
తేలిపోయాం..
‘ఈ మ్యాచ్‌లో మేం పూర్తిగా తేలిపోయాం. బౌలింగ్‌లో ప్రభావం చూపలేకపోయాం. సరైన ప్రదేశాల్లో బంతులు వేయడంలో విఫలమయ్యాం. ఆస్ట్రేలియాకు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. పైగా మైదానంపై పట్టు ఉంది. దాంతో భారీ లక్ష్యాన్ని నిర్ధేశించారు. మేం 340 పరుగులు చేసినా 51 పరుగులతో ఓడిపోయాం. ప్రత్యర్థి తక్కువ స్కోర్‌కు కట్టడి చేయాల్సింది. అయితే ఆసీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. అవకాశాలను సృష్టించుకొని పై చేయి సాధించారు.

హార్దిక్‌ను రిక్వెస్ట్ చేశా..
ఇక మా బౌలింగ్ ప్రణాళికల్లో హార్దిక్ పాండ్యా లేడు. బ్యాటింగ్ అనుకూలమైన పిచ్‌పై అతను ఎలా వేయగలడా? అని నేనే అడిగా. కానీ అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కట్టర్స్‌తో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టాడు. ఆఖరి 10 ఓవర్లలో 100 పరుగులు చేయాల్సి ఉన్నా హార్దిక్ పూర్తి చేస్తాడని నేను, రాహుల్ అనుకున్నాం. రాహుల్, నేను 40వ ఓవర్ వరకు ఆడుంటే ఆసీస్ బౌలర్లపై ఒత్తిడి పెరిగేది. అప్పుడు ఫలితం మరోలా ఉండేది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఆసీస్ బ్యాట్స్‌మెన్ ధాటికి భారత బౌలర్లు మరోసారి భారీగా పరుగులు సమర్పించుకున్నారు. జస్‌ప్రీత్ బుమ్రా (1/79), షమీ (1/73), చహల్ (0/71), సైనీ (0/70), జడేజా(0/60) దారుణంగా విఫలమయ్యారు. పాండ్యా(1/24) ఒక్కడే ఫర్వాలేదనిపించాడు.

టచ్‌లోకి కోహ్లీ..
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 389 రన్స్ చేసింది. స్టీవ్ స్మిత్ (104; 64 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సులు) మరోసారి మెరుపు సెంచరీతో రాణించగా.. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (83; 77 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులు), ఆరోన్ ఫించ్ (60; 69 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. చివర్లో మార్నస్ లబుషేన్ (70; 61 బంతుల్లో 5 ఫోర్లు) , గ్లెన్ మ్యాక్స్‌వెల్ (63; 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులు) పరుగుల విధ్వంసం సృష్టించారు. అనంతరం భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 338 పరుగులకే పరిమితమైంది. విరాట్ కోహ్లీ(89), కేఎల్ రాహుల్(76) పోరాడినా ఫలితం లేకపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లీ టచ్‌లోకి రావడం శుభపరిణామం.
విజయానందంలో ఉన్న ఆసీస్‌కు గట్టి షాక్.. గాయంతో డేవిడ్ వార్నర్ ఔట్!


Click it and Unblock the Notifications
