Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హార్దిక్ పాండ్యాతో పోల్చుకుంటే నాకే నష్టం: విజయ్ శంకర్

Vijay Shankar Says It will affect my game if I think about competing with Hardik Pandya

చెన్నై: టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో నెలకొన్న పోటీ గురించి ఆలోచిస్తే తనకే నష్టమని యువ ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ తెలిపాడు. పాండ్యాతో పోల్చుకుంటూ ఉంటే తన సహజసిద్ధ ఆట ఆడలేనన్నాడు. 2019 వన్డే ప్రపంచకప్‌ జట్టులో అనూహ్యంగా అవకాశాన్ని దక్కించుకున్న విజయ్ శంకర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. గాయంతో మెగాటోర్నీ మధ్యలోనే వెనుదిరిగాడు. అనంతరం హార్దిక్ పాండ్యా కూడా గాయపడ్డా.. విజయ్ శంక‌ర్‌కు అవకాశం దక్కలేదు. కనీసం అతని పేరును కూడా భారత సెలక్టర్లు పరిశీలించలేదు. మరో ఆల్‌రౌండర్ శివమ్ దూబేకి వరుసగా అవకాశాలిచ్చారు. అతను కూడా అంచనాల్ని అందుకోలేకపోయాడు.

 ఐపీఎల్‌పై ఆశలు..

ఐపీఎల్‌పై ఆశలు..

అయితే గతేడాది చివరి నుంచి దేశవాళీ క్రికెట్‌లో తమిళనాడు తరఫున రెగ్యులర్‌గా మ్యాచ్‌లాడిన విజయ్ శంకర్.. తన ఆటని మెరుగుపర్చుకున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ 2020 సీజన్‌లో ఫామ్ నిరూపించుకుని మళ్లీ సెలక్టర్ల దృష్టిలో పడాలని ఆశించాడు. అయితే.. కరోనా వైరస్ కారణంగా ఈ టోర్నీని బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేయడంతో అతని ఆశలు అడియాశలయ్యాయి. తాజాగా ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రస్తుతం మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలుచేయడంపైనే తన దృష్టి నెలకొందన్నాడు.

తండ్రిని ఎక్కించుకొని 1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన అమ్మాయికి బంపరాఫర్!

 పోలికే అనవసరం..

పోలికే అనవసరం..

‘హార్దిక్ పాండ్యాతో పోల్చుకుంటూ ఆడితే నా ఆట దెబ్బతింటుంది. ఏకాగ్రత కోల్పోవడంతో పాటు సహజ సిద్దంగా ఆడలేకపోతున్నా. పాండ్యా గురించి పట్టించుకోకుండా మ్యాచ్‌లు ఆడుతుంటే మాత్రం గెలిపించే ప్రదర్శన కనబర్చుగలుగుతున్నా. నేను మెరుగ్గా రాణించగలిగితే అందరూ నా గురించి మాట్లాడతారు. అప్పుడు నాకు టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం కూడా దొరుకుతుంది. కాబట్టి.. ఇతర ఆటగాళ్ల గురించి ఆలోచించడాన్ని నేను పూర్తిగా మానేశా'' అని విజయ్ శంకర్ వెల్లడించాడు.

వరల్డ్‌కప్‌లో ఆడుంటే..

వరల్డ్‌కప్‌లో ఆడుంటే..

అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నప్పుడు అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించడం ప్రధానమని ఈ తమిళనాడు ప్లేయర్ చెప్పుకొచ్చాడు. అలా చేసినప్పుడే ఎక్కువకాలం కెరీర్‌ కొనసాగుతుందన్నాడు.‘మిడిలార్డర్‌లో ఆడితే జట్టు అవసరాల దృష్ట్యా అర్ధసెంచరీలు చేసే అవకాశం మాత్రమే దక్కుతుంది. అదే టాపార్డర్‌లో మూడు లేదా నాలుగో స్థానాల్లో బరిలో దిగితే భారీ ఇన్నింగ్స్‌లు ఆడొచ్చు. ప్రపంచకప్‌లో వచ్చిన అవకాశాలను వినియోగించుకోలేకపోయా. రెండు మ్యాచ్‌ల్లోనూ పెద్దగా పరుగులు చేయలేకపోయా. అంతకుముందు న్యూజిలాండ్‌ పర్యటనలో బాగానే ఆడా. మెగాటోర్నీలోనూ భారీ స్కోరు చేసుంటే నా పరిస్థితి వేరేలా ఉండేది' అని అన్నాడు.

విశాఖలో ధోనీ విధ్వంసాన్ని ఊహించలేదు.. అలాంటి ఇన్నింగ్స్ మళ్లీ చూడలేదు: కైఫ్

 విజయ్ శంకర్ వల్లే..

విజయ్ శంకర్ వల్లే..

ఇక వరల్డ్‌కప్‌లో భారత ఓటమికి విజయ్ శంకర్ కూడా ఓ కారణమని కొంతమంది అభిమానులు, విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు. అంతర్జాతీయంగా అనుభవమున్న అంబటి రాయుడిని కాదని విజయ్ శంకర్, రిషభ్ పంత్‌లను ఎంపిక చేయడమే టీమ్ మేనేజ్‌మెంట్ చేసిన పెద్ద తప్పని, న్యూజిలాండ్‌తో సెమీఫైనల్ మ్యాచ్‌లో రాయుడు ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని కామెంట్ చేస్తూంటారు.

Story first published: Friday, May 22, 2020, 11:25 [IST]
Other articles published on May 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+