Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia, 2nd ODI మ్యాచ్ టర్నింగ్ పాయింటే అదే.. కొంపముంచిన కోహ్లీ నిర్ణయాలు!

Virat Kohli Captaincy blunders in 2nd ODI against Australia

హైదరాబాద్: ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీసేన వైఫల్యం కొనసాగుతుంది. ఫస్ట్ వన్డేలో 66 పరుగులతో ఓడిన భారత జట్టు.. రెండో వన్డేలోనూ 51 పరుగులతో ఓటమిపాలైంది. ఫలితంగా మరో మ్యాచ్ మిగిలుండగానే 0-2తో సిరీస్‌ను చేజార్చుకుంది. ఓవైపు ఆసీస్ బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్‌లో అదరగొట్టగా.. భారత్ పేలవ బౌలింగ్‌తో మూల్యం చెల్లించుకుంది. గత ఓటమి నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకోని భారత్ అవే తప్పిదాలను పునరావృతం చేస్తూ ప్రత్యర్థికి తల వంచింది. ముఖ్యంగా బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. కెప్టెన్‌ విరాట్ కోహ్లీ కూడా ఘోర తప్పిదాలు చేశాడు. సారథిగా అతను చేసిన మూడు తప్పిదాలు భారత విజయవకాశాలను దెబ్బతీశాయి.

నవ్‌దీప్ సైనీని కొనసాగించడం..

నవ్‌దీప్ సైనీని కొనసాగించడం..

ఫస్ట్ వన్డేలో పూర్తిగా తేలిపోయిన నవ్‌దీప్ సైనీని రెండో వన్డేలోనూ కోనసాగించడం ఆశ్చర్యానికి గురిచేసింది. పైగా అతను వెన్నుగాయంతో ఇబ్బంది పడుతున్నాడు. అయినా టీమ్‌మేనేజ్‌మెంట్ అతనిపైనే నమ్మకం ఉంచడం భారత బౌలింగ్ విభాగంపై ప్రభావం చూపింది. సైనీ బౌలింగ్‌లో వేగం ఉన్నప్పటికీ నియంత్రణ ఉండదు. దాన్ని అవకాశంగా మలుచుకున్న ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ఫస్ట్ మ్యాచ్‌లో 80 పరుగులు బాదితే.. తాజా మ్యాచ్‌లో 70 పరుగులు పిండుకున్నారు. ఈ మ్యాచ్‌లోనైతే సైనీ పూర్తిగా లయ తప్పాడు. ఓ నోబాల్‌తో పాటు పలు వైడ్లు వేశాడు. ఆఖరి ఓవర్‌లో ఏకంగా 15 పరుగులు సమర్పించుకున్నాడు. గాయంతో ఇబ్బంది పడుతున్నా.. అతన్ని ఆడించడంపై విమర్శకులు పెదవి విరుస్తున్నారు. కెప్టెన్ కోహ్లీ బ్లండర్ మిస్టేక్‌గా పరిగణిస్తున్నారు.

పాండ్యాతో బౌలింగ్ చేయించకపోవడం..

పాండ్యాతో బౌలింగ్ చేయించకపోవడం..

ఫస్ట్ మ్యాచ్‌లో సిక్త్స్ బౌలింగ్ ఆప్షన్ లేక ఇబ్బంది పడ్డ భారత్.. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా, మయాంక్ అగర్వాల్‌తో ఆ లోపాన్ని సవరించుకునే ప్రయత్నం చేసింది. కానీ విరాట్ కోహ్లీ నిర్లయ లోపం వల్ల అది భారత విజయానికి కలిసిరాలేదు. పునరాగమనంలో తొలిసారి బంతిని అందుకున్న హార్దిక్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 36వ ఓవర్‌లో బంతిని అందుకున్న పాండ్యా.. నాలుగు ఓవర్లు వేసి కీలక వికెట్ అయిన స్మిత్‌ను ఔట్ చేయడంతో పాటు 24 పరుగులే ఇచ్చాడు. అయితే హార్దిక్‌కు ముందే బౌలింగ్ చేసుంటే ఫలితం మరోలా ఉండేది.

తరుచూ బౌలింగ్ మార్చడం..

తరుచూ బౌలింగ్ మార్చడం..

జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ వంటి దిగ్గజ పేసర్లు, ఏ క్షణంలోనైనా మ్యాచ్‌ను తిప్పే స్పిన్నర్ చాహల్ ఉన్నప్పటికీ భారత జట్టు బౌలింగ్ విభాగం రాణించలేకపోతుంది. దారళంగా పరుగులిస్తూ దారుణంగా విఫలమవుతుంది. అయితే దీనికి కెప్టెన్ విరాట్ కోహ్లీ అనుసరిస్తున్న విధానమే కారణమని తెలుస్తోంది. తరుచూ బౌలర్లను మార్చడం ప్రత్యర్థికి కలిసిరాగా.. బౌలర్లను నిలకడగా బౌలింగ్ చేయకుండా చేస్తుంది. బ్యాట్స్‌మెన్‌కు క్రీజులో సెటిల్ అయి ఆడేందుకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. 30 నుంచి 35 ఓవర్ల మధ్య ఒక్క బౌలర్ కూడా రెండు ఓవర్లు వేయలేదంటే.. కోహ్లీ ఎంతలా బౌలర్లను మారుస్తున్నాడో అర్థం అవుతుంది.

ఆ క్యాచ్ టర్నింగ్ పాయింట్..

ఆ క్యాచ్ టర్నింగ్ పాయింట్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లకు 389 రన్స్ చేసింది. స్టీవ్ స్మిత్ (104) మరో సెంచ‌రీతో చెలరేగగా.. ఓపెన‌ర్లు డేవిడ్ వార్న‌ర్‌ (83), ఆరోన్ ఫించ్‌ (60) హాఫ్ సెంచరీలతో రాణించారు. వీరికి తోడుగా మార్నస్ లబుషేన్ (70‌) ‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్ (63) ధాటిగా ఆడటంతో భారత్ ముందు 390 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. ఈ లక్ష్యచేధనకు దిగిన భారత్.. ఆదిలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయినా కెప్టెన్ విరాట్ కోహ్లీ(89), అయ్యర్(39) నిలకడైన ఆటతో రేసులో ఉన్నట్లు అనిపించింది. అయితే క్రీజులో కుదురుకున్న ఈ జోడీని స్మిత్ సూపర్ క్యాచ్‌తో విడదీశాడు. అయ్యర్ ఆడిన షాట్‌ను సూపర్ డైవ్‌తో అందుకున్నాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 73 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. స్మిత్ కనుక ఈ క్యాచ్ పట్టకుంటే పరిస్థితి మరోలా ఉండేది. తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మన్‌పై ఒత్తిడి ఉండేది కాదు. మ్యాచ్ అనంతరం విరాట్ కూడా ఇదే చెప్పాడు.

India vs Australia: అయిపాయే.. కోహ్లీసేన వన్డే సిరీస్ కోల్పోయే!

Story first published: Sunday, November 29, 2020, 19:07 [IST]
Other articles published on Nov 29, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+