దటీజ్ కోహ్లీ..
నవదీప్ సైనీ అద్భుత బౌలింగ్‌తో ముంబై ఇండియన్స్ సూపర్ ఓవర్‌లో 7 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఆర్‌సీబీ తరఫున లక్ష్యచేధనకు ఎవరు దిగుతారని అంతా ఆతృతగా ఎదురు చూశారు. ఏబీ డివిలియర్స్ ఒక్కడే ముందు మైదానంలోకి అడుగుపెట్టగా.. ఒక్కడే ఆడతాడేమోనంటూ కామెంటేటర్లు చమత్కరించారు. ఫామ్‌లో లేని కోహ్లీ బరిలోకి దిగడంతో అందరూ కొంచెం ఆందోళనకు గురయ్యారు. కానీ మిస్టర్ 360 ఓ ఫోర్ కొట్టి, సింగిల్ తీయడంతో స్కోర్లు సమమయ్యాయి. ఆఖరి బంతికి పరుగు చేస్తే ఆర్‌సీబీని గెలుపు వరిస్తుంది. స్ట్రైకింగ్‌లో కోహ్లీ ఉండటంతో కొంత ఉత్కంఠత కలిగింది. కానీ కోహ్లీ ఫోర్ కొట్టడంతో ఆర్‌సీబీ విజయం ఖాయమైంది.
అందుకే నేను వచ్చా..
అయితే సూపర్ ఓవర్‌లో తాను బ్యాటింగ్ చేయడానికి గల కారణాన్ని విరాట్ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో వెళ్లడించాడు. ‘బౌండరీలు పెద్దగా ఉండటం.. బుమ్రా బంతిని అందుకోవడం.. లక్ష్యం స్వల్పం కావడంతో సింగిల్స్, డబుల్స్ తీసే ఆటగాళ్లు ఎవరా? అని చర్చించి.. ఏబీడీ, నేను బరిలోకి దిగాం. అవసరమైతే సింగిల్స్, డబుల్స్ తీసైనా మ్యాచ్ గెలిపించాలనుకున్నాం'అని కోహ్లీ తెలిపాడు.
రోహిత్ నీలా దాక్కోలేదు..
ఇక కెప్టెన్‌గా ముందుండి నడిపించాల్సిన రోహిత్ శర్మ సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్ రాకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ షాట్లతో చెలరేగే రోహిత్.. హిట్ మ్యాన్ సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్ ఎందుకు చేయడని ప్రశ్నిస్తున్నారు. ‘కోహ్లీ ఫామ్‌లో లేనప్పటికీ.. సూపర్ ఓవర్లో ముందుండి జట్టును నడిపించాడు. కానీ రోహిత్ మాత్రం హార్దిక్, పోలార్డ్‌ల వెనుకాల దాక్కున్నాడు'అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ కెప్టెన్సీతోనూ ఆకట్టుకున్నాడని కామెంట్ చేస్తున్నారు. సూపర్ ఓవర్లోనూ సైనీతో తెలివిగా బంతులు వేయించాడని కొనియాడుతున్నారు.
టార్గెట్ చిన్నది కాబట్టే..
ఇక కోహ్లీ ఫ్యాన్స్ విమర్శలను రోహిత్ అభిమానులు కూడా తిప్పికొడుతున్నారు. స్వల్ప లక్ష్యం కాబట్టే కోహ్లీ సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్ వచ్చాడని, విజయం క్రెడిట్ తన ఖాతాలో వేసుకున్నాడని కామెంట్ చేస్తున్నారు. లేకుంటే కోహ్లీ బ్యాట్ కూడా ముట్టుకోకపోయేవాడని బదులిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 201 రన్స్ చేసింది. ఆరోన్ ఫించ్(35 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 52), దేవదూత్ పడిక్కల్(40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 ) ఏబీ డివిలియర్స్ (24 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు తీయగా.. రాహుల్ చాహర్ ఒక వికెట్ పడగొట్టాడు. అనంతరం ముంబై ఇండియన్స్ ఇషాన్ కిషన్, పొలార్డ్ సూపర్ బ్యాటింగ్‌తో 5 వికెట్లకు 201 రన్స్ చేసింది. ఇసురు ఉడాన రెండు వికెట్లు తీయగా.. సుంధర్, చహల్, జంపా తలో వికెట్ తీశారు.


Click it and Unblock the Notifications












