CPL 2020: అంపైర్ తప్పుడు నిర్ణయం.. బ్యాట్‌ను నేలకు కొట్టి అసహనం వ్యక్తం చేసిన ఆండ్రీ రస్సెల్!

ట్రినిడాడ్: అంపైర్ తప్పుడు నిర్ణయంపై వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు ఆండ్రీ రస్సెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. బ్యాట్‌ను నేలకు కొట్టి మరి తన అసహనాన్ని ప్రదర్శించాడు. కీలక మ్యాచ్.. క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఆదుకోవాలని భావించిన రస్సెల్.. అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలయ్యాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో జమైకా తల్లవాస్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ విండీస్ విధ్వంసకర వీరుడు.. ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌తో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
అయ్యో.. రస్సెల్
మంగళవారం జరిగిన ఈ లీగ్ తొలి సెమీఫైనల్లో టాస్ ఓడిన తల్లవాస్ తొలుత బ్యాటింగ్ చేపట్టింది. అయితే ప్రత్యర్థి బౌలర్ల ధాటికి ఆ జట్టు మూడు ఓవర్లలో 10 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. అదే తడబాటును కొనిసాగించిన జమైకా.. ఆండ్రీ రస్సెల్ వచ్చే సమయానికి 5 వికెట్లకు 63 పరుగులు మాత్రమే చేసి తీవ్ర కష్టాల్లో పడింది. ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి రస్సెల్ గట్టెక్కిస్తాడని అందరూ భావించగా.. అంపైర్ తప్పుడు నిర్ణయం కారణంగా అతని బ్యాటింగ్ ఐదు బంతులే సాగింది.

బంతి ప్యాడ్‌కు తగిలితే..
సునీల్ నరైన్ వేసిన 14 ఓవర్ మూడో బంతిని రస్సెల్ ముందుకు వచ్చి డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ స్పిన్ కారణంగా టర్న్ అయిన బంతి రస్సెల్ ప్యాడ్లను తాకి స్లిప్ ఫీల్డర్ దిశగా దూసుకెళ్లింది. ఆ స్థానంలో ఫీల్డింగ్ చేస్తున్న డ్వేన్ బ్రావో బంతిని అందుకొని అప్పీలు చేశాడు. దీంతో ఫీల్డ్ అంపైర్ నిగెల్ డగ్వైడ్ ఔట్ ఇచ్చాడు. ఈ నిర్ణయంతో అవాక్కైన రస్సెల్.. తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ బ్యాట్‌ను నేలకు కొట్టాడు. టీవీ రిప్లేలో బంతి బ్యాట్‌కు తగలలేదని స్పష్టమైంది.

హవ్వా.. డీఆర్ఎస్ లేదా..?
ఇక ఈ తప్పుడు నిర్ణయంతో సీపీఎల్‌లో డిసీషన్ రివ్యూ సిస్టమ్(డీఆర్ఎస్) లేకపోవడం చర్చనీయాంశమైంది. అంపైర్ తప్పుడు నిర్ణయం వల్ల జమైకా తల్లవాస్ బలైంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అభిమానులు, మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. ‘సీపీఎల్‌లో డీఆర్ఎస్ లేదా? అస్సలు నమ్మలేకపోతున్నా. ఇంత పెద్ద మ్యాచ్‌లో విధ్వంసకరమైన ఆటగాడు రస్సెల్ తప్పుడు నిర్ణయానికి బలవడం షాక్‌కు గురిచేసింది'అని భారత క్రికెటర్ అభినవ్ ముకుంద్ ట్వీట్ చేశాడు.

9 వికెట్లతో గెలుపు..
రస్సెల్ ఔటైనా.. బోనర్ (42 బంతుల్లో 41; 5 ఫోర్లు), రోవ్‌మాన్ పొవెల్ (35 బంతుల్లో 33; 1 ఫోరు, 1 సిక్స్) ఆదుకునే ప్రయత్నం చేయడంతో జమైకా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 107 పరుగులు మాత్రమే చేయగలిగింది. అకీల్ హుసీన్ (3/14), క్యారీ పియరీ (2/29) జమైకా పతనాన్ని శాసించారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన నైట్‌రైడర్స్ 15 ఓవర్లలో వికెట్ నష్టపోయి 111 చేసి గెలుపొందింది. ఓపెనర్ లెండిల్ సిమ్మన్స్ అజేయ అర్ధ సెంచరీ (44 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54 నాటౌట్)తో రాణించాడు. గురువారం జరిగే ఫైనల్లో నైట్‌రైడర్స్.. సెయింట్ లూసియా జౌక్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
US Open 2020: అమ్మల జైత్రయాత్ర.. బోపన్న జోడీ నిష్క్రమణ.!