Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గ్రేట్ ప్లేయర్ ట్యాగ్‌కు విరాట్ కోహ్లీ అన్ని విధాలా ఆర్హుడు

Virat Kohli Deserves Tag of a Great Player Without Doubt: Gatting

హైదరాబాద్: మోడ్రన్ డే క్రికెట్‌లో గ్రేట్ ప్లేయర్ ట్యాగ్‌కు విరాట్ కోహ్లీ అన్ని విధాలా ఆర్హుడని, అందులో ఎలాంటి సందేహం లేదని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, ఎంసీసీ ప్రపంచ క్రికెట్‌ కమిటీ ఛైర్మన్‌ మైక్‌ గట్టింగ్‌ పేర్కొన్నాడు. మూడు ఫార్మాట్లలోనూ నిలకడగా ఆడటం విరాట్ కోహ్లీ ఒక్కడికే సాధ్యమని మైక్ గాటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు.

అందుకే అతడు ఈ తరంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా నిలుస్తాడని కొనియాడాడు. ముంబైలో గురువారం 'ఫార్చున్ టర్నర్' పుస్తకావిష్కరణ కార్యక్రమానికి మైక్ గాటింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ పుస్తకాన్ని సచిన్ బజాజ్, ఆదిత్య భూషన్‌లు రచించారు. ఈ పుస్తకంలో భారత స్పిన్నర్లు బిషన్ సింగ్ బేడి, బి చంద్రశేఖర్, ఎరపల్లి ప్రసన్న, ఎస్ వెంకటరాఘవన్‌ల విశేషాలతో రూపొందించబడింది.

మూడు ఫార్మాట్లలోనూ రాణించడం కోహ్లీకే సాధ్యమైంది

మూడు ఫార్మాట్లలోనూ రాణించడం కోహ్లీకే సాధ్యమైంది

అయితే, మూడు ఫార్మాట్లలోనూ రాణించడం కోహ్లీకే సాధ్యమైందని మరే ఇతర ఆటగాడు అలా ఆడటం లేదని గాటింగ్ తెలిపాడు. "అతడు(కోహ్లీ) టెస్టు క్రికెట్ గురించి గతంలో చెప్పాడు. మీరు గొప్ప ఆటగాడిగా పరిగణించబడాలంటే, టెస్ట్ క్రికెట్ ఆడాలి. ఇది అద్భుతమైనది. అతను అన్ని రకాల ఫార్మాట్లను గొప్పగా ఆడుతున్నాడు. ఇతర క్రికెటర్లను ఇలా చూస్తారని నేను అనుకోను, బహుశా అది సాధ్యం కాకపోవచ్చు" అని అన్నాడు.

మా తప్పేమీ లేదు.. పృథ్వీ షా డోపింగ్‌ వివరాలు వెల్లడించిన బీసీసీఐ

రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు

రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు

ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో భాగంగా ఎడ్జిబాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు సాధించిన స్టీవ్ స్మిత్‌పై కూడా మైక్ గాటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. యాషెస్ సిరీస్‌ తొలి టెస్టులో స్మిత్ అదరగొట్టాడని, అతడు సాధించిన రెండు సెంచరీల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడని చెప్పాడు.

ఇంగ్లాండ్ పుంజుకోవడం ఓ సవాలే

ఇంగ్లాండ్ పుంజుకోవడం ఓ సవాలే

యాషెస్ సిరిస్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుకు తిరిగి పుంజుకోవడం ఓ సవాలేనని మైక్ గాటింగ్ తెలిపాడు. "ఇంగ్లాండ్ ఇప్పుడు ఎక్కడానికి భారీ కొండను కలిగి ఉంది. ప్రతి టెస్ట్ మ్యాచ్ ఫలితాన్ని పొందబోతున్నందున ఇది ఆసక్తికరమైన సిరీస్ అవుతుందని నేను భావిన్నాను. ప్రతి మ్యాచ్ ముగిసిన తర్వాత ఎవరు త్వరగా కోలుకుంటారనేది ఆసక్తిగా ఉంటుంది" అని గాటింగ్ అన్నాడు.

శుభమాన్ గిల్ డబుల్ సెంచరీ: 17 ఏళ్ల గంభీర్ రికార్డు బద్దలు

స్మిత్‌ను ఔట్‌ చేయడమే

స్మిత్‌ను ఔట్‌ చేయడమే

ఇకపై జరిగే యాషెస్ టెస్టుల్లో స్టీవ్ స్మిత్‌ను ఔట్‌ చేయడమే ఇంగ్లాండ్‌ జట్టుకు సవాల్‌గా మారనుందని మైక్‌ అన్నాడు. "స్మిత్‌ను ఇంగ్లాండ్ బౌలర్లు ఎంత త్వరగా ఔట్ చేస్తారనేది ఇకపై చూసేందుకు ఆసక్తికరంగా ఉంటుంది. ఆస్ట్రేలియా అభిమాన జట్టు కాదని నేను అనడం లేదు... కాని వారి బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా లేదని చెప్తున్నాను. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా మంచి స్థానంలో ఉంది" అని అన్నాడు.

Story first published: Friday, August 9, 2019, 15:23 [IST]
Other articles published on Aug 9, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+