
బాధతో రాత్రంతా ఏడ్చా..
తొలి సారి స్టేట్ టీమ్ సెలెక్షన్స్‌లో పాల్గొంటే తనకు ఎదురు దెబ్బ తగిలిందని, ఆ ట్రయల్స్‌లో రిజెక్ట్ చేశారని కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. అన్ అకాడమీ నిర్వహించిన ఆన్‌లైన్ సెషన్‌లో విరాట్ తన సతీమణి అనుష్క శర్మతో కలిసి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను ఈ భారత కెప్టెన్ చెప్పుకొచ్చాడు.
‘కెరీర్ ప్రారంభంలో తొలిసారి స్టేట్ టీమ్ సెలక్షన్స్‌లో పాల్గొన్న నాకు ఎదురుదెబ్బ తగిలింది. ట్రయల్స్‌లో నన్ను రిజెక్ట్ చేశారు. దాంతో.. ఆ రోజు రాత్రంతా ఏడ్చాను. పరుగులు బాగా చేసినా జట్టులోకి తీసుకోకపోవడంతో చాలా బాధపడ్డాను. కోచ్‌తో ఓ రెండు గంటల పాటు మాట్లాడాను. ఎందుకు సెలెక్ట్ చేయలేదని కూడా అడిగాను. ఆ తర్వాత ఇంటికి వెళ్లి ఇలా ఎందుకు జరిగిందని తీవ్రంగా ఆలోచిస్తూ బాధపడ్డాను. కానీ ఆటపై నాకు ఉన్న అంకితభావం మళ్లీ ఈ స్థాయిలో నిలబెట్టింది'అని విరాట్ చెప్పుకొచ్చాడు.
నా ఫేవరేట్ హీరో ప్రభాస్: స్టార్ క్రికెటర్

గౌరవం, కృతజ్ఞతాభావం పెరిగింది..
ఇక కరోనా కారణంగా ప్రజల ఆలోచన ధృక్పథంలో మార్పు వచ్చిందని ఈ రన్‌మిషన్ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా పారిశుద్ద్య కార్మికులు, పోలీసులు, వైద్యుల పట్ల గౌరవం, కృతజ్ఞతాభావం పెరిగిందని, ఈ సంక్షోభం ముగిసినా వారిపై ఇది ఇలానే కొనసాగుతుందన్నాడు.
‘ఈ సంక్షోభ సమయంలో సానుకూల అంశం ఏంటంటే.. పారిశుద్ద్య కార్మికులు, పోలీసులు, వైద్యులు, అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న కార్మికుల పట్ల గౌరవం, కృతజ్ఞతాభావం చూపించడం. భవిష్యత్తులో కూడా ఇది ఇలానే కొనసాగుతుందని ఆశిస్తున్నా'అని కోహ్లీ తెలిపాడు.

ఇతరులతో పోలిక వద్దు..
జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని, సంతోషం కలిగించే పనులే చేయాలని కోహ్లీ సూచించాడు. ఇతరులతో అస్సలు పోల్చుకోవద్దని, ఈ సంక్షోభ పరిస్థితులు ముగిసిన తర్వాత జీవితం చాలా భిన్నంగా ఉంటుందన్నాడు. ఆరోగ్యానికి మించింది ఏది లేదని ప్రపంచానికి కరోనా నేర్పిందన్నాడు.

అండర్-19 ప్రపంచకప్‌తో..
టీ20 ప్రపంచకప్ విజయంతో వెలుగులోకి వచ్చిన విరాట్.. భారత్ జట్టులోకి 2008లో ఎంట్రీ ఇచ్చాడు. ధోనీ అనూహ్య నిర్ణయంతో
2014లో తొలిసారి టెస్టు టీమ్ పగ్గాలు అందుకున్నాడు. ఆ తర్వాత 2017లో టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్‌గా మారిన కోహ్లీ.. 2018-19 ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్ గెలిచి ఈ ఘనత సాధించి తొలి ఆసియా కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. కానీ ఐసీసీ టోర్నీల్లో మాత్రం విఫలమవుతున్నాడు. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో, 2019 వన్డే వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్లో కోహ్లీ సేన ఓటమిపాలైన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications
