ఐపీఎల్‌లో కెప్టెన్‌గా రోహిత్ సక్సెస్‌కు అదే కారణం: లక్ష్మణ్

హైదరాబాద్: టీమిండియా స్టార్ ఓపెనర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్‌తో అత్యంత విజయవంతమైన కెప్టెన్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సారథిగా ముంబైకి అందించిన నాలుగు ట్రోఫీలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. అయితే ఐపీఎల్‌లో కెప్టెన్‌గా నాలుగు, ఆటగాడిగా ఐదు ట్రోఫీలు అందుకున్న రోహిత్ సక్సెస్‌కు గల కారణాన్ని టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తెలిపాడు.
ముఖ్యంగా ఈ క్యాష్ రిచ్‌లీగ్ ఆరంభ సీజన్‌లో ఈ సొగసరి బ్యాట్స్‌మన్ నేతృత్వంలోని డెక్కెన్ చార్జెస్ హైదరాబాద్ తరఫున రోహిత్ ఆడిన విషయం తెలిసిందే. దీంతో హిట్‌మ్యాన్ ఎదిగిన తీరును దగ్గరుండి చూసిన లక్ష్మణ్.. తాజాగా స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో మాట్లాడుతూ ఈ ముంబైకర్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.

డెక్కన్ చార్జెస్‌తోనే..
రోహిత్ శర్మకు ఒత్తిడిలో మ్యాచ్‌లు ఆడటం బాగా తెలుసని, అదే అతని సక్సెస్‌కు కారణమన్నాడు. పరిస్థితుల్ని అంచనా వేసుకుంటూ ఆడటంలో రోహిత్ దిట్ట అని ప్రశంసించాడు. యువకుడిగా ఉన్నప్పట్నుంచే రోహిత్ ఒత్తిడిలో మ్యాచ్‌లను సమర్ధవంతంగా ఆడాడన్నాడు. ‘2008లో డెక్కన్ చార్జర్స్ విజయాల్లో రోహిత్ ముఖ్య భూమిక పోషించాడు. ఆ సమయంలోనే జట్టుకు సారథ్యం వహించే లక్షణాలు అలవర్చుకున్నాడు. అప్పుడు రోహిత్ ఓ యువ క్రికెటర్ మాత్రమే. కేవలం టీ20 వరల్డ్‌కప్ ఆడిన అనుభవం మాత్రమే ఉంది.'అని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు.

జట్టు మొత్తం విఫలమైనా..
ప్రస్తుతం వరల్డ్ బెస్ట్ ఓపెనర్‌గా చెలరేగుతున్న హిట్ మ్యాన్.. ప్రారంభంలో మిడిలార్డర్‌లో ఆడిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ లక్ష్మణ్ రోహిత్ బ్యాటింగ్ సామర్థ్యాన్ని కొనియాడాడు. ‘ఐపీఎల్ ప్రారంభ సీజన్ 2008లో డెక్కన్ చార్జెస్ అంత బాగా ఆడలేదు. కానీ రోహిత్ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మా ప్రతీ విజయంలో రోహిత్ కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్‌లో తీవ్ర ఒత్తిడిలో ఆడాడు. మిగతా ఆటగాళ్లు విఫలమైనా ఒంటరి పోరాటం చేశాడు. తన ఆత్మవిశ్వాసాన్ని క్రమేపి పెంచుకుంటూ ముందుకు సాగాడు. జట్టు సమావేశాల్లో విజయాల కోసం తన వాయిస్‌ను కూడా వినిపించేవాడు. ముఖ్యంగా యువ ఆటగాళ్లకు స్పూర్తిగా నిలిచేవాడు.'అని లక్ష్మణ్ తెలిపాడు.

అది అతని ప్రత్యేక కళ..
ఓ ఆటగాడిగా సారథిగా రోహిత్‌లో ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయని, కానీ ఒత్తిడిని అధిగమించడం మాత్రం అతని కళ అని లక్ష్మణ్ కొనియాడాడు. ‘నా అభిప్రాయం ప్రకారం రోహిత్ ఒత్తిడిని అధిగమించే విధానం చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లో కూడా అతను బ్యాటింగ్‌తో అదరగొడుతాడు. ఐపీఎల్‌ల సక్సెస్ కావడానికి అదే కారణం' అని లక్ష్మణ్ పేర్కొన్నాడు.
భారత్ ఉద్దేశపూర్వకంగా ఓడిందనలేదు.. పాక్ మాజీ క్రికెటర్‌పై స్టోక్స్ ఫైర్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications