Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

England vs Australia: ఓయ్ బట్లర్ దీనికా రివ్యూ తీసుకునేది.. నువ్వు గొప్పోడివి సామి.! (వీడియో)

WATCH England take embarrassing review despite Aaron Finch middling the ball in 2nd T20I
England vs Pak T20 : ICC No Saliva Rule బ్రేక్ చేసిన Pak Bowler || Oneindia Telugu

సౌతాంప్టన్: సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌ను ఇంగ్లండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో సునాయస విజయాన్నందుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు తీసుకున్న ఓ రివ్యూపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, వికెట్ కీపర్ జోస్ బట్లర్, స్పిన్నర్ రషీద్‌పై ఫన్నీ మీమ్స్, జోక్స్ పేలుతున్నాయి. దీంతో ప్రస్తుతం ఈ రివ్యూకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

ఇంతకేం జరిగిందంటే..

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సందర్భంగా రషీద్ వేసిన ఏడో ఓవర్ మూడో బంతిని ఆరోన్ ఫించ్ డిఫెన్స్ చేశాడు. అయితే బంతి ప్యాడ్స్ తగిలందనుకొని ఇంగ్లండ్ ఆటగాళ్లు అప్పీల్ చేశారు. అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. దీంతో వికెట్ కీపర్ జోస్ బట్లర్, బౌలర్ రషీద్, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌తో చర్చించి రివ్యూ తీసుకున్నారు. అయితే టీవీ రిప్లేలో బంతి బ్యాట్‌కు తగిలిందని తేలింది. ఇది మ్యాచ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి స్పష్టంగా కనిపించింది. అదేం క్లోజ్‌డ్ కాల్ కూడా కాదు. కానీ ఇంగ్లండ్ ఆటగాళ్లు అత్యుత్సాహంతో యావత్ క్రికెట్ ప్రపంచం ముందు అబాసుపాలయ్యారు. ఇక పట్టుబట్టి రివ్యూ తీసుకున్న బట్లర్ కూడా తానెంత తప్పిదం చేసానో తెలుసుకొని మొహంలోని సిగ్గును నవ్వుతో కవర్ చేశాడు.

ధోనీ అనుకుంటున్నావా..?

ఇక డీఆర్ఎస్ అంటేనే టక్కున గుర్తొచ్చే పేరు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. ఎన్నో సార్లు అతను రివ్యూల్లో ఫలితం సాధించాడు. ధోనీ రివ్యూ సిస్టమ్‌గా మార్చుకున్నాడు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన నెటిజన్లు.. ‘వికెట్ల వెనుకాల ఉన్న ప్రతి ఒక్కడు ధోనీలా రివ్యూలో ఫలితం రాబట్టలేడు'అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరేమో ఇంగ్లండ్ ఆటగాళ్లకు ఏమైనా కళ్లుదొబ్బాయా? అంటూ ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. నిజంగా ఇది చరిత్రలోనే నిలిచిపోతుందని, ఇంగ్లండ్ క్రికెటర్ల అజ్ఞాన్ని తెలియజేస్తుందని కామెంట్ చేస్తున్నారు.

సునాయస విజయం..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన ఆసీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. కెప్టెన్‌ ఆరోన్ ఫించ్‌ (33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40), స్టొయినిస్‌ (26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు 35) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్‌ జోర్డాన్‌ 2 వికెట్లు పడగొట్టగా... ఆర్చర్, మార్క్‌వుడ్‌ చెరో వికెట్‌ తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ 18.5 ఓవర్లలో నాలుగే వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్‌ బట్లర్‌(77 నాటౌట్) కడదాకా క్రీజులో నిలబడి గెలిపించగా.. డేవిడ్‌ మలన్‌ (32 బంతుల్లో 7 ఫోర్లు 42) రాణించాడు. ఆసీస్ బౌలర్లలో అగర్‌కు 2 వికెట్లు దక్కాయి. ఆఖరి టీ20 రేపు (మంగళవారం) సౌతాంప్టన్ వేదికగా జరుగుతుంది.

US Open 2020: ఫ్రస్టేషన్‌లో లైన్ జడ్జ్‌ను కొట్టిన నొవాక్ జకోవిచ్‌.. డిస్‌క్వాలిఫై చేసిన నిర్వాహకులు!

Story first published: Monday, September 7, 2020, 9:28 [IST]
Other articles published on Sep 7, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+