Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మీకేమైనా పిచ్చా.. రోహిత్, ధోనీ ఫ్యాన్స్ ఫైటింగ్‌పై సెహ్వాగ్ ఫైర్!

Virender Sehwag Reacts After MS Dhoni-Rohit Sharma Fans Fight With Each Other

న్యూఢిల్లీ: ఫేవరేట్ క్రికెటర్ల కోసం కొట్లాడుకోవద్దని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. తాజాగా కొల్హాపూర్‌లో ధోనీ, రోహిత్ శర్మ అభిమానుల మధ్య జరిగిన ఘర్షణపై సెహ్వాగ్ స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా ఈ ఘటనను ఖండించిన ఈ మాజీ ఓపెనర్.. అభిమానం పేరిట హింసకు పాల్పడవద్దని సూచించాడు. ఆటగాళ్లంతా కలిసి జట్టు కోసం ఆడుతున్నప్పుడు అభిమానుల మధ్య గొడవ ఎందుకని ప్రశ్నించాడు.

గాంధీని గుర్తు చేసుకోండి..

గాంధీని గుర్తు చేసుకోండి..

‘ఐపీఎల్ వేరుగా జరుగుతున్నా.. ఆటగాళ్లంతా జట్టుగా కలిసి దేశం కోసం ఆడుతారు. ఒకరికి ఒకరు పెద్దగా మాట్లాడకపోయినా.. ఎవరిపని వారు చేసుకుంటూనే గెలుపుకోసం ప్రయత్నిస్తారు. కానీ కొందరు అభిమానులు మాత్రం ఇలా హద్దుమీరి ప్రవర్తిస్తుంటారు. ఆటగాళ్లను వేరుగా చూస్తూ పిచ్చివాళ్లలా కొట్లాడుకుంటారు. మీరు నిజమైన క్రికెట్ అభిమానులు అయితే ఈ ఫైటింగ్స్ ఆపండి. ఆటగాళ్ల ప్రదర్శనను మాత్రమే టీజ్ చేస్తూ ఆస్వాదించండి. కానీ ఇతర ఆటగాళ్లతో పోల్చుతూ గొడవలకు దిగొద్దు. మహత్మాగాంధీని గుర్తు చేసుకోండి.'అని సెహ్వాగ్ ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఇక ట్విటర్ వేదికగా గొడవపడ్డ అభిమానులను పిచ్చోళ్లని ఘాటుగా వ్యాఖ్యానించాడు.

హోర్డింగ్స్‌తో వివాదం..

హోర్డింగ్స్‌తో వివాదం..

మహారాష్ట్రలోని కొల్పాపూర్‌లో హోర్డింగ్స్ పెట్టే విషయంలో రోహిత్, ధోనీ ఫ్యాన్స్ మధ్య వివాదం చెలరేగింది. ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన సందర్భంగా అతని అభిమానులు భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. శుక్రవారం క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు రోహిత్ శర్మను వరించడంతో అతని ఫ్యాన్స్ హోర్డింగ్స్ పెట్టారు. పోటాపోటీగా నెలకొల్పిన ఈ హోర్డింగ్స్‌తో గొడవ నెలకొంది. ఓ అభిమాని రోహిత్ శర్మ హోర్డింగ్ కిందపడేయడంతో.. అతని ఫ్యాన్స్ మహీ ఫ్యాన్స్‌పై అసభ్యపదజాలం ఉపయోగంచాడు. దీంతో సదరు అభిమానిని చెరకు తోటకు తీసుకెళ్లి చితకబాదారు. ఈ ఘర్షణకు సంబంధించిన వార్తలు నెట్టింట హల్‌చల్ చేయడంతో క్రికెటర్లతో పాటు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పైశాచిక అభిమానం..

పైశాచిక అభిమానం..

ఇక సెహ్వాగ్‌ కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా కాగా.. పైశాచిక అభిమానం పేరిట గొడవకు దిగిన వారిపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సెహ్వాగ్‌ చెప్పింది నిజం.. ఎందుకలా కొట్టుకుంటారు.. వారు దేశం కోసం ఆడుతుంటే మధ్యలో మీ లొల్లేందిరా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆటను ఆటలా చూడాలని ఇలాంటి చిల్లర పనులకు పాల్పడి వారి విలువను తగ్గించవద్దని సూచిస్తున్నారు. ఇన్నాళ్లు సినిమా హీరోలకే ఇలాంటి అభిమానులు ఉన్నారనుకున్నాం.. కానీ క్రికెటర్ల పేరిట కూడా హింసకు పాల్పడుతున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టీమిండియా రిటైర్డ్ ఎలెవన్ vs కోహ్లీ సేన మధ్య చారిటీ మ్యాచ్ నిర్వహించవచ్చు కదా: ఇర్ఫాన్ పఠాన్

Story first published: Sunday, August 23, 2020, 13:52 [IST]
Other articles published on Aug 23, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+