Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్‌తో కోహ్లీని పోల్చొద్దు: చాలా సమయం ఉందన్న దాదా

న్యూఢిల్లీ: 'పరుగుల మెషిన్' భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ మరోసారి ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే సమయానికి వరల్డ్ గ్రేటెస్ట్ జాబితాలో చేరడం ఖాయమని గంగూలీ అభిప్రాయపడ్డాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిఅయితే కోహ్లీకి ఇంకా చాలా భవిష్యత్ ఉన్నందున అప్పుడే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజాలతో పోల్చడం సరికాదని వ్యాఖ్యానించాడు. గురువారం ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్యూలో కోహ్లీ గురించి గంగూలీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

Virat Kohli terrific, he can go on to become a great: Sourav Ganguly


'ప్రపంచ దిగ్గజ క్రికెటర్ల సరసన చేరడానికి కోహ్లికి ఇంకా చాలా సమయం ఉంది. ఆరంభంలోనే ఉన్నాడు. అతను ఇంకా చాలా క్రికెట్ ఆడాల్సి వుంది. అందివచ్చిన అవకాశాల్ని వినియోగించుకుంటున్నాడు. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ , వీవీఎస్ లక్ష్మణ్ తదితర మేటి క్రికెటర్లతో కోహ్లిని అప్పుడే పోల్చొద్దు. కోహ్లికి వారి సరసన చేరే సత్తా అయితే ఉంది. అందుకు చాలా సమయం కూడా ఉంది. కోహ్లి గురించి ఐదు, ఆరు సంవత్సరాల తరువాత అడిగితే అప్పుడు నా దగ్గర సరైన సమాధానం ఉంటుంది' అని పేర్కొన్నాడు.

చంపుతుంటే పాక్‌తో ఆటలా?: గంభీర్‌కు దాదా మద్దతుకాగా, 2016లో అన్ని ఫార్మెట్లలో కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరిస్‌లో రెండు సెంచరీలతో పాటు రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. ఆసియా కప్‌లో చెలరేగి ఆడాడు. ఆ తర్వాత జరిగిన వరల్డ్ టీ20లో కూడా కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు.

లంకపై 133 నాటౌట్: కోహ్లీ ఎందుకంటే ప్రత్యేకమన్న గంగూలీఒకే ఏడాదిలో రెండు డబుల్ సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాది ఆగస్టులో వెస్టిండిస్‌తో జరిగిన టెస్టు సిరిస్‌లో డబుల్ సెంచరీ సాధించగా, ఇటీవల ముగిసిన ఇండోర్ టెస్టులో న్యూడిలాండ్‌పై 211 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+