అతను ఆల్‌ఫార్మాట్ ప్లేయర్.. వన్డేల్లో ఆడించాలి: వీరేంద్ర సెహ్వాగ్
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌పై మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. యశస్వి జైస్వాల్ ఆల్‌ఫార్మాట్ ప్లేయర్ అని, అతనికి వన్డేల్లో అవకాశం కల్పించాలని సూచించాడు. వైట్‌బాల్ క్రికెట్ ఆడే సామర్థ్యం యశస్వి జైస్వాల్‌కు ఉందని, కానీ జట్టులో చోటు లేదని తెలిపాడు.
టెస్ట్ ఫార్మాట్‌లో రెగ్యులర్ ఓపెనర్‌గా కొనసాగుతున్న యశస్వి జైస్వాల్‌కు వన్డే ఫార్మాట్‌లో మాత్రం అవకాశం దక్కడం లేదు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతుండటంతో యశస్వికి వన్డే టీమ్‌లో చోటు లేకుండా పోయింది. ఒకవేళ వచ్చినా ఎక్కువగా బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తోంది.
మూడు ఫార్మాట్లు ఆడగలడు..
తాజాగా విరాట్ కోహ్లీ గాయంతో యశస్వి జైస్వాల్‌కు అఫ్గాన్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడే అవకాశం వచ్చింది. కానీ తుది జట్టులో అవకాశం దక్కుతుందా? అంటే అవునని చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే వీరేంద్ర సెహ్వాగ్.. భవిష్యత్తులో యశస్వి జైస్వాల్ మూడు ఫార్మాట్లలో ఆడుతాడని జోస్యం చెప్పాడు.

'యశస్వి జైస్వాల్ ఇప్పటివరకు కేవలం నాలుగు వన్డేలు మాత్రమే ఆడాడు. అందులో ఒక సెంచరీ నమోదు చేశాడు. కానీ తర్వాత అతనికి అవకాశాలు రాలేదు. ఎందుకంటే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్నాడు. రోహిత్ శర్మ ఇంకా వన్డేల్లోనూ కొనసాగుతున్నాడు. దాంతో ఓపెనర్ స్లాట్ ఖాళీగా లేదు. త్వరలోనే రోహిత్ వన్డేలకు వీడ్కోలు పలికే అవకాశం ఉంది.
జైస్వాల్‌కు అతనితో పోటీ..
అప్పుడు యశస్వి జైస్వాల్‌కు ఓపెనర్‌గా అవకాశం దక్కుతుంది. అయితే అతనికి రుతురాజ్ గైక్వాడ్ నుంచి పోటీ తప్పదు. జట్టులోకి ముగ్గురు ఓపెనర్లను తీసుకుంటే మాత్రం యశస్వి జైస్వాల్ తప్పకుండా ఉంటాడు. ఇప్పుడు కూడా రోహిత్, గిల్ ఇతర క్రికెటర్ ఎవరైనా అందుబాటులో లేకుంటే యశస్వి జైస్వాల్‌కే తుది జట్టులో చోటు దక్కుతుంది. అంతేకానీ, సరిగ్గా ఆడకపోవడం వల్ల యశస్విని పక్కన పెట్ట లేదు. ఛాన్స్ వచ్చినప్పుడు చక్కగా ఆడాడని మాత్రం మరవకూడదు.
మరో ప్లేయర్ ఇషాన్ కిషన్‌కు కూడా ఎక్కువగా వన్డే ఫార్మాట్‌లో అవకాశాలు దక్కడం లేదు. అతను ఈ ఫార్మాట్‌లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేశాడు. అతను పరిగణనలోకి తీసుకోవాల్సిన క్రికెటర్. అయితే యశస్వి జైస్వాల్‌కు రాబోయే కాలంలో అన్ని ఫార్మాట్లలోనూ చోటు కల్పించాల్సిన అవసరం ఉంది.'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
మనోజ్ తివారి సైతం..
వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యలతో మాజీ క్రికెటర్ మనోజ్ తివారి కూడా ఏకీభవించాడు. యశస్వి జైస్వాల్‌ను తప్పకుండా జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. వన్డే ప్రపంచకప్ 2027 తర్వాత ఇద్దరూ క్రికెటర్లు రిటైర్మెంట్ తీసుకుంటారని, వారి స్థానాలను భర్తీ చేసే ఆటగాళ్లలో యశస్వికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని తివారి అభిప్రాయపడ్డాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

