2007 టీ20 ప్రపంచకప్‌లో ఆ పరిస్థితిని ముందే ఊహించి ధోనీని సిద్దం చేసా: వెంకటేశ్ ప్రసాద్

న్యూఢిల్లీ: 2007 టీ20 ప్రపంచకప్.. క్రికెట్‌లో ఓ విప్లవాన్ని తీసుకొచ్చిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్స్ జరుగుతున్నాయన్నా.. మొదట్లో వ్యతిరేకించిన క్రికెట్ పెద్దన్న బీసీసీఐ.. ఇప్పుడు ఈ ఫార్మాట్‌ను నెత్తిన పెట్టుకుందన్నా ఈ టోర్నీ చలవే. అయితే అప్పటి వరకు చూసిన ఆటకు భిన్నంగా ఉండటం.. ఆటగాళ్ల ధనాధన్ బ్యాటింగ్, కళ్లు చెమర్చే బౌలింగ్.. ఔరా అనిపించే ఫీల్డింగ్ అభిమానులను ఆకట్టుకుంది.
అయితే ఆ అరంగేట్ర ప్రపచంకప్ సమయంలో ఈ పొట్టి ఫార్మాట్‌కు సంబంధించిన రూల్స్ అటు ఆటగాళ్లకు ఇటు అభిమానులకు అంతగా తెలియదు. ఇరు జట్ల మధ్య టై అయితే ఇప్పుడు సూపర్ ఓవర్‌తో ఫలితాన్ని తేలుస్తున్నారు. కానీ ప్రారంభంలో బౌల్-ఔట్ పద్దతిని అనుసరించేవారు. ఫుట్‌బాల్, హాకీ ఆటల్లోని షూట్ ఔట్‌ను చూసి ఈ బాల్‌ఔట్ నిబంధనను రూపొందించారు. అయితే అరంగేట్ర ప్రపంచకప్‌లో భారత్ ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఈ పద్దతిని ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

3-0తో భారత్ గెలుపు..
పాకిస్థాన్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 141 పరుగులు చేసింది. రాబిన్ ఊతప్ప(50), మహేంద్ర సింగ్ ధోనీ(33) మినహా అంతా విఫలమయ్యారు. అనంతరం బ్యాటింగ్ దిగిన పాకిస్థాన్ కూడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 141 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. అనంతరం జరిగిన బౌల్ ఔట్‌లో భారత్ 3-0తో గెలిచింది. టీమిండియా తరఫున సెహ్వాగ్, ఊతప్ప, హర్భజన్ బౌలింగ్ చేసి పాయింట్లు సాధించగా.. పాక్ తరఫున ఉమర్ గుల్, షాహిద్ అఫ్రిది, యాసిర్ అరాఫత్ విఫలమయ్యారు.

ప్రాక్టీస్‌లో ఓ అంచనాకు వచ్చి..
అయితే ఆ మెగాటోర్నీలో ఈ పరిస్థితి వస్తుందని ముందే ఊహించి దానికి తగ్గట్టు ఆటగాళ్లను సిద్దం చేశామని నాటి బౌలింగ్ కోచ్, భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ తెలిపాడు. మ్యాచ్ టై అయితే బౌల్ ఔట్ పద్దతిని ఉపయోగిస్తారని ఆటగాళ్లను ఆ దిశగా శిక్షణనిచ్చానన్నాడు. ముఖ్యంగా నాన్ రెగ్యూలర్ బౌలర్లు సెహ్వాగ్, ఊతప్పతో ప్రాక్టీస్ చేయించి ఎవరు స్థిరంగా వికెట్లు తీయగలుగుతున్నారనే ఓ అంచనాకు వచ్చానని తెలిపాడు.
తీరా ఫస్ట్ మ్యాచ్‌లోనే ఆ పరిస్థితి రావడంతో సెహ్వాగ్, ఊతప్ప, భజ్జీలతో బౌలింగ్ చేయించాలని ధోనీని ఒప్పించానన్నాడు. తాజాగా భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకటేశ్ ప్రసాద్ టీ20 ప్రపంచకప్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

ముందే తెలుసు..
‘ప్రపంచకప్ టోర్నీకి వెళ్లే ముందే పొట్టి ఫార్మాట్ నిబంధనలను తెలుసుకున్నాం. మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ ఉండదని, బౌల్ ఔట్ ఉంటుందని తెలుసు. దాంతో మేం తరుచూ బౌల్ ఔట్ ప్రాక్టీస్ చేసేవాళ్లం. నెట్స్‌లో బ్యాట్స్‌మెన్, బౌలర్ల మధ్య ఈ విధానంలో పోటీ పెట్టేవాళ్లం. ఎక్కువగా ధోనీ, సెహ్వాగ్, ఊతప్ప వంటి బ్యాట్స్‌మెనే అద్భుతంగా రాణించేవారు. వారు నెట్స్‌లో బౌల్ ఔట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నేను వారి వెనుకాలే ఉండి ఎవరెవరూ స్థిరంగా వికెట్లను హిట్ చేస్తున్నారా? అని గమనించేవాడిని.

అస్సలు ఊహించలేదు..
అప్పుడు సెహ్వాగ్, ఊతప్ప, హర్భజన్ అద్భుతంగా హిట్ చేయడం చూశా. కానీ మా తొలి మ్యాచ్‌లోనే బౌల్-ఔట్ ఎదుర్కోవాల్సి వస్తుందని ఎవరం ఊహించలేకపోయాం. అది చాలా టైట్ గేమ్. బౌల్ ఔట్‌లో ఏ ఆటగాళ్లతో బౌలింగ్ చేయించాలో ధోనీని సులువుగా ఒప్పించాను. మేం మా అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నాం. స్లో బౌలర్లు శరీరాన్ని సమన్వయం చేసుకోగలరని, నేరుగా వికెట్లకు బంతి హిట్ చేయగలరనే నమ్మకంతో సెహ్వాగ్, ఊతప్పలకు అవకాశం ఇచ్చాం.'అని వెంకటేశ్ ప్రసాద్ తెలిపాడు.
ఆరోజు సచిన్ అలా చేయకుంటే సెహ్వాగ్ ఇంత సక్సెస్ సాధించేవాడు కాదు
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications