Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CPL 2020: కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించిన క్రికెట్ బాహుబలి!

Watch Rahkeem Cornwall dives forward to pluck a stunning catch in CPL 2020

143 కేజీల బరువు.. ఆరున్నరడుగుల ఎత్తు..! కదలడానికే కష్టంగా ఉండే శరీర ఆకృతి..! కానీ ఇవన్నీ అతని ఆటను అడ్డుకోలేకపోయాయి.! క్రికెట్ అంటేనే ఫిట్‌నెస్.. అది లేకపోతే మైదానంలో రాణించడం కష్టం అనుకుంటున్న తరుణంలో.. ఆడాలనే కసి, రాణించాలనే సంకల్పం ఉంటే చెలరేగవచ్చని వెస్టిండీస్ భారీ కాయుడు, క్రికెట్ బాహుబలి రకీమ్ కార్న్‌వాల్ నిరూపించాడు.!

ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఈ విండీస్ వీరుడు.. కరేబియన్ ప్రీమియర్‌లీగ్‌లో తనదైన ఆటతో అభిమానులను అలరిస్తున్నాడు.! బ్యాటింగ్, బౌలింగ్‌లో చెలరేగుతూ ఆల్‌రౌండ్ షోతో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సెయింట్ లూసియా జౌక్స్ జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. గయాన అమెజాన్ వారియర్స్‌తో మంగళవారం జరిగిన సెమీఫైనల్లో ఓ అద్భుత డైవ్‌తో ఒంటిచేత్తో బంతిని అందుకొని ఔరా అనిపించాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియోను సెయింట్ లూసియా జట్టు తమ అధికారిక ట్విటర్‌లో ' బూమ్.. వాటే క్యాచ్ కార్న్‌వాల్'అనే క్యాప్షన్‌తో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

సూపర్ డైవ్..

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గయాన అమెజాన్ వారియర్స్ ఆశ్చర్యకరంగా 13.4 ఓవర్లలోనే 55 పరుగులకు కుప్పకూలింది. సీపీఎల్ చరిత్రలోనే ఇది రెండో అత్యల్ప స్కోర్. అసలు ఇది సెమీఫైనల్ మ్యాచేనా అని సందేహం కలిగేలా చెత్త ప్రదర్శన కనబర్చింది. ఆ జట్టులో నలుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్ కావడం గమనార్హం. ఇక జహీర్ ఖాన్ వేసిన 13 ఓవర్ నాలుగో బంతిని బ్యాట్స్‌మన్ ఇమ్రాన్ తాహిర్ స్లాగ్ స్విప్ దిశగా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని సిల్లీ స్లిప్ పాయింట్‌ దిశగా గాల్లోకి లేసింది. ఇక స్లిప్ ఫీల్డ్ చేస్తున్న కార్నివాల్ చాకచక్యంగా డైవ్ చేసి ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. ఈ క్యాచ్‌తో మైదానంలో ఉన్న ఆటగాళ్లంతా షాక్ అయ్యారు. ఇక కామెంటేటర్లు అయితే జింబో.. అంటూ గట్టిగా అరుస్తూ.. రకీమ్ కెరీర్‌లో ఇదో అద్భుతం అంటూ కొనియాడారు.

బ్యాటింగ్‌లో మెరిసిన బాహుబలి..

బ్యాటింగ్‌లో మెరిసిన బాహుబలి..

రకీమ్ సూపర్ క్యాచ్‌తో గయాన ఇన్నింగ్స్ 55 పరుగులకే ముగిసింది. కుగ్లిజిన్(2/12), రోస్టన్ చేజ్ (2/15), మార్క్ దెయల్(2/2) గయాన పతనాన్ని శాసించారు. చంద్రపాల్ హెమ్‌రాజ్ (25) టాప్ స్కోరర్‌ కాగా మిగతా బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. ఇక 56 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సెయింట్ లూసియా జౌక్స్ 4.3 ఓవర్లలోనే పూర్తి చేసి ఘన విజయాన్నందుకుంది. రకీమ్ కార్న్‌వాల్(32 నాటౌట్), దెయల్(19 నాటౌట్) సాయంతో మెరుపులు మెరిపించి సూపర్ విక్టరీ అందించాడు. ఈ గెలుపుతో సెయింట్ లూసియా సగర్వంగా టైటిల్ ఫైట్‌కు రెడీ అయింది. గురువారం ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌తో జరిగే తుదిపోరులో అమితుమీ తేల్చుకోనుంది.

గల్లీ క్రికెట్ నయం..

గల్లీ క్రికెట్ నయం..

ఇక ఈ సెమీఫైనల్ మ్యాచ్‌పై ట్విట్ వేదికగా తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లు ఆడే ఆటేనా ఇదని నెటిజన్లు మండిపడుతున్నారు.‘ మీ మ్యాచ్‌లకన్నా మా గల్లీ క్రికెట్ నయం'అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కనీస పోరాటపటిమ కనబర్చకుండా ఓడటం ఏంటదని, మ్యాచ్‌లను ముందే ఫిక్స్ చేశారా? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు.

US Open 2020: అమ్మల జైత్రయాత్ర.. బోపన్న జోడీ నిష్క్రమణ.!

Story first published: Wednesday, September 9, 2020, 14:11 [IST]
Other articles published on Sep 9, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+