Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తండ్రైన కేన్ మామ.. తన ఇంట అడుగుపెట్టిన అదృష్ట లక్ష్మీ

Kane Williamson, Sarah Raheem blessed with Baby Girl

హామిల్టన్: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తండ్రి అయ్యాడు. అతని సతీమణి సారా రహీమ్ బుధవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేన్ విలియమ్సనే తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. 'అందమైన బేబీ గర్ల్‌ను నా కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఈ అనుభూతి మాటల్లో వర్ణించలేనిది.'అని తన పాప ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు.

ఇక శుభవార్త తెలిపిన కేన్ విలియమ్సన్‌కు యావత్ క్రికెట్ ప్రపంచం అభినందనలు తెలుపుతుంది. సోషల్ మీడియా వేదికగా మాజీ, సహచర ఆటగాళ్లు కేన్‌కు విషెస్ తెలియజేస్తున్నారు. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు.. కేన్ మామకు తమదైన రీతీలో అభినందనలు తెలుపుతున్నారు.

ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన టెస్ట్‌ సిరీస్ సందర్భంగా తాను తండ్రి కాబోతున్న విషయాన్ని బయటపెట్టిన కేన్.. రెండో టెస్ట్‌కు పెటర్నిటీ లీవ్ మీద దూరమయ్యాడు. విలియమ్సన్ లేకున్నా ఇన్నింగ్స్ తేడాతో గెలిచిన కీవిస్ సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది.

అయితే ఇటీవల క్రికెటర్లందరికీ కూతుళ్లు పుట్టడం విశేషం. ముఖ్యంగా భారత క్రికెటర్లందరికి కూతుళ్లే. తాజాగా ఆ జాబితాలో విలియమ్సన్ కూడా చేరాడు. ఇక త్వరలోనే తండ్రి కాబోతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఈ జాబితాలో చేరుతాడో? లేదో చూడాలి?

Story first published: Wednesday, December 16, 2020, 13:43 [IST]
Other articles published on Dec 16, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+