
నాలుగో స్థానంలో..
ఆ రోజు సెహ్వాగ్ కోసం సచిన్ నాలుగో స్థానంలో ఆడుతానని చెప్పకుండా ఉంటే భారత జట్టుకు ఓ విధ్వంసకర ఓపెనర్ మిస్ అయ్యేవాడని చెప్పుకొచ్చాడు. హిందూస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అజయ్ రత్రా ఈ విషయాన్ని వెల్లడించాడు.
‘ఓపెనర్‌గా సచిన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. కానీ సెహ్వాగ్ కూడా ఓపెనర్‌గా బరిలోకి దిగాలి. దీంతో సచిన్ అతని కోసం తన ఓపెనింగ్ స్లాట్‌ను త్యాగం చేశాడు. నెంబర్ 4లో ఆడుతానని చెప్పాడు. దీంతో సౌరవ్ గంగూలీతో కలిసి సెహ్వాగ్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ నేపథ్యంలో ఈ ఇద్దరు ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఒకవేళ సచిన్ నాలుగో స్థానంలో ఆడుతానని చెప్పకుంటే.. సెహ్వాగ్ ఓపెనర్‌గా ఆడేవాడు కాదు. అదే జరిగి ఉంటే సెహ్వాగ్ క్రికెట్ కెరీర్ భిన్నంగా ఉండేది.'అని అజయ్ రత్రా తెలిపాడు.

సచిన్ గాయంతో ఓపెనర్‌గా..
ఇక కెరీర్ ప్రారంభంలో మిడిలార్డర్‌లొ ఆడే సెహ్వాగ్‌కు 2001లో తొలి సారి ఓపెనర్‌గా ప్రమోషన్ లభించింది. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు సచిన్ గాయంతో దూరమవడంతో అప్పటి కెప్టెన్ దాదా సెహ్వాగ్‌కు ఓపెనర్‌గా ఆడే అవకాశం ఇచ్చాడు. ప్రారంభంలో కొన్ని మ్యాచ్‌ల్లో విఫలమైన ఈ విధ్వంసకరం బ్యాట్స్‌మన్.. చివరకు న్యూజిలాండ్‌పైనే సెంచరీతో చెలరేగాడు.
ఇక గాయం నుంచి కోలుకున్న సచిన్ జట్టులోకి రాగానే సెహ్వాగ్ మళ్లీ మిడిలార్డర్‌లో ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో సెహ్వాగ్ కోసం సచిన్ తనంతట తానే నాలుగో స్థానంలో ఆడుతానని చెప్పడంతో వీరూ ఇన్నింగ్స్ ప్రారంభించాడని ఆ సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన అజయ్ రత్రా గుర్తుచేసుకున్నాడు.

విభిన్నమైన పాత్ర..
‘సచిన్ జట్టులో విభిన్నమైన పాత్రను ఎంచుకున్నాడు. తనకు తానుగా నాలుగో స్థానంలో ఆడుతానని చెప్పాడు. 45 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేయడమే కర్తవ్యంగా పెట్టుకున్నాడు. సచిన్ నిర్ణయంతో టాప్‌లో ఆడిన సెహ్వాగ్ అద్భుతంగా రాణించాడు. అతను ఎవరూ ఏది చెప్పినా వినేవాడు కాదు. బ్యాడ్ షాట్స్ ఆడుతున్నావని చెప్పినా పట్టిచ్చుకోకుండా తన సహజసిద్దమైన ఆటనే ఆడేవాడు' అని అజయ్ రత్రా చెప్పుకొచ్చాడు.

2003 ప్రపంచకప్ వరకు..
ఇక సెహ్వాగ్-గంగూలీ ఓపెనర్లుగా.. సచిన్ నాలుగో స్థానంలో 2003 వన్డే ప్రపంచకప్ వరకు ఆడారు. ఈ మధ్యలో చిరస్మరణీయ 2001 నాట్‌వెస్ట్ సిరీస్‌ను గెలిచారు. శ్రీలంక వేదికగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీని షేర్ చేసుకున్నారు. ఇక 2003 ప్రపంచకప్‌లో మాత్రం సెహ్వాగ్-సచిన్ ఇన్నింగ్స్ ప్రారంభించగా.. గంగూలీ ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ చేశాడు. భారత తరఫున 214 వన్డేలు ఆడిన సెహ్వాగ్ 8273 పరుగులు చేశాడు. అతను చేసిన 15 సెంచరీల్లో 14 ఓపెనర్‌గా సాధించినవే.
మిథాలీ రాజ్ వేటు వెనుక చాలా పెద్దోళ్లున్నారు: హర్మన్‌ప్రీత్ కౌర్


Click it and Unblock the Notifications
