మళ్లీ ఇప్పుడే..
‘2016 ఐపీఎల్ సీజన్.. మా జట్టు అంతటికి చాలా ఇష్టం. ఆ తర్వాత మళ్లీ ఈసారి జట్టు మొత్తం సమతూకంగా ఉంది. ఈ సీజన్ మాకు గొప్పగా నిలవనుందని నేను, ఏబీ డివిలియర్స్ భావిస్తున్నాం. ఓ సీజన్‌కు ముందు నేనెప్పుడూ ఇంత ప్రశాంతంగా లేను. కానీ ఏబీ ఎప్పుడూ రిలాక్స్‌గానే ఉంటాడు. జీవితాన్ని ఆస్వాదిస్తూ ఫిట్‌గా ఉంటాడు. ఈసారి ఐపీఎల్ వాతావరణం మునుపటి కంటే చాలా బాగుంది.

వాటిని మర్చిపోయాను..
గత సీజన్ల ఫలితాల తాలుకు భారాన్ని పూర్తిగా వదిలేశాను. వాటి కోసం ఆలోచించి ఇది వరకు చాలాసార్లు దెబ్బతిన్నా. మంచి స్కిల్ ఉన్న ప్లేయర్లు మా టీమ్‌లో ఉండడం వల్లే ప్రజలకు మా మీద భారీగా అంచనాలు పెట్టుకుంటారు. క్రిస్ మోరిస్ చేరికతో జట్టులో బ్యాలెన్స్ వచ్చింది. ఇక, ఆరోన్ ఫించ్ అనుభవం మాకు కలిసిరానుంది. జోష్ ఫిలిప్ సహా కొంతమంది యువ ఆటగాళ్లను ఈసారి తీసుకున్నాం. వారు ఎలా ఆడుతారో చూడాలని అనుకుంటున్నా'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

2016లో రన్నరప్..
ఇక 2016 సీజన్‌లో ఆర్‌సీబీ అద్భుత ప్రదర్శన కనబర్చింది. క్రిస్ గేల్, డివిలియర్స్ సహకారంతో కోహ్లీ చెలరేగాడు. ఈ ముగ్గురు విధ్వంసం సృష్టించండంతో అభిమానులకు కావాల్సిన మజా అందింది. ఆ సీజన్‌లో కోహ్లీ రెచ్చిపోయి ఆడాడు. లీగ్ ఆసాంతం ఆధిపత్యం కనబర్చిన ఆ జట్టు ఫైనల్లో మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడి తృటిలో టైటిల్ చేజార్చుకుంది. అనంతరం జరిగిన మూడు సీజన్లలో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేదు. ఇక ఈ సీజన్‌కు స్టార్ బౌలర్లను తీసుకున్న ఆ జట్టు టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది.

టైటిల్ కరువు..
ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచీ ఆర్‌సీబీ ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, డేల్ స్టెయిన్ లాంటి దిగ్గజ ఆటగాళ్లున్నా ఆ జట్టు చాంపియన్‌గా అవతరించలేదు. ప్రతీసారి కప్పు మనదే అంటూ రావడం, ఒట్టి చేతులతో వెనుతిరగడం పరిపాటిగా మారింది. మూడుసార్లు ఫైనల్‌కు చేరినా కప్పు సాధించలేకపోయింది. ఇక సెప్టెంబర్ 21న దుబాయ్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌తో ఈ సీజన్‌ను షురూ చేయనుంది.
ఉప్పల్ పోలీస్ స్టేషన్ చేరిన హెచ్‌సీఏ వివాదం.. పోలీసులకు ఫిర్యాదు చేసిన అజారుద్దీన్!


Click it and Unblock the Notifications
