Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లాక్‌డౌన్ వేళ.. బుల్లెట్‌పై కూతురితో ధోనీ షికారు!! (వీడియో)

Watch: Sakshi shares video of MS Dhonis bike ride with Ziva
IPL 2020 : Dhoni Will Give Hard Hitting Reply To Critics | కూతురి తో ధోని బైక్ రైడ్

రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీకి బైక్‌లంటే పిచ్చి అని అభిమానులందరికి తెలిసిందే. వాటి కోసం మహీ ఫామ్‌ హౌస్‌లో ఓ ప్రత్యేక షెడ్డునే నిర్మించాడు. అవార్డుల రూపంలో లభించిన ప్రతీ బైక్‌ను ధోనీ తన షెడ్‌లో ఉంచుకున్నాడు. వీలుచిక్కినప్పుడల్లా వాటిపై సరదాగా షికారుకు వెళ్తుంటాడు.

 కుటుంబంతో హాయిగా..

కుటుంబంతో హాయిగా..

ఇక లాక్‌‌డౌన్ వేళ పూర్తిగా ఇంటికే పరిమితమైన ఈ జార్ఖండ్ డైనమైట్ కుటుంబంతో ఈ క్వారంటైన్ సమయాన్ని గడుపుతున్నాడు. సోషల్ మీడియాకు దూరంగా ఉండే మహీ.. ఇంటి పనులు చేయడంతో పాటు మొబైల్ గేమ్స్ ఆడుతూ.. తన కూతురు జీవాతో టైంపాస్ చేస్తున్నాడు. అయితే మహీ.. అభిమానులకు దూరంగా ఉన్నా.. అతని సతీమణి సాక్షి సింగ్ మాత్రం ఈ కెప్టెన్ కూల్ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటుంది.

పీక కోస్తానని హెచ్చరించడంతోనే 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టా: యువరాజ్

సాక్షి సింగ్ అప్‌డేట్స్..

అతనికి సంబంధించిన ప్రతీ అప్‌డేట్‌ను తన సోషల్ మీడియా ఖాతాల వేదికగా పంచుకుంటుంది. తాజాగా ధోనీ.. తన కూతురు జీవాను బైక్‌పై ఎక్కించుకొని షికారుకు వెళ్లిన వీడియోను పంచుకుంది. దీనికి ‘ఇద్దరు పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు.. మా పెద్దోడు.. చిన్నోడు'అని క్యాప్షన్‌గా పేర్కొంది. అయితే లాక్‌డౌన్ వేళ ధోనీ బైక్ షికారు ఎలా వెళ్లాడనే సందేహం కలగొచ్చు. కానీ ధోనీ ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదు. సువిశాలమైన తన ఫామ్‌హౌస్‌లో జీవాతో బుల్లెట్‌పై చక్కర్లు కొట్టాడు.

ధోనీ అటెన్షన్ కోసం కాళ్లు నొక్కిన సాక్షి!

ధోనీ అటెన్షన్ కోసం కాళ్లు నొక్కిన సాక్షి!

అంతకుముందు ధోనీ కాళ్లు నొక్కుతూ ఉన్న ఓ ఫొటోను సాక్షి షేర్ చేసిన విషయం తెలిసిందే. ఐపాడ్‌లో వీడియో గేమ్స్‌కు అతుక్కుపోయిన ధోనీ దృష్టిని మరల్చేందుకు ఇలా చేయక తప్పలేదని పేర్కొంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్‌ చేసిన ఫొటోలో ధోనీ మంచంపై పడుకుని గేమ్స్‌ ఆడుకుంటుండగా కాళ్లు నొక్కుతున్న సాక్షి అతడి కాలి బొటనవేలిని సరదాగా కొరుకుతున్నట్టు కనిపించింది. ‘మిస్టర్‌ స్వీటీ దృష్టిని ఆకట్టుకునేందుకు ఒక్కోసారి ఇలా వేడుకోవాల్సి వస్తుంది'అని క్యాప్షన్‌గా పేర్కొంది.

రీ ఎంట్రీ కోసం..

రీ ఎంట్రీ కోసం..

గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ అనంతరం మైదానానికి దూరమైన మహీ.. మళ్లీ ఐపీఎల్ 2020 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌లో బ్యాట్ పట్టాడు. అయితే కరోనా కారణంగా ఈ క్యాష్ రిచ్ లీగ్ నిరవధికంగా వాయిదా పడటంతో ధోనీ భవితవ్యంపై తీవ్ర చర్చ జరుగుతుంది. అతను కెరీర్ ముగిసినట్లే అని కొందరంటే.. ఐపీఎల్ జరగకపోతే ఈ మాజీ కెప్టెన్ రీఎంట్రీ కష్టమేనని గంభీర్ వంటి మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే చెన్నై ఆటగాళ్లు మాత్రం.. ధోనీలో మరో రెండు, మూడేళ్లు ఆడే సత్తా ఉందంటున్నారు. ప్రాక్టీస్ సెషన్‌లో ఓ కొత్త ధోనీని చూశామని, భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలనే కసి మహీలో కనిపించిందని పేర్కొన్నారు.

Story first published: Tuesday, April 21, 2020, 10:35 [IST]
Other articles published on Apr 21, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+