Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మేం గెలవాలంటే అతన్ని త్వరగా ఔట్ చేయాలి : ఠాకుర్

‘We can express ourselves and play with freedom’- Shardul Thakur optimistic ahead of third ODI against New Zealand

మౌంట్ మాంగనూయ్: న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో ఒక మ్యాచ్ మిగిలుండగానే చేజార్చుకున్న భారత్.. చివరి వన్డే‌కు సిద్ధమవుతోంది. మంగళవారం ఉదయం 7.30 గంటలకు మౌంట్ ‌మాంగనూయ్ వేదికగా మూడో వన్డే ప్రారంభంకానుంది.

ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని కోహ్లీసేన భావిస్తుంటే.. కివీస్ మాత్రం క్లీన్ స్వీప్‌ చేసి టీ20 సిరీస్‌కు బదులు తీర్చుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. తొలి వన్డే భారీ స్కోర్ చేసి కాపోడుకోలేకపోయిన భారత్.. రెండో వన్డేలో చెత్త బ్యాటింగ్‌లో ఓటమిపాలైంది. రెండు వన్డేల్లోనూ భారత్ విజయం కోసం ఆఖరి క్షణం వరకు పోరాడింది. కానీ వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడం ఆటగాళ్లు విఫలమవడంతో పరాజయం ఎదురైంది.

తాము మూడో వన్డేలో గెలవాలంటే న్యూజిలాండ్ తరఫున అద్భుతంగా రాణిస్తున్న రాస్‌టేలర్‌ను వెంటనే ఔట్ చేయాలని టీమిండియా యువ పేసర్ శార్ధుల్ ఠాకుర్ అభిప్రాయపడ్డాడు. గత రెండు వన్డేల్లో అతన్ని త్వరగా ఔట్ చేసే అవకాశాలు దక్కినా అందిపుచ్చుకోలేకపోయామని మూడో వన్డే నేపథ్యంలో ఈ యువపేసర్ మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు.

ప్రతీ మ్యాచ్ ముఖ్యమే..

ప్రతీ మ్యాచ్ ముఖ్యమే..

సిరీస్‌ కోల్పోయినా చివరి మ్యాచ్ ముఖ్యమేనని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో తామేంటో నిరూపిస్తామని, ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్చగా ఆడుతామని ఠాకుర్ తెలిపాడు. ‘ప్రతీ మ్యాచ్ ముఖ్యమే. 0-2తో వెనుకబడినంత మాత్రాన ఫైనల్ మ్యాచ్‌‌కు ఇంపార్టెన్స్ లేదని భావించడంలో అర్థం లేదు. ప్రతీ అంతర్జాతీయ మ్యాచ్‌ కీలకమే. మేం 0-2‌తో సిరీస్ కోల్పోయినా.. మా సత్తా ఏంటో నిరూపిస్తాం. స్వేచ్చగా ఆడుతాం'అని ఠాకుర్ చెప్పుకొచ్చాడు.

టేలర్ బ్యాటింగ్ అద్భుతం..

టేలర్ బ్యాటింగ్ అద్భుతం..

గత రెండు వన్డేల్లో సెంచరీ, హాఫసెంచరీతో అదరగొట్టిన రాస్ టేలర్ న్యూజిలాండ్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఐదు టీ20 సిరీస్‌లో కూడా అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఠాకుర్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రాస్ టేలర్ అద్భుతంగా ఆడుతున్నాడని, దేవుడిలా న్యూజిలాండ్ జట్టుకు విజయాలందిస్తున్నాడని కొనియాడాడు.

‘రాస్ బ్యాటింగ్ అద్భుతం. అతను క్రీజులోకి వచ్చిన తర్వాత లెగ్‌సైడ్ దేవుడిలా ఆడగలడు. గత రెండు వన్డేల్లోనూ అతన్ని త్వరగా ఔట్ చేసే వచ్చాయి. కానీ మేం ఆ అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయాం. ఆరంభంలోనే అతన్ని ఔట్ చేయడం చాలా ముఖ్యం.'అని ఠాకూర్ చెప్పుకొచ్చాడు.

మా వాళ్లు కొంచెం ఓవర్ చేశారు.. మా జట్టు తరఫున క్షమాపణలు చెబుతున్నా : బంగ్లా అండర్-19 కెప్టెన్

సైనీ దెబ్బకు ఠాకుర్ డౌటే..

సైనీ దెబ్బకు ఠాకుర్ డౌటే..

తొలి వన్డేలో ఠాకుర్ దారుణంగా విఫలమైనా.. పక్కకు పెట్టాలని మాజీ క్రికెటర్లు సూచించినా.. లోయరార్డర్‌లో బ్యాటింగ్ చేయగలడనే ఒకే ఒక్క కారణంతో కెప్టెన్ కోహ్లీ అతనికి రెండో వన్డేలో అవకాశం ఇచ్చాడు. అతను కూడా కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు. బౌలింగ్‌లోనూ అద్భుతంగా రాణించి బ్యాటింగ్‌లో మెరిసాడు. అయితే రెండో వన్డేలో యువ పేసర్ నవ్‌దీప్ సైనీ బ్యాటింగ్‌లో అదరగొట్టి గెలుపు ఆశలు రేకిత్తించడంతో ఠాకుర్ అవకాశాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే జట్టులో భారీ మార్పులు ఉంటాయని కెప్టెన్ కోహ్లీ స్పష్టం చేసిన నేపథ్యంలో ఠాకుర్ బెంచ్‌కే పరిమితయ్యే అవకాశాలున్నాయి. ఒక వేళ బుమ్రా, షమీలలో ఏ ఒక్కరిపై వేటు పడినా ఠాకుర్ తుది జట్టులో ఉండొచ్చు.

Story first published: Monday, February 10, 2020, 16:53 [IST]
Other articles published on Feb 10, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+