ఆర్‌సీబీ డెత్ బౌలింగ్‌ను జీవితంలో నమ్మకూడదు.. ఆ జట్టు గెలుపు క్రెడిట్ అతనిదే: వీరేంద్ర సెహ్వాగ్

న్యూఢిల్లీ: రాయల్‌చాలెంజర్స్ బెంగళూరు స్టార్ పేసర్ నవదీప్ సైనీపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ సూపర్ ఓవర్‌లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఆద్యంతం ఉత్కంఠ.. అంతకుమించిన పోరాట స్పూర్తి రగిలిన ఈ మ్యాచ్‌లో విజయం రెండు జట్లను ఊరించి సూపర్ ఓవర్‌కు దారితీసింది.
ఆర్‌సీబీ పేసర్ నవదీప్ సైనీ వేసిన సూపర్ ఓవర్‌లో ముంబై స్టార్ ఆటగాళ్లు కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యాలు తడబడ్డారు. తొలి బంతినే యార్కర్‌తో ఆరంభించిన సైనీ ఓవర్ మొత్తం కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. లెంగ్త్, లైన్ తప్పకుండా బంతులను సంధించాడు. సూపర్ ఓవర్‌లో ఒకే ఒక్క ఫోర్ ఇచ్చి సూపర్ అనిపించాడు. దాంతో ఆర్‌సీబీ ఎనిమిది పరుగుల టార్గెట్‌ను ఛేదించి విజయం సాధించింది.

నమ్మకూడనిది ఏదైనా ఉందంటే..
అయితే సైనీ సూపర్ బౌలింగ్‌ను ప్రస్తావిస్తూ సెహ్వాగ్ కొనియాడాడు. జీవితంలో నమ్మకూడనిది ఏదైనా ఉందంటే అది ఆర్‌సీబీ డెత్ బౌలింగ్ అని, కానీ సైనీ అద్భుతం చేశాడని ప్రశంసించాడు. అలాగే వాషింగ్టన్ సుంధర్ కూడా విజయంలో కీలక పాత్ర పోషించాడని ఇండియా టుడేతో మాట్లాడుతూ కొనియాడాడు.‘నువ్వు ఎవరినిన మ్మొచ్చో.. మరెవరిని నమ్మకూడదో నువ్వే ఎంచుకోవచ్చు. కానీ జీవితంలో నమ్మకూడనిది ఏదైనా ఉందంటే అది మాత్రం ఆర్సీబీ డెత్ బౌలింగ్. ఈ మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్ సులువుగా గెలుస్తుందని అనుకున్నా. కానీ దాన్ని వారు సూపర్ ఓవర్ వరకూ తీసుకెళ్లారు.

క్రెడిట్ ఇద్దరిదే..
డివిలియర్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పరుగులు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపించాడు. దాంతోనే బంతిని అలవోకగా స్టేడియం బయటకు కొట్టాడు. డివిలియర్స్ చెలరేగిన ఆర్‌సీబీ 200 పరుగులు చేసినా.. ఈ విజయం క్రెడిట్ ఎవరికైనా ఇవ్వాలంటే మాత్రం తొలుత నవదీప్ సైనీకి ఇవ్వాలి. డెత్ ఓవర్లలో సూపర్‌గా బౌలింగ్ చేశాడు. ఇక సూపర్ ఓవర్‌లో ఇరగదీశాడు. అదే సమయంలో 12 పరుగులే ఇచ్చిన వాషింగ్టన్ సుందర్ కూడా ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. వీరిద్దరూ రాణించకపోతే ఆర్‌సీబీ కచ్చితంగా ఓడిపోయేది. ఆర్‌సీబీ డెత్ ఓవర్ల బౌలింగ్‌ను మాత్రం ఎప్పటికీ ఎవరూ నమ్మరు. 'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఇక 2020లో మంచి బహుమతి ఏదైనా ఉందంటే ఐపీఎల్ 2020నే అని ట్వీట్ చేశాడు.

సిక్సర్ల వర్షం..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 201 రన్స్ చేసింది. ఆరోన్ ఫించ్(35 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 52), దేవదూత్ పడిక్కల్(40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 ) ఏబీ డివిలియర్స్ (24 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు తీయగా.. రాహుల్ చాహర్ ఒక వికెట్ పడగొట్టాడు. అనంతరం ముంబై ఇండియన్స్ ఇషాన్ కిషన్, పొలార్డ్ సూపర్ బ్యాటింగ్‌తో 5 వికెట్లకు 201 రన్స్ చేసింది. ఇసురు ఉడాన రెండు వికెట్లు తీయగా.. సుంధర్, చహల్, జంపా తలో వికెట్ తీశారు.
దటీజ్ కోహ్లీ.. నీలా వెనుకాల దాక్కోడు రోహిత్.. నెట్టింట పేలుతున్న సెటైర్స్, జోక్స్!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications