CPL 2020: రషీద్ ఖాన్‌ను వెక్కిరించిన ఆండ్రీ రస్సెల్.. తంతానన్న అఫ్గాన్ స్పిన్నర్! (వీడియో)

ట్రినిడాడ్: తుది దశకు చేరుకున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) 2020 సీజన్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్టార్ క్రికెటర్లు రషీద్ ఖాన్, ఆండ్రీ రస్సెల్ మధ్య మైదానంలో జరిగిన పరిహాసం.. యావత్ క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటుంది. వారి మధ్య ఉన్న స్నేహాన్ని తెలియజేస్తుంది. క్రికెట్‌లో ఉన్న బ్యూటీ ఇదే కదా.! అని అనుకునేలా చేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
ఇంతకేం జరిగిందంటే..?
లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో జమైకా తల్లవాస్ బ్యాట్స్‌మన్ ఆండ్రీ రస్సెల్(54) తృటిలో బార్బడోస్ ట్రిడెంట్స్ బౌలర్ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అతను వేసిన 18వ ఓవర్ చివరి బంతిని రస్సెల్.. భారీషాట్‌కు ప్రయత్నించాడు. కానీ బంతి మిస్సై స్టంప్స్‌ను తాకుతూ కీపర్ చేతిలో పడింది. బెల్స్ లైట్ అయితే వెలిగింది. కానీ అవి కిందపడలేదు. దీంతో రస్సెల్ ఊపిరి పీల్చుకున్నాడు. ఆ వెంటనే రషీద్‌ను వెక్కిరిస్తూ అఫ్గాన్ బౌలర్ ట్రేడ్ మార్క్ సెలెబ్రేషన్‌ను ఇమిటేట్ చేశాడు. దీనికి రషీద్ నవ్వుతూ ‘తంతారోయ్..'అంటూ కాలు లేపాడు. ఈ ఇద్దరి చర్యలతో మైదానంలో నవ్వులు పూసాయి. ఆ సమయానికి రస్సెల్(21 బంతుల్లో 41) రన్స్ చేశాడు.

రఫ్ఫాడించిన రస్సెల్, బ్లాక్ వుడ్..
ఈ మ్యాచ్‌లో రస్సెల్(54) రఫ్ఫాడించినా.. బ్లాక్‌వుడ్(74) చెలరేగినా జమైకా తల్లవాస్‌కు ఓటమి తప్పలేదు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు ఈ ఇద్దరి వీరోచిత బ్యాటింగ్‌తో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 161 రన్స్ చేసింది. అయితే రస్సెల్, బ్లాక్‌వుడ్ మినహా అంతా విఫలమవడంతో భారీ స్కోర్ చేయలేకపోయింది. ప్రత్యర్థి బౌలర్లలో రషీద్ ఖాన్, హోల్టర్, బిషప్, వాల్ష్ తలో వికెట్ తీసుకున్నారు.

చెలరేగిన హోల్టర్, సాంట్నర్
అనంతరం 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బార్బడోస్ ట్రిడెంట్స్ 18.2 ఓవర్లలోనే 3 వికెట్లకు 165 పరుగులు చేసి 10 బంతులు మిగిలిఉండగానే గెలుపొందింది. కెప్టెన్ జాసన్ హోల్టర్(69) చెలరేగగా.. అతనికి తోడు సాంట్నర్(35 నాటౌట్), కార్టర్(42) రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో ఒసానే థామస్, ప్రెస్టన్ మెక్‌స్వీన్, సందీప్ లమిచ్చనే తలో వికెట్ తీశారు. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన బార్బడోస్ కెప్టెన్ హోల్డర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఇక బార్బడస్ ట్రిడెంట్స్ విజయంతో ఈ సీజన్‌ను ముగించింది. 10 మ్యాచ్‌ల్లో మూడు మాత్రమే గెలిచిన ఆ జట్టు ఇంటిదారి పట్టింది.
హెచ్‌సీఏలో రాజకీయ రగడ.. అజారుద్దీన్‌పై సభ్యుల తిరుగుబాటు!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications