India vs Australia: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు.. సచిన్, లారా, పాంటింగ్ ఘనతలకు ఎసరు!

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో ఫస్ట్ డేనైట్ టెస్ట్ ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని మూడు అరుదైన ఘనతలు ఊరిస్తున్నాయి. అయితే ఈ మూడు రికార్డులు విరాట్ కోహ్లీ చేసే సెంచరీతో ముడిపడి ఉండటం విశేషం. అడిలైడ్ వేదికగా గురువారం ప్రారంభమయ్యే ఈ పింక్ బాల్ టెస్ట్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తే దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా, రికీ పాంటింగ్‌ల రికార్డులు బద్దలవ్వనున్నాయి. ప్రతీ సిరీస్‌లో తనదైన బ్యాటింగ్‌తో పరుగుల మోత మోగించే విరాట్.. కనీసం ఒక్క రికార్డు అయిన తన ఖాతాలో వేసుకుంటాడు. మరీ ఈ మూడు రికార్డుల్లో ఏది సాధిస్తాడో చూడాలి!

మరో 180 పరుగులు చేస్తే..
అడిలైడ్ మైదానంలో అత్యధిక పరుగులు సాధించిన నాన్ ఆస్ట్రేలియన్‌గా ఘనత సాధించడానికి విరాట్ 180 పరుగుల దూరంలో నిలిచాడు. ప్రస్తుతం ఆ రికార్డు వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్‌మన్ లారా పేరిట ఉంది. లారా 4 మ్యాచ్‌ల్లో 610 పరుగులు చేయగా, విరాట్ మూడు మ్యాచ్‌ల్లో 431 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలున్నాయి. తొలి రెండు ఇన్నింగ్స్‌ల్లోనే విరాట్ ఈ పరుగులు చేస్తే లారా రికార్డు బ్రేక్ అవుతుంది. ఇక విరాట్ ఈ మ్యాచ్‌లో 180 రన్స్ చేయాలంటే కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా సెంచరీ ఇన్నింగ్స్ ఆడాలి.

సెంచరీ చేస్తే..
అడిలైడ్ టెస్టులో విరాట్ కోహ్లీ సెంచరీ సాధిస్తే..? దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కంగారూల గడ్డపై నెలకొల్పిన అరుదైన రికార్డ్ ఒకటి బద్దలుకానుంది. ఆస్ట్రేలియాలో 20 టెస్టులాడిన సచిన్ టెండూల్కర్ 53.2 సగటుతో 1,809 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. మరోవైపు 12 టెస్టులాడిన విరాట్ కోహ్లీ 55.39 సగటుతో 1,274 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఇప్పటికే ఆరు శతకాలు నమోదు చేసి సచిన్ సరసన ఉన్న కోహ్లీ.. అడిలైడ్ టెస్టులో మరో శతకం సాధిస్తే.. ఏడు సెంచరీలతో అగ్రస్థానాన్ని చేజిక్కించుకోనున్నాడు.

కెప్టెన్‌గా పాంటింగ్ రికార్డు..
సారథిగా విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 41 సెంచరీలు చేశాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా 41 సెంచరీలతో కోహ్లీతో కలిసి టాప్‌లో ఉన్నాడు. మరో సెంచరీ చేస్తే కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు చేసిన వరల్డ్ రికార్డును కోహ్లీ తన ఖాతాలో వేసుకుంటాడు. అయితే ఆస్ట్రేలియాలో ఈ రికార్డు అందుకోవడానికి కోహ్లీకి ఒక టెస్ట్ మాత్రమే అవకాశం ఉంది. తొలి టెస్ట్ తర్వాత కోహ్లీ ఇండియాకు తిరిగి వస్తున్న విషయం తెలిసిందే. దీంతో అడిలైడ్‌లో జరగబోయే డే/నైట్ టెస్ట్‌లోనే ఈ మైల్‌స్టోన్‌ను విరాట్ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇందులోనైనా..
అయితే ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక శతకాలు సాధించిన జాబితాలో కోహ్లీ (70) మూడో స్థానంలో ఉన్నాడు. సచిన్ (100), రికీ పాంటింగ్ (71) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. మరో శతకం సాధిస్తే ఈ జాబితాలో పాంటింగ్‌తో కలిసి సమంగా రెండో స్థానంలో నిలుస్తాడు. కాగా, ఆసీస్‌తో తొలి టెస్టు ముగిసిన అనంతరం కోహ్లీ పెటర్నిటీ సెలవులపై స్వదేశానికి తిరిగిరానున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకూ ఏ ఫార్మాట్‌లోనూ కోహ్లీ సెంచరీ నమోదు చేయని విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
తండ్రైన కేన్ మామ.. తన ఇంట అడుగుపెట్టిన అదృష్ట లక్ష్మీ