Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వయసు ఓ నంబరే.. మరో రెండేళ్లు ధోనీ ఆడుతాడు: వీవీఎస్ లక్ష్మణ్

VVS Laxman feels MS Dhoni will continue playing for CSK for couple of IPL seasons

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ఎప్పుడా? అని తీవ్ర చర్చ నడుస్తున్న క్రమంలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వయసు అనేది ఓ సంఖ్య మాత్రమేనని, ధోనీలో మరికొంత కాలం ఆడే సత్తా ఉందని తెలిపాడు. మరో రెండు, మూడేళ్ల వరకు మహీ ఐపీఎల్ ఆడుతాడని స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టడ్ షోలో చెప్పుకొచ్చాడు.

సుప్రీం లెవల్‌లో ధోనీ ఫిట్‌నెస్..

సుప్రీం లెవల్‌లో ధోనీ ఫిట్‌నెస్..

‘ధోనీ మ‌రికొంత కాలం ఐపీఎల్ ఆడుతాడ‌ని భావిస్తున్నా. అతడి ఫిట్‌నెస్ సుప్రీం లెవ‌ల్‌లో ఉంది. ఫిట్‌నెస్ అంటే కేవ‌లం శారీర‌క దారుఢ్య‌మే కాదు.. మానసికంగానూ మ‌హీ చాలా స్ట్రాంగ్‌. వ‌య‌సు అనేది జస్ట్ ఒక నంబ‌ర్ మాత్ర‌మే. నాయ‌కుడిగా చెన్నై సూప‌ర్ కింగ్స్ ముందుండి న‌డిపించ‌డం ధోనీకి చాలా ఇష్టం. ఈ ఏడాది ఐపీఎల్ నిర్వ‌హ‌ణపై సందేహం నెలకొనడంతో ధోనీ కెరీర్ ముగిసిందనుకుంటున్నారు. ఈ ఒక్క ఐపీఎలే కాదు.. రాబోయే రెండు మూడు సీజన్లలో కూడా మ‌హీ క‌చ్చితంగా ఆడుతాడ‌ని నేను చెప్ప‌గ‌ల‌ను. ధోనీ ఓ విజయవంతమైన ఆటగాడు. ఐపీఎల్‌లో అతని ఆట కోసం`ప్రతీ ఒక్కరు ఎదురు చూస్తున్నారని భావిస్తున్నా.'అని ల‌క్ష్మ‌ణ్ చెప్పుకొచ్చాడు. అయితే భారత్ త‌ర‌ఫున ఆడే విష‌యంపై మాత్రం వీవీఎస్ స్ప‌ష్ట‌త‌నివ్వ‌లేదు. బీసీసీఐ కొత్త సెలెక్ష‌న్ క‌మిటీ ధోనీ భ‌వితవ్యంపై అత‌డితోనే చ‌ర్చించాల‌ని తెలిపాడు.

ఐపీఎల్ వాయిదాతో ధోనీ కెరీర్ ప్రశ్నార్ధకం..?

ఐపీఎల్ వాయిదాతో ధోనీ కెరీర్ ప్రశ్నార్ధకం..?

ఇక 2019 వన్డే ప్రపంచకప్ ఓటమి అనంతరం సుమారు 9 నెలలు ఆటకు దూరమైన ధోనీ.. మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ సెషన్‌లో బ్యాట్ పట్టాడు. ఇక 9 నెలలు ఎలాంటి క్రికెట్ ఆడకపోవడంతో ఈ జార్ఖండ్ డైనమైట్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయాడు. దీంతో అప్పుడే ధోనీ కెరీర్ ముగిసినట్టేననే వాదన తెరపైకి వచ్చింది. హర్భజన్ వంటి సీనియర్ క్రికెటర్లు ధోనీ మళ్లీ భారత్ తరఫున బరిలోకి దిగే అవకాశాల్లేవన్నాడు. కానీ రవిశాస్త్రి, అనిల్ కుంబ్లే వంటి దిగ్గజాలు మాత్రం ఐపీఎల్‌తో ధోనీ భవితవ్యంపై క్లారిటీ వస్తుందన్నారు. ఐపీఎల్‌లో విఫలమైతే మహీనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటాడని తెలిపారు.

కానీ కరోనా పుణ్యమా మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ ఏప్రిల్ 15కు వాయిదా పడింది. ప్రస్తుతం దేశంలో లాక్‌డౌన్ పొడిగించడంతో నిరవదిక వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ధోనీ కెరీర్ ముగిసినట్లేనని ఆకాష్ చోప్రా వంటి మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ సైతం ధోనీ ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించాల్సిందని, ఈ వ్యవహారాన్ని ఎందుకు సాగదీస్తున్నాడో తనకు అర్థం కావడం లేదన్నాడు. కానీ ధోనీ ఘన వీడ్కోలు దక్కాలన్నాడు.

రీఎంట్రీ కోసం ధోనీ ట్రై..

రీఎంట్రీ కోసం ధోనీ ట్రై..

మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ వర్గాల సమాచారం మేరకు ధోనీ రీ ఎంట్రీ కోసం తీవ్రంగా శ్రమించినట్లు తెలుస్తోంది. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ధోనీ బ్యాటింగ్, కీపింగ్ ప్రాక్టీస్ చేశాడని, ఐపీఎల్‌లో రాణించాలనే కసి మహీలో కనిపించిందని ఆ జట్టు ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది తెలిపారు. ఐపీఎల్‌లో రాణించడం ద్వారా టీ20 ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకోవాలనే ధోనీ ఉద్దేశం తమకు అర్థమైందని చెప్పుకొచ్చారు. ఇక ధోనీ స్నేహితుడు ఒకరు కూడా రిటైర్మెంట్ వ్యవహరం ఎత్తితే మహీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడని తెలిపారు. ఇప్పటికీ తానే అత్యుత్తమ కీపర్‌గా ధోనీ ఫీలవుతున్నాడని, రీ ఎంట్రీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడని పేర్కొన్నారు.

22 ఏళ్ల కుర్రాడితో.. స్టార్ ఫుట్‌బాలర్ తల్లి డేటింగ్‌..!!

ఏ ప్రాతిపాదికన సెలెక్ట్ చేస్తారు..

ఏ ప్రాతిపాదికన సెలెక్ట్ చేస్తారు..

మరోవైపు ఈ సీజన్ ఐపీఎల్ జరగకపోతే ధోనీ కెరీర్ ముగిసినట్టేనని మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. అయినా ధోనీ ఏ లేక్కన జట్టులోకి తీసుకుంటారని ప్రశ్నించాడు. 'ఈ ఏడాది ఐపీఎల్ జరగకపోతే.. జట్టులోకి ధోనీ రీఎంట్రీ చాలా కష్టమవుతుంది. 9 నెలలు క్రికెట్ ఆడని అతన్ని ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు?. మైదానంలో ఎవరైతే అత్యుత్తమంగా ఆడి.. జట్టును గెలిపిస్తారో వారే టీమ్‌లో ఉండాలి. ధోనీ స్థానంలో లోకేష్ రాహుల్ సరైనవాడు. ధోనీకి ప్రత్నామ్నాయం రాహులే. గత కొంతకాలంగా రాహుల్‌ ప్రదర్శన బాగుంది. బ్యాటింగ్‌, కీపింగ్‌లోనూ ఆకట్టుకుంటున్నాడు. కీపింగ్‌లో మహీలా పూర్తి స్థాయి సత్తా చాటకపోయినా.. రాహుల్‌ మాత్రం తన పాత్రకు న్యాయం చేస్తున్నాడు. ధోనీకి ప్రత్నామ్నాయం రాహులే అని నేను భావిస్తున్నా. రిటైర్మెంట్ అనేది ధోనీ వ్యక్తిగత నిర్ణయం' అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, April 13, 2020, 20:49 [IST]
Other articles published on Apr 13, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+