For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌తోనే మళ్లీ క్రికెట్ సీజన్ మొదలవ్వాలి: లక్ష్మణ్

VVS Laxman Says IPL 2020 should kick off cricket calendar before T20 World Cup

న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) నిర్వహణపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించడంతో ఈ లీగ్‌ నిరవధికంగా వాయిదా పడింది. అయితే ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించకపోయినా.. ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలకు, బ్రాడ్‌కాస్టర్లకు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో క్రికెట్ సీజన్ మళ్లీ ప్రారంభమైతే.. అది ఐపీఎల్‌తోనే మొదలవ్వాలని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తెలిపాడు. అంతేకాకుండా ఈ క్యాష్‌రిచ్ లీగ్‌తో పాటు టీ20 ప్రపంచకప్ కూడా ఈ ఏడాదిలోనే జరగాలని ఈ సొగసరి బ్యాట్స్‌మన్ పేర్కొన్నాడు.

ఐపీఎల్‌తో షురూ కావాలి..

ఐపీఎల్‌తో షురూ కావాలి..

తాజాగా స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో మాట్లాడుతూ.. ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్‌‌కు క్రికెట్‌లో ఎంత ప్రాధాన్యం ఉందో అన్ని క్రికెట్ బోర్డులకు తెలిసిందే. టీ-20 ప్రపంచకప్‌‌కు ముందు ఐపీఎల్ జరిగితే.. అది ఆటగాళ్లకు మరింత ఉత్సాహం ఇస్తుంది. అన్ని సవ్యంగా జరిగి.. అందరూ అపాయం నుంచి బయటపడితే.. ఈ క్రికెట్ సీజన్ ఐపీఎల్‌తోనే ప్రారంభమవ్వాలి.'అని లక్ష్మణ్ పేర్కొన్నారు.

వలస కూలీల గోస చూస్తే కడుపు తరుక్కుపోతుంది: మహ్మద్ షమీ

మైఖేల్ వాన్ కూడా..

మైఖేల్ వాన్ కూడా..

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కూడా లక్ష్మణ్ అభిప్రాయంతో ఏకీభవించాడు. ‘ప్రపంచకప్‌‌కు ముందు ఐపీఎల్ జరిగితే.. అది ఆటగాళ్లకు మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఐపీఎల్, ప్రపంచకప్ రెండూ జరగడం ఎంతో ముఖ్యం'అని వాన్ తెలిపాడు.

సుప్రీం లెవల్‌లో ధోనీ ఫిట్‌నెస్..

సుప్రీం లెవల్‌లో ధోనీ ఫిట్‌నెస్..

ధోనీలోమరో రెండు, మూడేళ్లు ఐపీఎల్ ఆడే సత్తా ఉందని లక్ష్మణ్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ‘ధోనీ మ‌రికొంత కాలం ఐపీఎల్ ఆడుతాడ‌ని భావిస్తున్నా. అతడి ఫిట్‌నెస్ సుప్రీం లెవ‌ల్‌లో ఉంది. ఫిట్‌నెస్ అంటే కేవ‌లం శారీర‌క దారుఢ్య‌మే కాదు.. మానసికంగానూ మ‌హీ చాలా స్ట్రాంగ్‌. వ‌య‌సు అనేది జస్ట్ ఒక నంబ‌ర్ మాత్ర‌మే. నాయ‌కుడిగా చెన్నై సూప‌ర్ కింగ్స్ ముందుండి న‌డిపించ‌డం ధోనీకి చాలా ఇష్టం.

ఈ ఏడాది ఐపీఎల్ నిర్వ‌హ‌ణపై సందేహం నెలకొనడంతో ధోనీ కెరీర్ ముగిసిందనుకుంటున్నారు. ఈ ఒక్క ఐపీఎలే కాదు.. రాబోయే రెండు మూడు సీజన్లలో కూడా మ‌హీ క‌చ్చితంగా ఆడుతాడ‌ని నేను చెప్ప‌గ‌ల‌ను. ధోనీ ఓ విజయవంతమైన ఆటగాడు. ఐపీఎల్‌లో అతని ఆట కోసం`ప్రతీ ఒక్కరు ఎదురు చూస్తున్నారని భావిస్తున్నా.'అని ల‌క్ష్మ‌ణ్ చెప్పుకొచ్చాడు. అయితే భారత్ త‌ర‌ఫున ఆడే విష‌యంపై మాత్రం వీవీఎస్ స్ప‌ష్ట‌త‌నివ్వ‌లేదు. బీసీసీఐ కొత్త సెలెక్ష‌న్ క‌మిటీ ధోనీ భ‌వితవ్యంపై అత‌డితోనే చ‌ర్చించాల‌ని తెలిపాడు.

Story first published: Wednesday, April 15, 2020, 20:00 [IST]
Other articles published on Apr 15, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+