Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DPL 2026 వేలంలో భారీ ధర పలికిన సెహ్వాగ్ వారసులు.. కోహ్లీ అన్న కోడుకు!

న్యూఢిల్లీ వేదికగా జరగనున్న ఢిల్లీ ప్రీమియర్ లీగ్(డీపీఎల్) మూడో సీజన్‌కు సంబంధించి వేలం ముగిసింది. కుర్రాళ్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి. ఈ వేలంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయులు, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అన్న కొడుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

అతను ఆల్‌ఫార్మాట్ ప్లేయర్.. వన్డేల్లో ఆడించాలి: వీరేంద్ర సెహ్వాగ్

అతను ఆల్‌ఫార్మాట్ ప్లేయర్.. వన్డేల్లో ఆడించాలి: వీరేంద్ర సెహ్వాగ్

సెహ్వాగ్ చిన్న కుమారుడు, 16 ఏళ్ల వేదాంత్ సెహ్వాగ్‌ను ఢిల్లీ కింగ్స్ రూ.1 లక్షకు కొనుగోలు చేసింది. వేదాంత్ ఇప్పటికే ఢిల్లీ తరఫున అండర్-14, 16 టోర్నీలు ఆడాడు. అయితే అతని తండ్రిలా కాకుండా రైటార్మ్ ఆఫ్ స్పిన్నర్‌గా.. లోయర్ ఆర్డర్‌ బ్యాటర్‌గా వేదాంత్ సత్తా చాటుతున్నాడు. సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్‌ను రూ.3 లక్షల భారీ ధరకు వెస్ట్ ఢిల్లీ లయన్స్ కొనుగోలు చేసింది. గత సీజన్‌లో అతను సెంట్రల్ ఢిల్లీ కింగ్స్‌కు ఆడాడు.

Virender Sehwag s Sons and Virat Kohli s Nephew Secured at Delhi Premier League 2026 auction

ఇక విరాట్ కోహ్లీ అన్న కుమారుడు ఆర్యవీర్ కోహ్లీని రూ.1.2 లక్షలకు సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ దక్కించుకుంది. ఆర్యవీర్ గత సీజన్‌లో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్‌ జట్టుకు ఆడాడు.

ఈ వేలంలో తేజస్వి దహియా ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. గత సీజన్‌లో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్జ్ తరఫున ఆడిన తేజస్వి 200 స్ట్రైక్‌రేట్‌తో 339 పరుగులతో సత్తా చాటాడు. దాంతో అతని కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి అయితే సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్జ్ రైట్ టు మ్యాచ్ కార్డును ఉపయోగించి రూ.40 లక్షల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో కేకేఆర్ తరఫున తేజస్వి దహియా అరంగేట్రం చేశాడు.

IND vs ENG: కోహ్లీ, రోహిత్‌ కూడా చేయలేనిది.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డ్!

IND vs ENG: కోహ్లీ, రోహిత్‌ కూడా చేయలేనిది.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డ్!

సీనియర్ రాజకీయ నాయకుడు పప్పు యాదవ్ తనయుడు సార్థక్ రంజన్‌ రూ.17 లక్షల ధర పలికాడు. అతను రైట్ టు మ్యాచ్ ఉపయోగించి నార్త్ ఢిల్లీ కొనుగోలు చేసింది. గత సీజన్‌లో అతను 9 మ్యాచ్‌ల్లో 449 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2026 వేలంలో అతను రూ.30 లక్షలకు కేకేఆర్ కొనుగోలు చేసింది. ఈ వేలంలో మొత్తం 25 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి.

Story first published: Thursday, July 2, 2026, 17:01 [IST]
Other articles published on Jul 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+