్షకులు ఉండే గ్యాలరీకి వెళ్లి భారత అభిమానులతో మాట్లాడాడు. వారికి కరచనలం కూడా ఇచ్చాడు. పక్కనే ఉన్న ఓ ఇద్దరు జమైకా ప్రేక్షకులు కూడా రోహిత్ శర్మతో మాట్లాడాడు.

టెస్టు ర్యాంకింగ్స్‌: కోహ్లీని వెనక్కినెట్టిన స్మిత్‌.. టాప్-5లో బుమ్రా


ప్రేక్షకులతో రోహిత్ సందడి:

ఒకరు మొబైల్ ఫోన్‌లో పాట పెట్టగా.. మరొకరు డాన్స్ చేశారు. మధ్యలో రోహిత్ కూడా ఓ స్టెప్ వేసాడు. అయితే ఆ ఇద్దరు జమైకా ప్రేక్షకులు రోహిత్ జెర్సీ నెంబర్-45 వేసుకోవడం విశేషం. ఇదే సమయంలో మైదానంలో ఆటగాళ్లు మ్యాచ్ ఆడుతున్నారు. రోహిత్ ఒకవైపు మ్యాచ్ చూస్తూ.. మరోవైపు ప్రేక్షకులను సంతోషపెట్టాడు. దీనికి సంబందించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. మీరూ ఓ లుక్కేయండి.

రోహిత్ శర్మకు కష్టమే:

రోహిత్ శర్మకు కష్టమే:

టెస్ట్ సిరీస్‌లో రోహిత్ శర్మకు చోటు దక్కని విషయం తెలిసిందే. అతని స్థానంలో తెలుగు తేజం హనుమ విహారి ఆడాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రహానే అండగా రెచ్చిపోయిన విహారి.. రెండో టెస్టులో సహచరుల నుంచి పెద్దగా సహకారం లభించకున్నా అదరగొట్టాడు. విండీస్ పేసర్లు హోల్డర్, రోచ్ నిప్పులు చెరుగుతున్నా.. ఏ మాత్రం తడబడకుండా సూపర్ సెంచరీ (225 బంతుల్లో 111 బ్యాటింగ్; 16 ఫోర్లు) చేసాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో కూడా కీలక అర్ధ శతకం చేసి జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంతో పాటు రోహిత్ శర్మ టెస్టు అవకాశాలను మరింత సంక్లిష్టం చేశాడు.

'చెత్త మాటలు మాట్లాడొద్దు.. బుమ్రా నిబంధనల ప్రకారమే బౌలింగ్‌ చేస్తున్నాడు'

అగ్రస్థానంలో భరత్:

అగ్రస్థానంలో భరత్:

రెండో టెస్టులో 257 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను మట్టికరిపించిన టీమిండియా 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. దీంతో కరేబియన్‌ దీవుల్లో తొలిసారి టెస్ట్‌ సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన ఘనత భారత్ సాధించింది. ఈ సిరీస్ విజయంతో ఐసీసీ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో 120 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

Story first published: Tuesday, September 3, 2019, 17:36 [IST]
Other articles published on Sep 3, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+