For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఉప్పల్ పోలీస్ స్టేషన్ చేరిన హెచ్‌సీఏ వివాదం.. పోలీసులకు ఫిర్యాదు చేసిన అజారుద్దీన్!

Mohammad Azharuddin files police complaint against HCA member for alleged abuse of him

హైదరాబాద్: మహ్మద్ అజారుద్దీన్ నాయకత్వంలోని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో అంతర్గత కుమ్ములాటలు వీధికెక్కాయి. మొన్నటిదాకా ఉప్పల్ స్టేడియానికి పరిమితమైన హెచ్‌సీఏ రాజకీయ రగడ.. ఇప్పుడు స్టేడియం గేటు దాటి పోలీస్ స్టేషన్ చేరింది. ఇద్దరు ఉద్యోగుల మధ్య నెలకొన్న గొడవ నేపథ్యంలో అజారుద్దీన్ పోలీసులను ఆశ్రయించాడు. హెచ్‌సీఏ అంపైర్ యూసుఫ్‌తో పాటు తనను దూషించారని, తనపై తప్పుడుప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ హెచ్‌సీఏ ట్రెజరర్ సురేందర్ అగర్వాల్, అసోసియేషన్ మెంబర్ సయ్యద్ మొయిజుద్దీన్‌పై ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశాడు. అజార్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రంగస్వామి తెలిపారు.

అంబుడ్స్‌మన్‌ నియామకంతో రచ్చ

అంబుడ్స్‌మన్‌ నియామకంతో రచ్చ

హెచ్‌సీఏ రాజ్యాంగం ప్రకారం అంబుడ్స్‌మన్‌, ఎథిక్స్‌ అధికారిని నియమించాలంటే తొలుత అపెక్స్‌ కౌన్సిల్‌లో చర్చించి ఆ తర్వాత ఏజీఎంలో ఆ అంశాన్ని ప్రతిపాదించాలి. కరోనా దృష్ట్యా ఇప్పుడు ఏజీఎంను సమావేశపర్చలేమని, కాబట్టి ముందు అంబుడ్స్‌మన్‌ను నియమించి అనంతరం ఏజీఎంలో దానికి సభ్యుల అంగీకారం తీసుకుందామని అజార్ ప్రతిపాదించాడు. ఇది నిబంధనలకు విరుద్ధమని, ఏజీఎంలోనే నిర్ణయం తీసుకోవాలని కార్యవర్గ సభ్యులు తీర్మానించారు.

బీసీసీఐకి లేఖ..

బీసీసీఐకి లేఖ..

ఇంతలో అజార్‌ అనూహ్యంగా ఈనెల 2న ఏడాది పదవీకాలానికిగానూ నెలకు రూ.2 లక్షలు వేతనం చెల్లించేలా సుప్రీంకోర్టు మాజీ జస్టిస్‌ దీపక్‌ను అంబుడ్స్‌మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు. అజార్‌ లేఖను ఖండిస్తూ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌, ఉపాధ్యక్షుడు జాన్‌ మనోజ్‌తో సహా మిగిలిన సభ్యులంతా దీపక్‌ వర్మకు లేఖ రాశారు. దీంతో ఆగ్రహించిన అజర్‌.. వారి లేఖ చెల్లదని అంబుడ్స్‌మన్‌గా బాధ్యతలు తీసుకోవాలని దీపక్‌వర్మతో పాటు ఈసారి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, కార్యదర్శి జైషాకు కూడా లేఖ రాశాడు.

వేట తప్పదా..?

వేట తప్పదా..?

ఇంతటి ఉద్రిక్తతల నడుమ ఈ నెల 15న జరిగే అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశానికి అజారుద్దీన్‌ హాజరవుతాడా? ఇతర కార్యవర్గ సభ్యులు అతన్ని ఎలా ఎదుర్కొనబోతున్నారు అనేది హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పటికే విజయానంద్‌ నేతృత్వంలోని పలువురు హెచ్‌సీఏ క్లబ్‌ కార్యదర్శులు ఒక చోట సమావేశమైనట్టు తెలుస్తోంది. మెజారిటీ క్లబ్‌లు, కార్యవర్గ సభ్యుల మద్దతుతో త్వరలో జరిగే ఏజీఎంలో అజరుద్దీన్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా అజార్‌పై సస్పెన్షన్‌ వేటు వేసి హెచ్‌సీఏకు దూరం చేయాలనే ఆలోచనతో పావులు కదుపుతున్నట్టు సమాచారం.

క్రికెటర్ల గుడ్​ బై..

క్రికెటర్ల గుడ్​ బై..

ఇక అసోసియేషన్‌లో నెలకొన్న రాజకీయాలతో విసుగుచెందిన హైదరాబాద్ స్టార్ ఆటగాళ్లు ఒక్కొక్కరు హెచ్‌సీఏను వీడుతున్నారు. టీమ్‌మెనేజ్‌మెంట్, అసోసియేషన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించి రంజీట్రోఫీకి అంబటిరాయుడు దూరంగా ఉండగా.. తాజాగా స్టార్‌‌‌‌‌‌‌‌ క్రికెటర్‌‌‌‌‌‌‌‌, ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో సన్‌‌‌‌‌‌‌‌రైజర్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌కు ఎంపికైన బావనక సందీప్ కూడా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ను వీడాడు. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో గోవా టీమ్‌‌‌‌‌‌‌‌ తరఫున ఆడేందుకు హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ నుంచి ఎన్‌‌‌‌‌‌‌‌ఓసీ తీసుకున్నాడు.

ఐపీఎల్‌‌‌‌‌‌‌‌కు సెలెక్ట్‌‌‌‌‌‌‌‌ అయినప్పటికీ.. ఈ డొమెస్టిక్ సీజన్​లో అయినా అతనికి తుది జట్టులో చోటు గ్యారంటీ ఇచ్చే వాళ్లు కరువయ్యారు. దాంతో, ఈ యంగ్‌‌‌‌‌‌‌‌ క్రికెటర్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ను వీడాలన్న కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కాగా, సందీప్‌‌‌‌‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ విషయంలోనూ హెచ్‌‌‌‌‌‌‌‌సీఏలో రగడ జరిగింది. అతను ఎన్‌‌‌‌‌‌‌‌ఓసీ కోరిన విషయం తనకు తెలియదని అజహర్ అంటుంటే... సందీప్‌‌‌‌‌‌‌‌ లెటర్‌‌‌‌‌‌‌‌ను ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌కు వాట్సప్‌‌‌‌‌‌‌‌ చేసినా, ఎలాంటి స్పందన రాకపోవడంతో ఎన్‌‌‌‌‌‌‌‌ఓసీ జారీ చేశానని సెక్రటరీ విజయానంద్‌‌‌‌‌‌‌‌ తెలిపారు.

England vs Australia: ఓయ్ బట్లర్ దీనికా రివ్యూ తీసుకునేది.. నువ్వు గొప్పోడివి సామి.! (వీడియో)

Story first published: Tuesday, September 8, 2020, 8:11 [IST]
Other articles published on Sep 8, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+