Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

india vs Australia: మా ఓటమికి అదే కారణం: విరాట్ కోహ్లీ

Virat Kohli says Our body language was disappointing, lack of all-round options affecting balance

సిడ్నీ: పార్ట్‌టైమ్ బౌలర్ల కొరత, చెత్త ఫీల్డింగ్‌తోనే ఆస్ట్రేలియాతో జరిగిన ఫస్ట్ వన్డేలో ఓటమిపాలయ్యామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో కోహ్లీ సేన 66 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన విరాట్.. తమ ఓటమికి ఎలాంటి సాకులు లేవన్నాడు. తమ ప్రణాళికలను అమలు చేయడంలో విఫలమయ్యామని అంగీకరించాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటలేకపోయామని, తప్పిదాలు తెలుసుకొని తదుపరి మ్యాచ్‌లకు సిద్దమవుతామన్నాడు.

సాకుల్లేవ్..

సాకుల్లేవ్..

‘మేం అన్ని విధాల సిద్దమవ్వడానికి తగినంత సమయం లభించింది. కానీ మా ప్రణాళికలను అమలు చేయడంలో విఫలమయ్యాం. మా ఓటమికి ఎలాంటి సాకులు లేవు. ఇటీవల టీ20 క్రికెట్ ఎక్కువగా ఆడిన మాకు ఇది ఫస్ట్ లాంగ్ గేమ్. కానీ వన్డే క్రికెట్ ఆడిన అనుభవం కూడా మాకుంది. అయితే 25-26 ఓవర్ల తర్వాత మా ఫీల్డింగ్ నిరాశపరిచింది. ఎంతటి నాణ్యమైన జట్టుకైనా ఫిల్డింగ్ తప్పిదాలు దెబ్బతీస్తాయి. అలాగే పార్ట్ టైమ్ బౌలర్ల కొరత కూడా ఇబ్బంది కలిగించింది. ఈ విషయంపై దృష్టి సారించాలి.

బౌలింగ్ ఆప్షన్స్‌పై..

బౌలింగ్ ఆప్షన్స్‌పై..

దురదృష్టవశాత్తు హార్దిక్ బౌలింగ్ చేయడానికి సిద్దంగా లేడు. ఈ విషయాన్ని గ్రహించి.. ఇతర ఆప్షన్స్‌పై వర్క్ చేయాలి. జట్టు సమతూకం రావాడానికి అది చాలా కీలకం. స్టోయినిస్, మ్యాక్స్‌వెల్ ఆస్ట్రేలియాకు అదే చేశారు. ఇక ఆసీస్ వరుసగా వికెట్లు తీయగా.. మేం అది చేయలేకపోయాం. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే.. మ్యాచ్ అనంతరం అందరం కూర్చొని మాట్లాడుకున్నాం. సానుకూల దృక్పథంతో బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం.

 టాప్-3 చెలరేగాలి..

టాప్-3 చెలరేగాలి..

టాప్ -3 నుంచి 130, 140 వంటి పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడాల్సిన అవసరం ఉంది. దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాం. హార్దిక్ ఇన్నింగ్స్ మాకు ఉదహారణంగా నిలిచింది. అలాంటి ఇంటెంట్‌తో ఆడాల్సిన అవసరం ఉంది. తదుపరి మ్యాచ్‌లకు అలాగే సిద్దమవుతాం. ఇక భారీ లక్ష్యాలు చేసినప్పుడు మనదగ్గర దానికి తగ్గ ప్రణాళికలు ఉండాలి. ఫించ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నేను బౌలింగ్ చేసుండాల్సింది (నవ్వుతూ). ఎందుకంటే ఫించ్‌కు నా చేతిలో ఔటవ్వడానికి ఇష్టపడడని తెలుసు.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

 374 భారీ టార్గెట్..

374 భారీ టార్గెట్..

ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఆరోన్‌ ఫించ్‌ ( 124 బంతుల్లో 9 ఫోర్లు, 2సిక్స్‌లతో 114), స్టీవ్ స్మిత్‌ (66 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 105) సెంచరీలతో చెలరేగగా.. డేవిడ్‌ వార్నర్‌ (76 బంతుల్లో 6ఫోర్లతో 69), గ్లేన్‌ మాక్స్‌వెల్‌ (19 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 45) మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించారు. భారత్ బౌలర్లలో మహ్మద్ షమీ (3/59) మూడు వికెట్లు తీయగా.. బుమ్రా, సైనీ, చాహల్ తలో వికెట్ తీశారు.

అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన టీమిండియా.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 308 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. హార్దిక్ పాండ్యా( 76 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 90), శిఖర్ ధావన్(86 బంతుల్లో 10 ఫోర్లతో 74) రాణించినా ఫలితం లేకపోయింది. ఆసీస్ బౌలర్లలో జంపా నాలుగు, హజల్ వుడ్ మూడు వికెట్లు తీయగా.. స్టార్క్ ఓ వికెట్ తీశాడు.

India vs Australia: యుజ్వేంద్ర చాహల్ చెత్త రికార్డు.. భారత క్రికెట్ చరిత్రలోనే తొలి స్పిన్నర్‌గా..

Story first published: Friday, November 27, 2020, 22:34 [IST]
Other articles published on Nov 27, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+