Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లా..? ఆ మజా మిస్స‌వుతాం: కోహ్లీ

Virat Kohli reacts to the idea of playing matches behind closed doors

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా క్రికెట్ టోర్నీలన్నీ రద్దవ్వడమో.. వాయిదాపడటమో జరిగిన విషయం తెలిసిందే. ఈ మహమ్మారి వ్యాప్తి త‌గ్గుముఖం ప‌ట్టాక క్రికెట్ కార్య‌క‌లాపాల‌ను చేప‌ట్ట‌డంపై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆయా దేశాల క్రికెట్ బోర్డులు దృష్టి సారిస్తున్నాయి. ఈనేపథ్యంలో కొవిడ్-19 భారినపడకుండా.. అభిమానులు లేని ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించాలని సమాలోచనలు చేస్తున్నాయి.

భిన్నాభిప్రాయాలు..

భిన్నాభిప్రాయాలు..

నిరవధికంగా వాయిదా పడ్డ ఐపీఎల్ 2020 సీజన్, ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్‌లను ఇలా ప్రేక్షకుల్లేకుండా నిర్వహించాలనుకుంటున్నాయి. అయితే ఈ ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంత‌మంది ఈ ఆలోచ‌న‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతుంటే.. మ‌రికొంత మంది విబేధిస్తున్నారు.

తాజాగా ఈ ప్రతిపాదనపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. స్టార్ స్పోర్ట్స్ క్రిక్ కనెక్టెడ్ షో‌లో మాట్లాడుతూ.. క‌రోనా తగ్గుముఖం పట్టినా.. కిక్కిరిసిన మైదానాల్లో మ్యాచ్‌లు నిర్వహించే పరిస్థితి ఉండదని విరాట్ అంచనా వేశాడు. ప్రేక్షకుల్లేకుండానే మ్యాచ్‌లు జరుగుతాయన్నాడు.

వాటిని మిస్సవుతాం..

వాటిని మిస్సవుతాం..

అయితే ఖాళీ మైదానాల్లో ఆడటం వల్ల ఆట‌గాళ్ల ఇంటెన్సిటిలో ఎలాంటి మార్పు ఉండదని కానీ, ప్రేక్షకుల సందడి వల్ల వచ్చే మజాను మిస్సవుతామన్నాడు. ఇది కొంత ఇబ్బందికరంగానే ఉంటుదని తెలిపాడు. ‘ప్రేక్షకుల్లేకుండానే మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం ఉంది. దీన్ని అందరూ ఎలా తీసుకుంటారనేది మాత్రం నాకు తెలియదు. ఎందుకంటే మేమంతా క్రికెట్‌ను పిచ్చిగా ఆరాధించే లక్షాలాది అభిమానుల మధ్య ఆడుతుంటాం. ఆటగాళ్ల ఇంటెన్సిటీలో ఎలాంటి మార్పు ఉండదని నాకు తెలుసు. కానీ అభిమానులతో కనెక్ట్ అయిన ఫీలింగ్.. ఉద్రిక్తత పరిస్థితులు.. ఆ భావోద్వేగాలను మాత్రం మిస్సవుతాం. వాటిని రీ క్రీయేట్ చేయడం కష్టం'అని కోహ్లీ తెలిపాడు.

ఎక్కడ ఆపానో.. అక్కడ నుంచే మళ్లీ స్టార్ట్ చేస్తా..

ఎక్కడ ఆపానో.. అక్కడ నుంచే మళ్లీ స్టార్ట్ చేస్తా..

మునుపటి లయని అందుకోవాలంటే కనీసం నెల రోజులు ప్రాక్టీస్ అవసరమని అంటున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటని కోహ్లీని ప్రశ్నించగా.. 'ఈ బ్రేక్ సమయంలోనూ నేను పాజిటివ్‌గా ఉన్నాను. మళ్లీ నేను గేమ్‌లోకి రాగానే మునుపటి తరహాలోనే రాణిస్తానని నమ్మకం ఉంది. ఆట ఎక్కడ ఆపానో.. మళ్లీ అక్కడి నుండే మొదలు పెడుతా' అని విరాట్ కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు. లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌మైనా.. సానుకూల దృక్ప‌థంతోనే ముందుకు సాగుతున్నా అని పేర్కొన్నాడు.

వ్యతిరేక ఆలోచ‌న‌ల‌ను ద‌రిచేర‌నివ్వను..

వ్యతిరేక ఆలోచ‌న‌ల‌ను ద‌రిచేర‌నివ్వను..

కరోనా వైరస్ కారణంగా గత రెండు నెలల నుంచి క్రికెటర్లు ఆటకి దూరంగా ఉంటున్నారు. దాంతో.. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ టచ్ పోయిందని రోహిత్ శర్మ, మహమ్మద్ షమీ, అజింక్య రహానే తెలిపారు. మునుపటి లయని అందుకోవాలంటే కనీసం నెల రోజులు ప్రాక్టీస్ అవసరమని వారు అభిప్రాయపడ్డారు. కానీ.. విరాట్ మాత్రం తాను ఇప్పటికీ మంచి పొజిషన్‌లోనే ఉన్నానని చెపుతున్నాడు. తానెప్పుడు ఆశావాహంగానే ఆలోచిస్తానని, నెగిటివ్ థాట్స్ ద‌రిచేర‌నివ్వ‌నన్నాడు.

సచిన్‌పై టాంపరింగ్ అభియోగాలు.. ఆరుగురి భారత ఆటగాళ్లపై సస్పెన్షన్.. అట్టుడికిన పార్లమెంట్!

Story first published: Friday, May 8, 2020, 18:40 [IST]
Other articles published on May 8, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+