ఇది తెలివైన పని కాదు.. శార్దూల్ ఠాకూర్ ఔట్‌డోర్ ప్రాక్టీస్‌పై బీసీసీఐ ఫైర్!

ముంబై: టీమిండియా యువ పేసర్ శార్దూల్ ఠాకూర్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ అనుమతి లేకుండా శార్దూల్ స్వతహాగా ఔట్‌డోర్‌లో ప్రాక్టీస్ చేయడం సరికాదని అభిప్రాయపడింది. ఇక రెండు నెలల సుదీర్ఘ విరామం తర్వాత శార్దూల్ ఔట్‌డోర్ ప్రాక్టీస్‌ను ప్రారంభించాడు. శనివారం పలువురు డొమెస్టిక్ ప్లేయర్లతో కలిసి నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. దీంతో ఔట్‌డోర్ ట్రైనింగ్ స్టార్ట్ చేసిన తొలి ఇండియన్ క్రికెటర్‌గా శార్దూలేనని మీడియా ప్రచారం చేసింది.

తెలివైన పని కాదు..
ఈ వ్యవహారంపై స్పందించిన ఓ బీసీసీఐ అధికారి హిందూస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ అసహనం వ్యక్తం చేశాడు. ‘బీసీసీఐ కాంట్రాక్ట్ ఉన్న శార్దూల్‌ను ఔట్‌డోర్‌లో ప్రాక్టీస్ చేసుకోమని బోర్డు నుంచి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. కానీ అతను సొంతంగా ఔట్‌డోర్ ట్రైనింగ్ ప్రారంభించాడు. శార్దూల్ ఇలా చేయాల్సింది. ఇది ఏ మాత్రం తెలివైన పని కాదు'అని ఆ అధికారి శార్దూల్ చర్యల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ఐదు ఓవర్లు మాత్రమే..
కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్, ఆరెంజ్ జోన్లలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, స్డేడియంలు తెరిచేందుకు అనుమతులు ఇచ్చింది. దీంతో శార్దూల్ ప్రాక్టీస్‌కు అవకాశం దొరికింది. పాల్‌గఢ్ జిల్లా బొయిసర్ ప్రాంతంలోని పాల్‌గఢ్ దహను తాలుకా స్పోర్ట్స్ అసోసియేషన్ గ్రౌండ్‌లోని నెట్స్‌లో శార్దూల్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. సుదీర్ఘ విరామం తర్వాత తన ఫస్ట్ సెషన్‌లో ఐదు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు.

గైడ్‌లైన్స్ పాటించా..
ముంబై అండర్-23 బ్యాట్స్‌మన్ సాయిరాజ్ పాటిల్, ముంబై రంజీ టీమ్ ఓపెనర్ హార్దిక్ తోమర్ ఆ ఐదు ఓవర్లను ఎదుర్కొన్నారు. అయితే.. ఈ ప్రాక్టీస్ సెషన్‌లో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా సామాజిక దూరాన్ని తాము పాటించినట్లు కూడా ఠాకూర్ స్పష్టం చేశాడు. బంతి స్వింగ్ కోసం ఉమ్మిని కూడా వాడలేదన్నాడు.
'చాలా రోజుల తర్వాత ఈ రోజే మళ్లీ ట్రైనింగ్ మొదలుపెట్టా. అందువల్ల ఐదు ఓవర్లు మాత్రమే వేశా. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ బౌలింగ్ చెయ్యడాన్ని బాగా ఆస్వాదించా. బ్రేక్ వల్ల అంతా కొత్తగా అనిపించింది. టీమిండియా ట్రైనర్ సూచనల మేరకు ఇంటి దగ్గర ఇన్నాళ్లు ఫిట్‌నెస్ కాపాడుకున్నా. ఈ రోజు జరిగిన సెషన్ పట్ల ఆనందంగా ఉన్నా. కానీ బౌలింగ్‌లో పాత రిథమ్ రావాలంటే కొంత టైమ్ పడుతుంది.'అని శార్ధూల్ ఠాకూర్ వెల్లడించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
పాకిస్థాన్ మాజీ క్రికెటర్‌కు కరోనా వైరస్!