ధైర్యాన్ని ఎవరూ దొంగలించలేరు..
రెండు చేతులు సరిగా లేకున్నా అద్బుత బౌలింగ్ చేస్తున్న వీడియోను షేర్ చేశాడు. ‘మానవునికున్న ఆత్మ స్తైర్యం, పట్టుదల, ధైర్యాన్ని ఎవరూ దొంగలించలేరు. మానవుని శక్తికి, సహనానికి సెల్యూట్' అంటూ క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ సైతం లైక్ చేసింది.

కరోనా టీచర్‌ను కొనియాడుతూ..
ఆ మధ్య ప్రమాదకర కరోనా వైరస్ సోకినా కూడా చలించకుండా, తన విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తున్న ఓ టీచర్ పట్టుదలను కొనియాడుతూ.. దానికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన విషయం తెలిసిందే. కేంద్రపాలితప్రాంతం లడఖ్‌లోని లేహ్‌కు చెందిన కైఫాయత్ హుస్సేన్.. ఆన్‌లైన్‌లో విద్యార్థులకు పాఠాలు బోధిస్తాడు. అయితే అతనికి కరోనా సోకడంతో అతడిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అయితే కరోనా సోకినా వార్డు నుంచే తన విద్యార్థులకు పాఠాలు బోధించడం ప్రారంభించాడు. ఆయనలోని పట్టుదల ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందని లక్ష్మణ్ ట్వీట్ చేశాడు.

ఈడెన్ ఇన్నింగ్స్ గుర్తు చేసుకుంటూ..
చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ 2001 ఇన్నింగ్స్‌ను ఇటీవల గుర్తు చేసుకున్న లక్ష్మణ్.. ఓవర్ ఓవర్‌కు ఒకరికి ఒకరు ప్రేరణ కల్పించుకుంటూ ముందుకు సాగిపోయామని వీవీఎస్ పేర్కొన్నారు.‘దేశానికి ప్రాతినిధ్యం వహించడం మా అందరికీ గర్వకారణం. మేమెప్పుడైనా సరే బాగానే ఆడాలనుకుంటాం. కఠిన పరిస్థితుల్లోనైతే మరీనూ. జట్టు నిరాశపరిచిన ప్రతిసారీ చూపినట్టే ఈ సారీ రాహుల్ ద్రవిడ్ పోరాట పటిమ ప్రదర్శించాడు. ప్రతీ ఓవర్ తర్వాత మేమిద్దరం ఫిస్ట్‌పంప్ చేస్తూ ఒకే ఒక్క విషయం మాట్లాడుకునేవాళ్లం. మిత్రమా.. ఇంకొక్క ఓవర్ అనుకునేవాళ్లం. అది మా ఇద్దరికీ ఎంతో నేర్పించింది. ఎందుకంటే మేం అతిపెద్ద సవాల్‌ను ఎదుర్కొంటున్నాం. అసలైన లక్ష్యం ఏంటో తెలియదు.'అని లక్ష్మణ్ తెలిపాడు.
ఇది తెలివైన పని కాదు.. శార్దూల్ ఠాకూర్ ఔట్‌డోర్ ప్రాక్టీస్‌పై బీసీసీఐ ఫైర్!


Click it and Unblock the Notifications
