Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అప్పట్లో ధోనీ లక్ష్యం రూ.30 లక్షలు: వసీమ్ జాఫర్

Wasim Jaffer Says MS Dhoni wanted to earn 30 Lakh from cricket and live life peacefully

ముంబై: భారత మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ కెరీర్ ప్రారంభంలో రూ.30 లక్షలు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడని మాజీ ఓపెనర్ వసీమ్ జాఫర్ తెలిపాడు. తద్వార ధోనీ రాంచీలో తన జీవితాన్ని ప్రశాంతంగా గడపవచ్చని అనుకునేవాడని జాఫర్ చెప్పుకొచ్చాడు.

 ప్రశాంతంగా జీవించడానికి..

ప్రశాంతంగా జీవించడానికి..

కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన క్రికెటర్లు.. సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జాఫర్‌ను ఓ అభిమాని..మహేంద్ర సింగ్ ధోనీతో మీకున్న మధురానుభూతి ఏంటని ప్రశ్నించాడు? దీనికి జాఫర్..‘భారత్ జట్టులోకి వచ్చిన తొలి రెండేళ్లలో.. ధోనీ నాతో ఓ సారి మాట్లాడుతూ.. తాను క్రికెట్ ఆడటం ద్వారా రూ. 30 లక్షలు సంపాదించుకోవాలని ఆశిస్తున్నట్లు చెప్పాడు. ఆ డబ్బుతో రాంచీలో ప్రశాంతమైన జీవితం గడపవచ్చని అప్పట్లో ధోనీ నాకు చెప్పినట్లు గుర్తుంది'అని సమాధానమిచ్చాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మ నెలకొల్పిన కష్టసాధ్యమైన 5 రికార్డులు!

ఆల్‌టైమ్ ఐపీఎల్ కెప్టెన్ ధోనీనే..

ఆల్‌టైమ్ ఐపీఎల్ కెప్టెన్ ధోనీనే..

ఇక తన ఆల్‌టైమ్ ఐపీఎల్ టీమ్ సారథి ధోనీనేనని వసీం జాఫర్ స్పష్టం చేశాడు. 12 సభ్యులతో కూడిన తన ఆల్‌టైమ్ జట్టును ఆదివారం ట్విటర్ వేదికగా ప్రకటించాడు. రోహిత్, రైనా, కోహ్లీ, హార్ధిక్ పాండ్యా, బుమ్రా, జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు జడేజాను 12వ ప్లేయర్‌గా ప్రకటించాడు. విదేశీ ఆటగాళ్ల కోటాలో క్రిస్ గేల్, ఆండ్రూ రస్సెల్, రషీద్ ఖాన్, మలింగాలను ఎంపిక చేశాడు.

బంగ్లాదేశ్‌పై అరంగేట్రం...

బంగ్లాదేశ్‌పై అరంగేట్రం...

ఇక 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ధోనీ.. తొలి మ్యాచ్‌లోనే లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ డకౌటయ్యాడు. ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల్లోనూ అతను చేసిన పరుగులు 22 మాత్రమే. అయితే.. పాకిస్థాన్‌తో వైజాగ్ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో 148 పరుగులతో చెలరేగిన ధోనీ.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.

ఐసీసీ టైటిళ్లన్నీ అందించిన..

ఐసీసీ టైటిళ్లన్నీ అందించిన..

అనంతరం అంచెలంచెలుగా ఎదిగిన ధోనీ.. కెప్టెన్‌గా 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్ ఆ తర్వాత 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ అందించాడు. ఫలితంగా ఐసీసీ టైటిళ్లన్నీ అందించిన కెప్టెన్‌గా ఘనతను అందుకున్నాడు. ప్రస్తుతం ధోనీ ఆస్తుల విలువ సుమారు రూ. 800 కోట్లు కావడం విశేషం.

Story first published: Sunday, March 29, 2020, 20:29 [IST]
Other articles published on Mar 29, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+