For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ట్రోలింగ్ దెబ్బకు యూటర్న్..కోహ్లీని కొనియాడుతూ సూర్యకుమార్ యాదవ్ ట్వీట్..బిత్తరపోయిన రోహిత్ ఫ్యాన్స్

Suryakumar Yadav comments on Virat Kohli’s latest tweet to smoothen things
Suryakumar Yadav Likes Tweet Trolling 'Paper Captain’ Virat Kohli, After Facing Heat Made Comments

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని రెండు రోజుల క్రితం పేపర్ కెప్టెన్‌గా అభివర్ణిస్తూ ఓ నెటిజన్ షేర్ చేసిన మీమ్‌ను లైక్ చేసిన ముంబై ఇండియన్స్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్.. అంతలోనే మనసు మార్చుకున్నాడు. విరాట్ అభిమానుల ట్రోలింగ్ ఎఫెక్టో.. లేక భవిష్యత్తుపై కలిగిన భయమో తెలియదు కానీ అంతలోనే భారత కెప్టెన్‌ను కొనియాడాడు. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విరాట్ కోహ్లీ.. అక్కడ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకోగా.. సూర్య స్పందించాడు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ డామినేషన్ చూడటానికి ఆగలేకపోతున్నానని కామెంట్ చేశాడు.

వీడేంట్ర ప్లేట్ ఫిరాయించాడు..

‘నీ ఎనర్జీ.. బ్యాటింగ్ సౌండ్.. కంగారూలపై ఆధిపత్యాన్ని చూసేందుకు ఆత్రుతతో ఎదురుచూస్తున్నా'అంటూ విరాట్ వీడియో ట్వీట్‌కు సూర్య బదులిచ్చాడు. ఇక విరాట్‌ను ట్రోల్ చేస్తూ షేర్ చేసిన మీమ్‌ను లైక్ చేసిన సూర్య అంతలోనే మనసు మార్చుకొని విరాట్‌ను కొనియాడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయినప్పటికీ కోహ్లీ అభిమానులు సూర్యను వదలడం లేదు. నీకు ఇప్పుడు జ్ఞానోదయం అయ్యిందా..? అంటూ ఉతికారేస్తున్నారు. ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ముఖ్యంగా సూర్య ట్వీట్‌తో రోహిత్ ఫ్యాన్స్ ‘వీడేంట్ర ప్లేట్ ఫిరాయించాడు'అనే ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తున్నారని ఫన్నీ పోస్ట్‌లు పెడుతున్నారు.

అసలు సంగతేంటంటే..?

అసలు సంగతేంటంటే..?

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య విభేదాలున్నాయని గత ఏడాదిగా ప్రచారం జరుగుతుంది. ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ శర్మను తొలుత ఎంపిక చేయకపోవడానికి కారణం కూడా విరాటేనని హిట్ మ్యాన్ అభిమానులు ఇప్పటికీ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ రోహిత్ అభిమాని విరాట్ కోహ్లీని పేపర్ కెప్టెన్‌గా.. సెలెక్టర్లన్లు, హేటర్స్‌ని ప్రేక్షకులుగా చిత్రీకరిస్తూ.. రోహిత్ శర్మ హీరోగా ఎంట్రీ ఇస్తున్నట్లు ఉన్న ఓ మీమ్‌ను ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. దీన్ని సూర్యకుమార్ యాదవ్ లైక్ చేయడంతో వివాదాస్పదమైంది. తమ అభిమాన కెప్టెన్‌ను అంతమాట అంటావా? అని కోహ్లీ అభిమానులు సూర్యపై తీవ్ర ట్రోలింగ్‌కు దిగారు. ఇక నువ్వు భారత్‌కు ఆడాలనే ఆశను వదిలేయ్..! అని కూడా హెచ్చరించారు.

సూర్య vs విరాట్ కోహ్లీ..

సూర్య vs విరాట్ కోహ్లీ..

ఈ ఐపీఎల్ సీజన్‌లో ఆర్‌సీబీతో జరిగిన సెకండ్ లీగ్ మ్యాచ్‌లో సూర్య సూపర్ బ్యాటింగ్‌తో విజయాన్నందించాడు. అయితే అతను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కోహ్లీ కనుసైగలతో కవ్వించే ప్రయత్నం చేశాడు. దీనికి సూర్య బ్యాట్‌తోనే బదులిచ్చాడు. అంతేకాకుండా విజయం సాధించిన తర్వాత ‘నేనున్నా.. టెన్షన్ ఎందుకు'అని సైగలు చేసాడు. అప్పట్లో విరాట్ కోహ్లీపై రోహిత్ అభిమానులు తీవ్ర ట్రోలింగ్‌కు దిగారు. సూర్యను కవ్విస్తావా? అని మండిపడ్డారు. అయితే ఈ వ్యవహారంపై ఈ ఇద్దరు ఆటగాళ్లు ఎలాంటి కామెంట్ చేయలేదు.

విరాట్ ఫ్యాన్ సూర్య..

వాస్తవానికి సూర్య కుమార్ యాదవ్.. విరాట్ కోహ్లీ అభిమాని. భారత కెప్టెన్ బ్యాటింగ్‌ను కొనియాడుతూ గతంలో చాలా సార్లు సూర్య ట్వీట్ చేశాడు. ముంబై మ్యాచ్ అనంతరం విరాట్ అభిమానులు.. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ట్రోలింగ్‌ను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. తాజాగా మరోసారి వివాదం చెలరేగడంతో..విరాట్ కోహ్లీ ట్వీట్‌పై పాజిటివ్‌గా కామెంట్ పెట్టిన సూర్యకుమార్.. ఆ వివాదానికి తెరదించే ప్రయత్నం చేశాడు. ఇక ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన సూర్యకు ఆస్ట్రేలియా టూర్‌లో అవకాశం దక్కలేదు. దీనిపై కూడా దుమారం రేగింది.

Story first published: Wednesday, November 18, 2020, 9:49 [IST]
Other articles published on Nov 18, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+