For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లంకపై 133 నాటౌట్: కోహ్లీ ఎందుకంటే ప్రత్యేకమన్న గంగూలీ

By Nageshwara Rao

న్యూఢిల్లీ: వన్డే క్రికెట్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ముఖ్యంగా లక్ష్య ఛేదనలో కోహ్లీ రికార్డు అమోఘం. లక్ష్య ఛేదనలో భాగంగా టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు కోహ్లీ తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును విజయ తీరాలకు చేర్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిఇప్పటివరకూ కోహ్లి వన్డేల్లో 25 సెంచరీలను నమోదు చేశాడు. అయితే అందులో 15 సెంచరీలను భారీ లక్ష్య ఛేదనలో భాగంగా చేసినవే కావడం విశేషం. ఇలా కోహ్లీ సెంచరీలు చేసిన మ్యాచ్‌లలో 13 సార్లు టీమిండియా గెలిచింది. ఇలా వన్డేల్లోనే కాదు టెస్టుల్లో సైతం విరాట్ కోహ్లీ ఎన్నో విజయాలనందించాడు.

Sourav Ganguly

టీమిండియాకు టెస్టు కెప్టెన్‌గా ఉన్న కోహ్లీ బ్యాటింగ్‌ శైలికి ఎంతో మంది ముగ్ధులైన సందర్భాలు అనేకం. ఈ క్రమంలోనే విరాట్ వన్డేల్లో నమోదు చేసిన సెంచరీల్లో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీకి ఓ సెంచరీ అంటే చాలా ఇష్టమట.

2013లో ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ లక్ష్య ఛేదనకు దిగిన సమయంలో కోహ్లీ చేసిన 133 పరుగులే తాను చూసిన కోహ్లీ ఇన్నింగ్స్‌లలో అత్యుత్తమని గంగూలీ పేర్కొన్నాడు.

ఆ జట్టుకేమైంది?: న్యూజిలాండ్ ఆటతీరుపై గంగూలీ ఆశ్చర్యంఇప్పటికీ శ్రీలంకపై సాధించిన ఆ ఇన్నింగ్స్ అంటే తనకు ఎంతో ఇష్టమని గంగూలీ తెలిపాడు. 321 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా వరుసగా వికెట్లను కోల్పోయినప్పుడు బ్యాటింగ్ ఆర్డర్‌లో నాలుగో స్థానంలో వచ్చిన కోహ్లీ, లంక ఫేస్ బౌలర్ మలింగాను ఎదుర్కొన్న తీరు అద్భుతమని పేర్కొన్నాడు.

విదేశాల్లో క్లిష్ట పరిస్థితుల్లో కోహ్లీ అత్యుత్తమ ఆటతీరుని కనబర్చాడని ప్రశంసించాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లీ 86 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 133 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. పేస్ బౌలర్ మలింగా వేసిన ఓవర్‌లో 24 పరుగులు రాబట్టాడు.

తొలి బంతికి డబుల్ తీసిన కోహ్లీ, ఆ తరువాత బంతికి సిక్స్‌గా మలిచాడు. ఆ మిగతా నాలుగు బంతుల్ని ఫోర్లుగా బాదాడు. మలింగా వేసిన 15 బంతుల్లో కోహ్లీ మొత్తం 44 పరుగులు సాధించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+