For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విరాట్ కోహ్లీ పెద్ద మనసు.. 10 వేల మంది చిన్నారులకు సాయం!

Virat Kohli to donate profit from a sanitation product to feed 10,000 malnourished children

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పెద్ద మనసు చాటుకున్నాడు. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం ఆర్జించే క్రికెటర్ అయిన ఈ రన్ మిషన్.. 10 వేల మంది చిన్నారులకు సాయం అందించబోతున్నాడు. ఎన్నో ఉత్పత్తులకు ప్రచారకర్తగా వ్యవహరిస్తూ కోట్ల రూపాయలు ఆర్జించే కోహ్లీ.. తాజాగా 'వైజ్'అనే సానిటైజర్ సంస్థతో బ్రాండ్ అంబాసిడర్‌గా ఒప్పందం కుదుర్చుకున్నాడు.

అయితే ఈ ఒప్పందం ద్వారా తనకు వచ్చే ఆదాయాన్ని మహారాష్ట్రలో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు ఖర్చు చేయనున్నాడు. ఈ నిరుపేద, అభాగ్యుల ఆలనపాలన చూస్తున్న 'రా ఫౌండేషన్'‌కు ఈ మొత్తాన్ని కోహ్లీ విరాళంగా అందజేయనున్నాడు. ఇక ఈ గొప్ప పనిలో భాగస్వామ్యం అవుతున్నందుకు గర్వపడుతున్నానని విరాట్ తెలిపాడు.

గర్వంగా ఉంది..

గర్వంగా ఉంది..

‘నేను ఈ గొప్ప పనిలో భాగం అవుతున్నందుకు గర్వపడుతున్నా. దేశంలో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు సాయంగా ‘వైజ్' సంస్థ ద్వారా నాకు వచ్చే ఆదాయాన్ని విరాళంగా ప్రకటిస్తున్నా. క్రీడాకారులకు మీ ప్రేమ ఆదరాభిమానాలే పెద్ద ఆస్తి. కానీ ఈ కరోనా విపత్కర కాలంలో కోవిడ్-19 వారియర్సే నిజమైన హీరోలు. వారు వాళ్ల ప్రాణాలను రిస్క్‌లో పెట్టి మరీ ఇతరులను కాపాడుతున్నారు. వైజ్‌తో ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉంది'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

కరోనా విరాళం@ రూ. 3 కోట్లు

కరోనా విరాళం@ రూ. 3 కోట్లు

కరోనా వైరస్ కట్టడికి తమవంతుగా పీఎం కేర్స్‌కు విరాళాన్ని ప్రకటించిన విరుష్కా జోడీ.. ఎంత సాయం చేశారనే విషయం మాత్రం ప్రకటించలేదు. అయితే మహారాష్ట్ర సీఎం నిధికి, పీఎంకేర్స్‌కు కలిపి రూ.3 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారని వారి సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా ముంబై పోలీసుల సంక్షేమానికి కూడా ఈ జోడీ విరాళాన్ని ప్రకటించింది. చెరో రూ.5 లక్షల చొప్పున రూ.10 లక్షల రూపాయాలను ముంబై పోలీస్ సంక్షేమానికి విరాళంగా ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నారు. ఈ విషయాన్ని అప్పట్లో ముంబై పోలీస్ ట్విటర్ వేదికగా తెలియజేస్తూ.. విరుష్కా జోడీకి కృతజ్ఞతలు తెలిపింది.

ముమ్మర ప్రాక్టీస్..

ముమ్మర ప్రాక్టీస్..

ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న కోహ్లీ.. నవంబర్ 27 నుంచి ప్రారంభమయ్యే పరిమిత ఓవర్ల సిరీస్ కోసం సిద్దమవుతున్నాడు. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్న భారత ఆటగాళ్లు.. ప్రాక్టీస్ చేసే వెసులు బాటు ఇవ్వడంతో ముమ్మరంగా సాధన చేస్తున్నారు. అయితే విరాట్ నాలుగు టెస్ట్‌ల సిరీస్ ఫస్ట్ టెస్ట్ మాత్రమే ఆడనున్నాడు. ఆ తర్వాత పెటర్నీటీ లీవ్‌పై భారత్‌కు తిరిగి రానున్నాడు. జనవరిలో విరాట్ సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ఓ బిడ్డకు జన్మనివ్వనుంది.

ట్రోలింగ్ దెబ్బకు యూటర్న్..కోహ్లీని కొనియాడుతూ సూర్యకుమార్ యాదవ్ ట్వీట్..బిత్తరపోయిన రోహిత్ ఫ్యాన్స్

Story first published: Thursday, November 19, 2020, 8:22 [IST]
Other articles published on Nov 19, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+