Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్ కోల్పోయిన కోహ్లీ.. బుమ్రా, పుజారా కూడా..

Virat Kohli Slips to No. 2, Steve Smith Back on Top in ICC Test Rankings

దుబాయ్ : ఇటీవల పేలవ ఆటతీరుతో విఫలమవుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంకును కోల్పోయాడు. న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన తొలి టెస్టులో భారత్ ప‌ది వికెట్ల‌ తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో క‌లిపి కేవ‌లం 21 ప‌రుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమైన ఈ రన్ మిషెన్.. అగ్ర‌స్థానం కోల్పోయాడు. ప్ర‌స్తుతం కోహ్లీ 906 పాయింట్ల‌తో రెండో స్థానానికి ప‌డిపోయాడు. మ‌రోవైపు 911 పాయింట్ల‌తో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ టాప్ ర్యాంకును అందుకున్నాడు.

పడిపోయిన పుజారా..

ఈ తొలి టెస్ట్‌లోనే దారుణంగా విఫలమైన టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారా రెండు ర్యాంకులు కోల్పోయి 9వ స్థానంలో నిలవగా.. కొంత పోరాట పటిమ కనబర్చిన రహానే ఒక్క స్థానం మెరుగై 8వ స్థానం దక్కించుకున్నాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ సాధించిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 2 ర్యాంకులు ఎగబాకి 10 ర్యాంక్ అందుకున్నాడు.

చహల్, రోహిత్ కోతేశాలు.. ఒక తన్ను తన్నిన ఖలీల్ (వైరల్ వీడియో)

దిగజారిన బుమ్రా..

దిగజారిన బుమ్రా..

ఇక బౌల‌ర్ల విభాగంలో భార‌త పేస‌ర్‌ జ‌స్‌ప్రీత్ బుమ్రా కూడా టాప్-10లో చోటు కోల్పోయాడు. తొలి టెస్టులో ఒక్క వికెట్ మాత్ర‌మే తీయ‌డంతో తాజా ర్యాకింగ్స్‌లో 11వ ర్యాంకుకు ప‌డిపోయాడు. భార‌త్ నుంచి ర‌విచంద్ర‌న్ అశ్విన్ మాత్ర‌మే తొమ్మిదో ర్యాంకులో నిలిచి, టాప్‌-10లో చోటు ద‌క్కించుకున్నాడు. ఆల్‌రౌండ‌ర్ల జాబితాలో అశ్విన్ ఐదోస్థానం ద‌క్కించుకోగా.. ర‌వీంద్ర జ‌డేజా మూడో ర్యాంకులో నిలిచాడు.

బ్యాట్స్‌మన్ వైఫల్యం..

బ్యాట్స్‌మన్ వైఫల్యం..

ఇక రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ సేన కేవ‌లం 165 ప‌రుగులే చేసింది.అనంత‌రం కివీస్ 348 ప‌రుగులతో తొలి ఇన్నింగ్స్‌లో 183 ప‌రుగుల భారీ ఆధిక్యాన్ని ద‌క్కించుకుంది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో మ‌రోసారి బ్యాట్స్‌మెన్ వైఫ‌ల్యంతో భార‌త్ 191 ప‌రుగుల‌కే ప‌రిమిత‌వ్వగా.. 9 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని వికెట్లు కోల్పోకుండా ఛేదించిన కివీస్‌.. రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండోటెస్టు ఈనెల 29 నుంచి క్రైస్ట్‌చ‌ర్చ్‌లో జ‌రుగనుంది.

Story first published: Wednesday, February 26, 2020, 16:26 [IST]
Other articles published on Feb 26, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+