
స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..
ప్రాక్టీస్‌లో ధోనీని చూసేందుకు.. స్టేడియానికి పెద్ద ఎత్తున అభిమానులు వస్తున్నారు. తమ ఈలలు.. అరుపులతో కేక పుట్టిస్తున్నారు. ప్రాక్టీస్ ముగించుకొని హోటలకు వెళ్తున్న మహీని ఫాలో అవుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇక ధోనీకి సంబంధించిన ప్రతీ అప్ డేట్‌ను మినట్ మినట్.. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులతో పంచుకుంటూనే ఉంది. చెన్నైకి వచ్చినప్పటి నుంచి ధోనీ చేసే ప్రతీ పనిని తెలియజేస్తుంది.
అరుదైన ఘనత చేరువలో హర్మన్‌ప్రీత్ కౌర్.. క్రికెట్ చరిత్రలో నయారికార్డు.!!
సెక్యూరిటీ కళ్లు గప్పి.. బారికేడ్లు దూకి..
ఇక తాజాగా ధోనీ కోసం ఓ అభిమాని పెద్ద సాహసమే చేశాడు. మైదానంలో పరుగు తీస్తున్న ధోనీతో షేక్ హ్యాండ్ కోసం సాహసోపేతంగా స్టేడియంలోని బారికేడ్లని దాటి మైదానంలోకి పరుగెత్తాడు. అభిమాని తనవైపు రావడాన్ని గమనించిన మహీ పరుగు ఆపలేదు. కానీ.. కొద్దిగా వేగం తగ్గించి.. ఆ అభిమానికి షేక్‌హ్యాండ్ ఇచ్చాడు. అప్పటికే స్టేడియం భద్రతా సిబ్బంది అభిమానిని సమీపించి.. అతడ్ని మైదానం వెలుపలికి తీసుకెళ్లారు. దీంతో చెపాక్ స్టేడియంలోని భద్రతా సిబ్బందికి అభిమానుల్ని కట్టడి చేయడం పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది.

సీఎస్‌కే అండగా నిలిచింది..
ఐపీఎల్ 2020 సీజన్ సన్నాహకాల నేపథ్యంలో అధికారిక బ్రాడ్‌కాస్టర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కష్టకాలంలో చెన్నై ఫ్రాంచైజీ తనకు అండగా నిలిచిందని ధోనీ తెలిపాడు. ‘ప్రతీ విషయంలో సీఎస్‌కే నాకు అండగా నిలిచింది. నేను మెరుగయ్యేందుకు తోడ్పడింది. ముఖ్యంగా కష్టకాలంలో సీఎస్‌కే మేలు మరిచిపోలేనిది. క్రికెటర్‌గా.. ఓ వ్యక్తిగా కఠిన పరిస్థితులను ఎదుర్కోవడంలో ఎంతో సహాయం చేసింది.'అని ధోనీ చెప్పుకొచ్చాడు.

అందుకే తాల..
ఇక చెన్నై ఫ్యాన్స్ ధోనిని ‘తాల'అని పిలుస్తుంటారు. తాల అంటే సోదరుడని అర్ధం. అభిమానులకు తనపై ఉన్న ప్రేమకు చిహ్నమే ఈ పిలుపని మహీ చెప్పుకొచ్చాడు. తాల అని పిలిచారంటే వారు కచ్చితంగా చెన్నై అభిమానేనన్నాడు. ‘నేను చెన్నై లేక సౌతిండియాకు వచ్చినప్పుడు ఏ అభిమాని నా పేరుతో పిలువడు. ప్రతీ ఒక్కరు తాల అంటూ పిలుస్తారు. అది నాపై వారికున్న ప్రేమ. గౌరవం. అలాగే వారు పక్కా చెన్నై అభిమానని అర్థం'అని ధోనీ తెలిపాడు.
ఇంగ్లండ్ పాపం పండింది.. భారత్ ఫైనల్ చేరింది..!!
మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభంకానుండగా.. తొలి మ్యాచ్‌లోనే ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో.. రెండు రోజుల నుంచి చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక ఐపీఎల్ 2019 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్లో ఓడిపోయిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications

